Share News

విశాఖ డెయిరీపై సభాసంఘం

ABN , Publish Date - Nov 21 , 2024 | 01:11 AM

విశాఖ డెయిరీపై సభా సంఘం వేయాలని శాసనసభ నిర్ణయించింది. సభ్యుల నుంచి అభిప్రాయాలు తీసుకున్నాక స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు ఈ నిర్ణయం తీసుకున్నారు. ముందుగా విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు మాట్లాడుతూ విశాఖ డెయిరీ నిధులు దుర్వినియోగం అవుతున్నాయని, డెయిరీని రైతులకు కాకుండా చేసి ఓ కుటుంబం సొంత ఆస్తిలా ఉపయోగించుకుంటున్నదని ఆరోపించారు.

విశాఖ డెయిరీపై సభాసంఘం

అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని

అసెంబ్లీలో ఎమ్మెల్యేల ఆరోపణ

డెయిరీని రైతులకు కాకుండా చేసి

ఓ కుటుంబం సొంత ఆస్తిలా

ఉపయోగించుకుంటున్నదని విమర్శ

విశాఖపట్నం, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి):

విశాఖ డెయిరీపై సభా సంఘం వేయాలని శాసనసభ నిర్ణయించింది. సభ్యుల నుంచి అభిప్రాయాలు తీసుకున్నాక స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు ఈ నిర్ణయం తీసుకున్నారు. ముందుగా విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు మాట్లాడుతూ విశాఖ డెయిరీ నిధులు దుర్వినియోగం అవుతున్నాయని, డెయిరీని రైతులకు కాకుండా చేసి ఓ కుటుంబం సొంత ఆస్తిలా ఉపయోగించుకుంటున్నదని ఆరోపించారు. గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ, డెయిరీలో చాలా అక్రమాలు ఉన్నాయని, వాటిని తొక్కి పెడుతున్నారన్నారు. అన్ని డెయిరీలు పాల సేకరణ ధర పెంచుతుంటే విశాఖ డెయిరీ తగ్గించి రైతులకు నష్టం కలిగిస్తోందన్నారు. సొసైటీ కింద ఏర్పాటైన డెయిరీని కంపెనీగా మార్చేసి కొందరు తమ చేతుల్లో ఉంచుకున్నారని, రైతుల పేరుతో నిధులు దుర్వినియోగం చేస్తున్నారన్నారు. మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ చాలాకాలంగా విశాఖ డెయిరీలో ఆర్థిక అవకతవకలు జరుగుతున్నాయని, విచారణ చేయించాలని డిమాండ్‌ చేశారు. దీనిపై స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు స్పందించి, సభ్యుల సూచన మేరకు సభాసంఘం వేస్తున్నామని చెప్పారు.

ఇసుక సరఫరాపై విజి‘లెన్స్‌’

విమానాశ్రయంలో నిర్మాణాలకు నాసిరకం సరఫరా?

విశాఖపట్నం, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం విమానాశ్రయంలో జరుగుతున్న సివిల్‌ పనులకు అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని తెలిసి విజిలెన్స్‌ అధికారులు బుధవారం దాడులు నిర్వహించి లారీలను పట్టుకున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. రక్షణ రంగ నిర్మాణాలకు నాణ్యమైన ఇసుకను వినియోగించాల్సి ఉండగా, నిబంధనలకు విరుద్ధంగా, సరైన పత్రాలు లేకుండా నాసిరకం ఇసుకను సరఫరా చేస్తున్నట్టు తెలిసింది. దీనిపై మైనింగ్‌ అధికారులు కూడా విచారణ చేపడితే పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.

Updated Date - Nov 21 , 2024 | 01:11 AM