Share News

దటీజ్‌ దుర్గారావు

ABN , Publish Date - Nov 20 , 2024 | 11:46 PM

తండ్రి లేకపోవడం.. చూపు కనిపించకపోవడం ఆయనలో పట్టుదలను పెంచాయి. ఎన్ని ప్రతికూలతలు ఉన్నా ఏదో ఒక దారి తప్పక ఉంటుందని, ఆత్మవిశ్వాసంతో నెగ్గుకు రావొచ్చునని గట్టిగా నమ్మి సడలని గుండె ధైర్యంతో ముందుకెళ్లాడు. అంధుల క్రికెట్‌లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు.

దటీజ్‌ దుర్గారావు
కెప్టెన్‌గా ట్రీఫీ అందుకుంటున్న దుర్గారావు

దటీజ్‌ దుర్గారావు

భారత అంధుల క్రికెట్‌ కెప్టెన్‌గా రాణింపు

రేపటి నుంచి పాకిస్తాన్‌లో జరిగే టోర్నమెంట్‌కు హాజరు

వంగర, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): తండ్రి లేకపోవడం.. చూపు కనిపించకపోవడం ఆయనలో పట్టుదలను పెంచాయి. ఎన్ని ప్రతికూలతలు ఉన్నా ఏదో ఒక దారి తప్పక ఉంటుందని, ఆత్మవిశ్వాసంతో నెగ్గుకు రావొచ్చునని గట్టిగా నమ్మి సడలని గుండె ధైర్యంతో ముందుకెళ్లాడు. అంధుల క్రికెట్‌లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. కష్టాలను విజయానికి మెట్లుగా భావించి కృషి చేశాడు. క్రికెట్‌లో రోజురోజుకూ ప్రావీణ్యం పెంచుకుని భారత అంధుల క్రికెట్‌ టీంకు కెప్టెన్‌ అయ్యాడు. ఈ నెల 22 నుంచి పాకిస్తాన్‌లో జరిగే టోర్నమెంట్‌కు హాజరవుతున్నాడు. ఆయనెవరో కాదు వంగర మండలం కొప్పరకొత్తవలసకు చెందిన దుర్గారావే. జాతీయ స్థాయిలో అద్భుతంగా రాణిస్తూ జిల్లాపేరును చాటుతున్నాడు.

- 2014లో జరిగిన అంధుల క్రికెట్‌ జాతీయ స్థాయి పోటీల్లో మంచి ప్రతిభ కనబరిచాడు. తద్వారా దక్షిణాఫ్రికాలో జరిగిన ప్రపంచకప్‌ పోటీలకు ఎంపికయ్యాడు. అప్పట్లో పాకిస్థాన్‌పై జరిగిన టోర్నమెంట్‌లో ఎక్కువ పరుగులు సాధించిన క్రికెటర్‌గా మన్నన పొందాడు. 2018లో ప్రపంచ కప్‌ గెలుపులో కీలకంగా ఉన్నాడు. ఈ ఏడాది కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించాడు. తాజాగా టి 20 సారథిగా ఎంపికయ్యాడు. ఈ నెల 22 నుంచి డిసెంబరు 3 వరకు పాకిస్తాన్‌లో జరిగే టోర్నమెంట్‌కు నాయకత్వం వహిస్తున్నాడు. దుర్గారావు ప్రతిభను రాష్ట్రపతి ద్రౌపదిముర్ము, ప్రధాని మోదీ ప్రత్యేకంగా అభినందించారు. టీ 20 సారధిగా దేశానికి మంచి పేరు తీసుకురావడమే తన లక్ష్యమని దుర్గారావు ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపాడు.

Updated Date - Nov 20 , 2024 | 11:46 PM