Share News

ప్రజలకు ఇసుక అందుబాటులో ఉండాలి

ABN , Publish Date - Jul 27 , 2024 | 12:02 AM

ప్రజలకు ఇసుక అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని భూగర్భ గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్‌కుమార్‌ మీనా తెలిపారు.

ప్రజలకు ఇసుక అందుబాటులో ఉండాలి

పార్వతీపురం, ఆంధ్రజ్యోతి: ప్రజలకు ఇసుక అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని భూగర్భ గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్‌కుమార్‌ మీనా తెలిపారు. ఉచిత ఇసుక పంపిణీ పథకం అమలుపై భూగర్భ గనులశాఖ కమిషనర్‌ ప్రవీణ్‌కుమార్‌, జిల్లా కలెక్టర్లతో ఆయన శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఇసుకను లబ్ధిదారులకు ఉచితంగా అందిస్తుందని, రవాణా ఖర్చులు సాధ్యమైనం త తక్కువగా ఉండేటట్టు చర్యలు తీసుకుని, ప్రజలకు సరసమైన ధరలకు అందించాలని సూచించారు. రానున్న ఆరు నెలల్లో డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకు ని ఇసుక నిల్వలు సిద్ధంగా ఉంచాలన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గుర్తిం చిన రీచ్‌ల నుంచి మాత్రమే ఇసుకను సేకరించాలని, పర్యావరణానికి హాని కలగకుండా అక్రమ రవాణాను అడ్డుకోవాలని తెలిపారు. కలెక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌ మాట్లాడుతూ జిల్లాలో ప్రస్తుతం స్టాక్‌ పాయింట్‌ లేదని, జిల్లాకు రావాల్సిన ఇసుకను ప్రస్తుతం శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుంచి తీసుకు వస్తున్నా రని తెలిపారు. జిల్లాలో డీసిల్టరేషన్‌ ద్వారా ఇసుక రీచ్‌లను గుర్తించి ప్రతిపా దనలు పంపించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌ఎస్‌ శోబిక, జిల్లా రెవెన్యూ అధికారి జి.కేశవనాయుడు, ఆర్డీవోలు కె.హేమలత, డీవీ రమణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jul 27 , 2024 | 12:02 AM