Share News

Anitha: టీడీపీ కార్యకర్తలను చంపి ఢిల్లీ వెళ్లి అక్కడ దీక్షచేయడం ఏంటి: హోంమంత్రి అనిత

ABN , Publish Date - Jul 25 , 2024 | 01:24 PM

అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నాల్గవ రోజు గురువారం ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతోంది. ఈ సందర్బంగా హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ.. వైసీపీ సానుభూతి పరులపై దాడులు జరుగుతున్న విషయం వాస్తవమేనా అని వైసీపీ వాళ్లు ప్రశ్నవేసి సభకు రాలేదని ఎద్దేవా చేశారు.

Anitha: టీడీపీ కార్యకర్తలను చంపి ఢిల్లీ వెళ్లి అక్కడ దీక్షచేయడం ఏంటి: హోంమంత్రి అనిత

అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు (AP Assembly Meetings) నాల్గవ రోజు (4th Day) గురువారం ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాల సమయం (Question time) కొనసాగుతోంది. ఈ సందర్బంగా హోంమంత్రి వంగలపూడి అనిత (Home Minister Vangalapudi Anitha) మాట్లాడుతూ.. వైసీపీ (YCP) సానుభూతి పరులపై దాడులు జరుగుతున్న విషయం వాస్తవమేనా అని వైసీపీ వాళ్లు ప్రశ్నవేసి.. సభకు రాలేదని ఎద్దేవా చేశారు. నిజానికి టీడీపీ (TDP) వాళ్లను చంపి అదేదో తాము చేసినట్టు ఆరోపిస్తున్నారని, అధికారం కోల్పోయి.. 11 సీట్లు సాధించాక టీడీపీ కార్యకర్తలను చంపి ఢిల్లీ (Delhi) వెళ్లి అక్కడ దీక్షచేయడం ఏంటని ప్రశ్నించారు. ఎన్డీఏ ప్రభుత్వం (NDA Govt.,) అధికారంలోకి వచ్చాక నలుగురు చనిపోతే ముగ్గురు టీడీపీకి చెందిన వారు ఉన్నారని, దానికి సంభందించి కేసు నెంబర్లతో సహ వెల్లడించామని హోంమంత్రి తెలిపారు.


కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 36 రాజకీయ హత్యలు జరిగాయని వైసీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారని, వారి పేర్లు చెప్పమంటే మాట్లాడలేదని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. 36 మంది వివరాలు అసెంబ్లీకి వచ్చి ఇవ్వవచ్చుకదా.. అలా చేయకుండా ఢిల్లీ ఎందుకు వెళ్ళారని ఆమె ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో ఆత్మకూరుకు ప్రతిపక్షనేత చంద్రబాబు వెళ్ళాలనుకుంటే ఆయన ఇంటి గేటుకు తాళ్లు కట్టారని, పవన్ కళ్యాణ్‌ అమరావతి రైతుల వద్దకు వెళితే ముళ్లకంపలు వేశారని, యువగళం పాదయాత్రలో నారా లోకేష్‌కు స్టూల్ ఎక్కి నిల్చోవడానికి కూడా అనుమతి ఇవ్వలేదని హోంమంత్రి మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం మీడియాతో పాటు ఎవ్వరినీ వదలలేదు అనే విషయం మర్చి పోకూడదని.. ఇలాంటి భయానక వాతావరణంను గత అయిదు సంవత్సరాలు రాష్ట్రంలో సృష్టించారని అన్నారు.


పులివెందుల ఎమ్మెల్యే జగన్‌ను అడుగుతున్న.. 36 మంది చనిపోయారు అని అంటున్నారు. దానికి ఆయన సభకు వచ్చి ఆ వివరాలు ఇవ్వాలని హోంమంత్రి వంగలపూడి అనిత డిమాండ్ చేశారు. తాము చర్యలు తీసుకుంటామని.. అయితే జగన్ ఇచ్చిన వివరాలు తప్పు అని తేలితే ప్రభుత్వం తీసుకునే చర్యలకు భాద్యులవుతారని ఆమె హెచ్చరించారు. లోకేష్‌ రెడ్ బుక్ గురించి వైసీపీ కార్యకర్తలే పట్టించుకోవడం లేదని.. మరి జగన్‌కు ఎందుకు నిద్దర పట్టడం లేదో చెప్పాలని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

గంజాయి మత్తులో అనేక దారుణాలు: హోంమంత్రి అనిత

పవన్ తాటతీస్తున్నారు: పృథ్వీరాజ్

జగన్ బూమ్ బూమ్ రహస్యం...

తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు..

జగన్‌కు షాకిచ్చిన తిరుపతి కార్పొరేటర్లు..

హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jul 25 , 2024 | 01:24 PM