Share News

కూటమి వస్తేనే రాష్ట్రంలో అభివృద్ధి: నాగమాధవి

ABN , Publish Date - May 09 , 2024 | 12:34 AM

తనకు ఒక్క సారి ఎమ్మెల్యేగా గెలిపించి అవకాశం ఇస్తే అభివృద్ధి రుచి చూపిస్తానని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి లోకం నాగమాధవి అన్నారు. మండలంలోని టెక్కలి, చంద్రంపేట,చినబూరాడపేట,పెద్ద బూరాడపేట,పారసాం, కొండవెలగాడ గ్రామాల్లో ఆమె బుధవారం పర్యటించారు.

కూటమి వస్తేనే రాష్ట్రంలో అభివృద్ధి: నాగమాధవి

నెల్లిమర్ల: తనకు ఒక్క సారి ఎమ్మెల్యేగా గెలిపించి అవకాశం ఇస్తే అభివృద్ధి రుచి చూపిస్తానని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి లోకం నాగమాధవి అన్నారు. మండలంలోని టెక్కలి, చంద్రంపేట,చినబూరాడపేట,పెద్ద బూరాడపేట,పారసాం, కొండవెలగాడ గ్రామాల్లో ఆమె బుధవారం పర్యటించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ తనకు ఒక్క అవకాశం ఇస్తే తారక రామ తీర్థ సాగర్‌ రిజర్వాయర్‌ను పూర్తి చేసి తక్కువ కాలంలోనే ప్రజలకు తాగునీరు, సాగునీరు అందిస్తానని అన్నారు. ప్రతి గ్రామంలో మురుగు నీటి పారుదల వ్యవస్థను ఆధునికీకరిస్తానని, విద్యుత్‌ దీపాలను ఏర్పాటుచేసి చీకటి పారద్రోలుతానని అన్నారు. గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి కర్రోతు బంగార్రాజు, పార్టీ నాయకుడు సువ్వాడ రవిశేఖర్‌, పార్టీ మండల అధ్యక్షుడు కడగల ఆనంద్‌కుమార్‌, గేదెల రాజారావు, తదితరులు పాల్గొన్నారు.

డెంకాడ: రాష్ట్రాభివృద్ధి చెందాలంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలని నెల్లిమర్ల ఎమ్మెల్యే అభ్యర్థి లోకం నాగమాధవి అన్నారు. మండలంలోని గొడ్డుపాలెం, వెదుళ్లవలస పంచాయతీల్లో మాజీ ఎంపీపీ కంది చంద్రశేఖర్‌రావు ఆధ్వర్యంలో ఆమె బుధవారం ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ నెల్లిమర్ల నియోజకవర్గ అభివృద్ధి తన బాధ్యతని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు పల్లె భాస్కరరావు, మాజీ జడ్పీటీసీ పతివాడ అప్పలనారాయణ, బూర్ల శ్రీధర్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 09 , 2024 | 12:35 AM