Share News

Weather updates: తీరం దాటిన ‘దాన’ తీవ్ర తుఫాన్..

ABN , Publish Date - Oct 25 , 2024 | 08:37 AM

విశాఖపట్నం: బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర తుఫాన్ దాన.. శుక్రవారం తెల్లవారు జామున పూరి సమీపంలోని ధమ్రా- హబలి ఖాతి మధ్య ప్రాంతంలో తీరాన్ని దాటింది. దీంతో ఈ ప్రాంతంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. గంటకు వంద నుంచి నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాళ్లు తీరం దాటి సమయంలో వీస్తున్నాయి.

Weather updates: తీరం దాటిన ‘దాన’  తీవ్ర తుఫాన్..

విశాఖపట్నం: బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర తుఫాన్ (Cyclone) దానా (Dana).. శుక్రవారం తెల్లవారు జామున పూరి సమీపంలోని ధమ్రా- హబలి ఖాతి (Dhamra- Habali Khati) మధ్య ప్రాంతంలో తీరాన్ని (Coast) దాటింది. దీంతో ఈ ప్రాంతంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు (Rains) కురుస్తున్నాయి. గంటకు వంద నుంచి నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాళ్లు తీరం దాటి సమయంలో వీస్తున్నాయి. ఇప్పుడు పశ్చిమ వాయువ్య దిశగా కదులుతుంది... ఇది క్రమంగా బలహీనపడే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉత్తర ఒరిస్సా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీని ప్రభావంతో ఉత్తరకొస్తా జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. శనివారం ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కూడా అక్కడక్కడ వర్షాలు పడడానికి ఆస్కారం ఉంది.

ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ మాట్లాడుతూ.. హబాలి ఖాతి నేచర్ క్యాంప్‌, ధమ్రాకు సమీపంలో తుపాన్ 'దానా' తీరం దాటిందని, రాత్రి 1:30 గంటల నుంచి శుక్రవారం తెల్లవారుజాము 3:30 గంటల మధ్య తీరం దాటిందన్నారు. ల్యాండ్‌ఫాల్ ప్రక్రియ మరో 2-3 గంటల పాటు కొనసాగుతుందని, ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ మధ్యాహ్నం నుంచి క్రమంగా బలహీనపడుతుందని, ఉత్తరాంధ్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రోణంకి కూర్మనాథ్ సూచించారు.


తప్పిన ముప్పు

మరోవైపు దానా తుపానుతో రాష్ట్రానికి ముప్పు తప్పింది. తూర్పు మధ్య బంగాళాఖాతంలోని తీవ్ర వాయుగుండం పశ్చిమ వాయవ్యంగా పయనించి బుధవారం నాటికి తుఫాన్‌గా బలపడింది. తరువాత వాయవ్యంగా గంటకు 12 కి.మీ. వేగంతో ప్రయాణిస్తూ రాత్రి 10 గంటలకు ఒడిసాలోని పారాదీప్‌కు 420 కి.మీ, ధామ్రాకు 450 కి.మీ, సాగర్‌ ద్వీపానికి (పశ్చిమ బెంగాల్‌) 500 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. దీనికి ఒమన్‌ దేశం సూచించిన ‘దానా’ అని పేరు పెట్టారు. తుఫాను వాయవ్యంగా పయనించే క్రమంలో తీవ్ర తుఫాన్‌గా బలపడి ఈరోజు ఉదయానికి వాయవ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించింది.

ఈ క్రమంలో తీవ్ర తుఫాన్ ఒడిసాలో తీరం దాటిన నేపథ్యంలో ఏపీకి ప్రత్యేకించి ఉత్తరాంధ్రకు ముప్పు తప్పింది. తీరం దాటే సమయంలో ఉత్తరాంధ్రలో పలుచోట్ల చెదురుమదురు వర్షాలు మాత్రమే కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఉత్తరాంధ్ర తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నందున ఈనెల 26 వరకు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని విశాఖ తుఫాన్‌ హెచ్చరిక కేంద్రం హెచ్చరించింది. విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం ఓడరేవులలో రెండో నంబరు హెచ్చరిక ఎగురవేశారు. కళింగపట్నం, భీమునిపట్నం ఓడరేవులకు సమాచారం అందించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు

ఎరక్కపోయి వచ్చి ఇరుక్కపోయాడు..

అమరావతికి రైల్వే లైన్‌..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Oct 25 , 2024 | 08:38 AM