Share News

బొబ్బిలి ఖ్యాతిని ఇనుమడింపజేస్తా

ABN , Publish Date - May 09 , 2024 | 12:20 AM

‘బొబ్బిలికి చరిత్రలో ఎంతో పేరు ప్ర ఖ్యాతులు ఉన్నాయి. ఆ ఖ్యాతిని మరిం తగా ఇనుమడింపజేసే విధంగా రాజకీ యాలలో సేవలందించాలన్న లక్ష్యంతో పని చేస్తాను’ అని బొబ్బిలి టీడీపీ- జనసేన- బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఆర్‌వీఎస్‌కేకే రంగారావు (బేబీనాయన) అన్నారు.

బొబ్బిలి ఖ్యాతిని ఇనుమడింపజేస్తా
బొబ్బిలి నియోజకవర్గం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆర్‌వీఎస్‌కేకే రంగారావు

- గ్రామాలను అభివృద్ధి చేసి చూపిస్తా

- జనమంతా నా ఆత్మబంధువులే!

- టీడీపీ-జనసేన-బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఆర్‌వీఎస్‌కేకే రంగారావు (బేబీనాయన)

(బొబ్బిలి)

‘బొబ్బిలికి చరిత్రలో ఎంతో పేరు ప్ర ఖ్యాతులు ఉన్నాయి. ఆ ఖ్యాతిని మరిం తగా ఇనుమడింపజేసే విధంగా రాజకీ యాలలో సేవలందించాలన్న లక్ష్యంతో పని చేస్తాను’ అని బొబ్బిలి టీడీపీ- జనసేన- బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఆర్‌వీఎస్‌కేకే రంగారావు (బేబీనాయన) అన్నారు. ఎమ్మెల్యేగా గెలుపొందితే ఏయే కార్యక్రమాలు చేపట్టాలో స్పష్టమైన అవగాహన ఉందని చెప్పారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే...

సంపదను సృష్టించే సత్తా బాబుకే..

నారా చంద్రబాబు నాయుడుకు ఎంతో దూరదృష్టి ఉంది. సంపదను సృష్టించే సత్తా ఆయనకే ఉంది. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ధరలు ఆకాశాన్ని తాకాయి. యువత ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కోల్పోయారు. ఇష్టారాజ్యంగా అప్పులు వాడేశారు. ఆఖరికి రిజర్వు బ్యాంకులో ఉన్న బాండ్లను వేలం వేసే అర్హతను సైతం కోల్పోయి, రాష్ట్రానికి ఎంతో అప్రతిష్ఠను మూటగట్టారు. నా ఒక్కడి పదవి కోసం ఓటు వేయాలని కోరుకోవడం లేదు. రాష్ర్టానికి మేలు జరగాలన్న దృక్పథంతో ఓటును వినియోగించుకోవాలి.

సొంత గడ్డకు సేవ చేయాలని వచ్చా

బాల్య దశలోనే నాకు బొబ్బిలిపై వల్లమాలిన అభిమానం. విజయనగరం జిల్లా కరువు ప్రాంతం. అన్నిటా వెనుకబడిన ప్రాంతం. మా తాతగారు ఆర్‌ఎస్‌ఆర్‌కే రంగారావు ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ ప్రాంతంలో విద్య, ఇరిగేషన్‌ పరంగా విశేష సేవలందించారు. ఆయన స్ఫూర్తితో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించాం. ప్రతి గ్రామంలో మా మార్కు సేవకు చిహ్నంగా అనేక ఆనవాళ్లు కనిిపిస్తుంటాయి. పేదల కోసం ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లను వైసీపీ ప్రభుత్వం చంద్రబాబుపై కోపంతో పూర్తిగా మూసివేసింది. దీనితో అన్నార్తులంతా ఎంతో ఇబ్బందులు పడ్డారు. వారి కోసం సొంత డబ్బుతో అన్న క్యాంటీన్‌ నిర్వహిస్తున్నాం. రామభద్రపురం మండల కేంద్రంలో రైతుల కోసం అన్న క్యాంటీన్‌ను ఏర్పాటు చేశాం. ఈ రాష్ట్రాన్ని జగన్‌ బీహార్‌ కన్నా అధ్వానంగా తయారు చేశాడు. ఆయన మాత్రం అన్ని ప్రాంతాలలో ప్యాలెస్‌లు కట్టించుకొని రూ.కోట్లు గడించాడు. ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నాడు. ఓటు హక్కు పొందినవారంతా జాగృతులై రాష్ట్ర భవిష్యత్‌ కోసం విచక్షణతో వ్యవహరించాలి.

గంజాయి, డ్రగ్స్‌పై ఉక్కుపాదం

జగన్‌ పాలనలో గంజాయి, డ్రగ్స్‌ మాఫియా పెరిగిపోయింది. దీనిని పూర్తి స్థాయిలో అరికట్టకపోవడంతో దేశానికి పెద్ద సంపద అయిన యువత పూర్తిగా నష్టపోతున్నారు. ఆరోగ్యానికి ప్రమాదకరంగా మారిన నకిలీ మద్యాన్ని పారదోలి నాణ్యమైన మద్యం సరఫరా చేస్తాం. బొబ్బిలి పట్టణంలో అత్యాధునిక వసతులతో లైబ్రరీకి హంగులు కల్పిస్తాం. ప్రతి మండల కేంద్రంలో స్టడీ సర్కిల్స్‌ను ఏర్పాటు చేస్తాం. పాడైన రోడ్లకు టీడీపీ-జనసేన ప్రభుత్వ హయాంలో మహర్దశ ఉంటుంది. మాజీ సైనికోద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి.. పరిష్కారానికి కృషి చేస్తాను.

పరిశ్రమలకు ఊపిరి పోస్తాం

బొబ్బిలి ఏపీఐఐసీ గ్రోత్‌ సెంటరులో పరిశ్రమల ఏర్పాటు ముమ్మరం చేసి ఈ ప్రాంత ప్రజల కలలను సాకారం చేసేందుకు కృషి చేస్తాను. ఇందుకోసం అవసరమైన పారిశ్రామిక విధానం, విద్యుత్‌ పాలసీని ఎన్‌డీఏ కూటమి పకడ్బందీగా అమలు చేస్తుంది. మూతపడిన పరిశ్రమలను తెరిపించేందుకు కృషి చేస్తా. చక్కెర కర్మాగారాన్ని నిర్వహించగలిగే సమర్ధవంతమైన సంస్థలకు అప్పగించేందుకు కృషి చేస్తాను. ప్రభుత్వ సాయాన్ని అర్ధిస్తాం. రైతులకు, కార్మికులకు మేలు చేసేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తాం. ఇందులో రాజీ లేదు. అంతర్రాష్ట ప్రాంతాలకు అనుంధానంగా ఉన్న పారాది వేగావతి నదిపై బ్రిడ్జిని మా తాతగారి హయాంలో నిర్మించారు. బ్రిటీషు కాలం నాటి ఆ బ్రిడ్జి పూర్తిగా పాడైపోవడంతో మా సోదరుడు సుజయ్‌కృష్ణరంగారావు మంత్రిగా ఉన్నప్పుడు తెలుగుదేశం ప్రభత్వం నిధులు మంజూరు చేసింది. ఇప్పటికీ దాని పనులు ప్రారంభం కాలేదు.

తాగు, సాగునీటికి ప్రాధాన్యం

లోచర్ల, రాముడువలస తోటపల్లి ఎత్తిపోతల పథకాలను మూలకు చేర్చారు. వైసీపీ హయాంలో ఇరిగేషన్‌ రంగాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు. అధికారంలోనికి రాగానే తాగునీటి, సాగునీటి వనరులకు పెద్దపీట వేస్తాం. ప్రభుత్వ పరంగా జూనియర్‌, డిగ్రీ కళాశాలల ఏర్పాటుకు కృషి చేస్తాం. ఎన్టీఆర్‌ ప్రారంభించిన ప్రభుత్వ గురుకుల పాఠశాలను అభివృద్ధి చేస్తాం. చరిత్రాత్మకమైన ఐటీఐని అభివృద్ధి చేస్తాం. టిడ్కో ఇళ్లన్నిటినీ లబ్ధ్దిదారులకు అప్పగిస్తాం. అక్కడ మౌలిక సదుపాయాలు కల్పిస్తాం.

అందరూ సమాన పౌరులే

ప్రజాస్వామ్య వ్యవస్థలో పౌరులందరూ సమానమే. పేద-గొప్ప అనే తేడా లేదు. రాజుకు-రైతుకు జరుగుతున్న పోటీ అని చెప్పి ప్రజల్లో లేనిపోని భావాలను సృష్టించడానికి ప్రత్యర్థులు పన్నాగాలు చేస్తున్నారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల ప్రజలు నన్ను, మా కుటుంబాన్ని ఆత్మబంధువులుగానే చూసుకుంటున్నారు. రైతు, వ్యవసాయం అంటే ఏమిటో తెలియని వారు సైతం వీటి గురించి చెప్పుకోవడం సిగ్గు చేటు. జనం మనిషిగా బేబీనాయన ముద్రపడిపోవడంతో ప్రత్యర్థులు చీప్‌ ట్రిక్స్‌ చేసేందుకు నానా తంటాలు పడుతున్నారు. ఏ ఊరు వెళ్లినా అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఉప్పొంగిన ఉత్సాహంతో ఆదరిస్తున్నారు. బొబ్బిలిలో తెలుగుదేశం పార్టీ విజయపతాకను ఎగురవేయడం ఖాయం.

Updated Date - May 09 , 2024 | 12:20 AM