Share News

వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

ABN , Publish Date - May 09 , 2024 | 12:42 AM

వ్యాధులు ప్రబలకుండా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా మలేరియా అధికారి టి.జగన్మోహన్‌రావు ఆదేశించారు.

వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

సీతంపేట: వ్యాధులు ప్రబలకుండా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా మలేరియా అధికారి టి.జగన్మోహన్‌రావు ఆదేశించారు. ఈ మేరకు ఆయన మండ లంలో దోనుబాయి పీహెచ్‌సీని మంగళవారం సందర్శించారు. ల్యాబ్‌ రికార్డులు తనిఖీ చేసి, జ్వరాలు ఏ మేరకు నమోదు అవుతున్నాయో పరిశీలించారు. జ్వర లక్షణాలున్న వారికి సత్వరమే రక్తపూతలు సేకరించి నివేదికలు తెలియజేయాలని అన్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని, పలు సూచనలు చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గర్భిణులు, బాలింతలు, శిశువుల్లో ఏ చిన్న ఆరోగ్య సమస్య తలెత్తినా వెంటనే హైరిస్క్‌గా పరిగణించి తగు చికిత్స అందించి పర్యవేక్షించాలని ఆదేశించారు. గ్రామాల్లో ఎవరికైనా జ్వర లక్షణా లు ఉంటే జాప్యం చేయక వెంటనే నివారణ పరీక్షలు జరిపి మలేరియా, డెంగ్యూగా గుర్తిస్తే ఉన్నతాధికారులకు తెలియజేయాలన్నారు. రక్తహీనత నివారణపై ఎక్కువగా దృష్టి సారించాలన్నారు. ఆశ కార్యకర్తలు, వారి పరిధిలో గర్భిణులు, బాలింతలు, కిల్కారివాయిస్‌ సందేశాన్ని వినేలా చూడాలన్నారు. గ్రామాల్లో డ్రైడే కార్యక్రమాలు పక్కాగా చేపట్టి, మలేరియా, డెంగ్యూ జ్వరాలు ప్రబలకుండా నివారణా చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎంవో సూర్యనారాయణ, వైద్యాధికారి డాక్టర్‌ జి.గిరీష్‌, సూపర్‌వైజర్లు దమయంతి, గంగమ్మ, ఎంటీఎస్‌ ఝాన్సీరాణి, ఏఎన్‌ఎంలు, ఎంఎల్‌హెచ్‌పీలు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - May 09 , 2024 | 12:42 AM