Share News

కల్వర్టులకు ప్రతిపాదనలు సిద్ధం చేయండి

ABN , Publish Date - Jul 27 , 2024 | 12:59 AM

మండలంలోని బొయితిలి పంచాయతీ రాసవీధి, కుంబిడిసింగి పంచాయతీ అండంగిసింగి కల్వర్టుల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని పాడేరు ఐటీడీఏ పీవో వి.అభిషేక్‌ టీడబ్ల్యూ ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు. ‘భారీ వర్షాలతో కల్వర్టులకు గండి’ శీర్షిక శుక్రవారం ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన వార్తపై పీవో స్పందించారు. గండి పడిన కల్వర్టులను శుక్రవారం ఆయన పరిశీలించారు. అండంగిసింగి కాజ్‌వేపై హైలెవెల్‌ వంతెన నిర్మాణానికి ప్రతిపాదనలు తయారుచేయాలని అధికారులను ఆదేశించారు.

కల్వర్టులకు ప్రతిపాదనలు సిద్ధం చేయండి
గండిపడిన రాసవీధి కల్వర్టును పరిశీలిస్తున్న పీవో అభిషేక్‌

ఇంజనీరింగ్‌ అధికారులకు పీవో అభిషేక్‌ ఆదేశం

కొట్టుకుపోయిన రాసవీధి, అండంగిసింగి కల్వర్టుల పరిశీలన

పెదలోచలి ఆశ్రమ పాఠశాల హెచ్‌ఎంకు షోకాజ్‌ నోటీసు

జి.మాడుగుల, జూలై 26: మండలంలోని బొయితిలి పంచాయతీ రాసవీధి, కుంబిడిసింగి పంచాయతీ అండంగిసింగి కల్వర్టుల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని పాడేరు ఐటీడీఏ పీవో వి.అభిషేక్‌ టీడబ్ల్యూ ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు. ‘భారీ వర్షాలతో కల్వర్టులకు గండి’ శీర్షిక శుక్రవారం ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన వార్తపై పీవో స్పందించారు. గండి పడిన కల్వర్టులను శుక్రవారం ఆయన పరిశీలించారు. అండంగిసింగి కాజ్‌వేపై హైలెవెల్‌ వంతెన నిర్మాణానికి ప్రతిపాదనలు తయారుచేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే పెదలోచలి పంచాయతీలో వర్షాలకు దెబ్బతిన ఇళ్లను పరిశీలించి, పరిహారం అందజేస్తామని బాధితులకు హామీ ఇచ్చారు. తియ్యమామిడి నుంచి మెట్టపాడు వరకు బీటీ రహదారి మంజూరు చేస్తామన్నారు. అనంతరం పెదలోచలి ఆశ్రమ పాఠశాలను పీవో అభిషేక్‌ తనిఖీ చేశారు. పాఠశాలలో 133 మందిగాను 94 మంది విద్యార్థులు ఉండడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. తొమ్మిదవ తరగతి విద్యార్థులకు పాఠాలు బోధించారు. పాఠాలు బోధించనందుకు, విద్యార్థులు గైర్హాజరుపై హెచ్‌ఎంకు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. తర్వాత కిల్లంకోట మార్గంలో బొయితిలి పంచాయతీ రాసవీధి సమీపంలో వర్షాలకు కొట్టుకుపోయిన కల్వర్టును పరిశీలించారు. బొయితిలి నుంచి కురిడేలు బీటీ రోడ్డు పనులు పూర్తయిన వెంటనే కల్వర్టు పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అలాగే తోకగరువు, జి.మాడుగుల పంచాయతీ బొంజంగి, కల్వర్టుల నిర్మాణాలకు నిధులు మంజూరు చేస్తామని, అందుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. అనంతరం జి.మాడుగుల పీహెచ్‌సీలో 15వ ఆర్థిక సంఘం నిధులతో నిర్మించిన పబ్లిక్‌ హెల్త్‌ యూనిట్‌ భవనాన్ని పరిశీలించారు. అక్కడి రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ఆయన వెంట గిరిజన సంక్షేమ శాఖ ఈఈ డీవీఆర్‌ఎం రాజు, డీఈఈ అనుదీప్‌, ఏఈ దుర్గాప్రసాద్‌, మండల ఇంజినీర్‌ అధికారి ఎస్‌.మాణిక్యం, తహసీల్దార్‌ నర్సమ్మ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 27 , 2024 | 12:59 AM