Share News

వరదలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ABN , Publish Date - Jul 27 , 2024 | 01:02 AM

ప్రస్తుత వరదల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐటీడీఏ పీవో వి.అభిషేక్‌ అన్నారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ఐటీడీఏ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. వరదల పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని, ప్రధానంగా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలుల సమయంలో సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలన్నారు. ఈదురుగాలులకు చెట్లు, విద్యుత్‌ స్తంభాలు విరిగిపడే ప్రమాదముందని, అనవసరంగా బయట తిరగవద్దని పీవో సూచించారు.

వరదలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
వినతలను పరిశీలిస్తున్న ఐటీడీఏ పీవో వి.అభిషేక్‌

ఐటీడీఏ పీవో వి.అభిషేక్‌ సూచన

మీ కోసంలో 75 వినతుల స్వీకరణ

పాడేరు, జూలై 26 (ఆంధ్రజ్యోతి): ప్రస్తుత వరదల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐటీడీఏ పీవో వి.అభిషేక్‌ అన్నారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ఐటీడీఏ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. వరదల పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని, ప్రధానంగా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలుల సమయంలో సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలన్నారు. ఈదురుగాలులకు చెట్లు, విద్యుత్‌ స్తంభాలు విరిగిపడే ప్రమాదముందని, అనవసరంగా బయట తిరగవద్దని పీవో సూచించారు.

మీ కోసంలో 75 వినతులు స్వీకరణ

ఐటీడీఏ కార్యాలయంలో పీవో అభిషేక్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో గిరిజనులకు నుంచి వివిధ సమస్యలపై 75 వినతులను అధికారులు స్వీకరించారు. తమ గ్రామానికి చెక్‌డ్యామ్‌ మంజూరు చేసి పంట పొలాలకు సాగు నీరు అందించాలని చింతపల్లి మండలం చౌడుపల్లి గ్రామానికి చెందిన వి.రామునాయుడు, పాంగి రాజారావు, జి.రాము, వి.గురుమూర్తి, కిల్లో గంగాధర్‌ కోరగా, హుకుంపేట మండలం అడ్డుమండ గ్రామానికి చెందిన జి.దేముడమ్మ వరదలకు తన ఇల్లు కూలిపోయిందని నష్టపరిహారం అందించాలని కోరారు. అలాగే అరకులోయ మండలం మడగడ పంచాయతీ గంగుడి గ్రామానికి చెందిన వి.సింగ్‌, వి.పిల్కు రేషన్‌కార్డులు కావాలని, ఇదే పంచాయతీ వంతమూరు గ్రామానికి చెందిన కె.శంకరరావు, కె.భగవాన్‌, కె.సింహాద్రి, కె.రఘునాఽథ్‌ తదితరులు తమ గ్రామానికి తాగునీటి సమస్య ఉందని తెలపగా, ఇదే మండలం పెదలబుడు పంచాయతీ తాగులగుడ గామ్రానికి చెందిన కిల్లో గోవర్దన్‌ తన వ్యవసాయ బోరుకు విద్యుత్‌ కనెక్షన్‌ ఇప్పించాలని కోరారు. అలాగే చింతపల్లికి చెందిన కాగి వెంకయమ్మ తన భూమిని ఆక్రమించారని, న్యాయం చేయాలని కోరారు. ఇలా గిరిజనులు తమ వ్యక్తిగత, సామాజిక సమస్యలపై అధికారులకు 75 వినతులను సమర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి బి.పద్మావతి, ఐటీడీఏ ఏపీవోలు వీఎస్‌.ప్రభాకరరావు, ఎం.వెంకటేశ్వరరావు, డీఆర్‌డీఏ పీడీ వి.మురళీ, గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్‌ శాఖ ఈఈలు డీవీఆర్‌ఎం.రాజు, వేణుగోపాల్‌, ఐసీడీఎస్‌ పీడీ ఎన్‌.సూర్యలక్ష్మి, జిల్లా ఉద్యావననాధికారి రమేశ్‌కుమార్‌రావు, హౌసింగ్‌ డీఈఈ వి.రాజబాబు, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jul 27 , 2024 | 01:02 AM