Share News

Chandrababu: చాలా అధ్వాన్న స్థితికి వచ్చేశాం.. గ్రోత్ రేట్ దారుణంగా పడిపోయింది..

ABN , Publish Date - Jul 26 , 2024 | 12:58 PM

2019-24మధ్య రాష్ట్రంలో భారీగా జరిగిన ఆర్థిక నిర్వహణ లోపాలపై శ్వేతపత్రాన్ని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నేడు సభ ముందు ఉంచారు. అయిదేళ్ల పాటు పట్టిసీమను ఆపరేట్ చేయలేదని వెల్లడించారు.

Chandrababu: చాలా అధ్వాన్న స్థితికి వచ్చేశాం.. గ్రోత్ రేట్ దారుణంగా పడిపోయింది..

అమరావతి: 2019-24మధ్య రాష్ట్రంలో భారీగా జరిగిన ఆర్థిక నిర్వహణ లోపాలపై శ్వేతపత్రాన్ని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నేడు సభ ముందు ఉంచారు. అయిదేళ్ల పాటు పట్టిసీమను ఆపరేట్ చేయలేదని వెల్లడించారు. గోదావరి ఉన్నంత వరకూ ఈ ప్రాంతానికి నీటి ఎద్దడి రాకూడదన్నారు. అయితే ఆ పరిస్థితి కూడా తెచ్చిన వ్యక్తి నాటి పాలకుడు అని పేర్కొన్నారు. పోలవరం 15364 కోట్లు ఖర్చు చేశామని.. అదే టీడీపీ అధికారంలో కొనసాగి ఉంటే ఈ పాటికే ప్రాజెక్టు ఆపరేషన్ లో ఉండేదన్నారు. కేంద్రం వేసిన ఎక్సఫర్ట్ కమిటీ ఇచ్చిన రిపోర్టు ఆధారంగా ప్యారలల్‌గా కొత్త డయాఫ్రం వాల్ నిర్మించాలని అత్యవసర క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకున్నామన్నారు. దీంతో రూ. 990 కోట్లు దీనికోసం ఖర్చే చేయాల్సి వస్తోందని చంద్రబాబు పేర్కొన్నారు.


న్యూ ఎపిక్ సెంటర్ గ్రోత్ అమరావతి... ఈ ప్రాజెక్టును చూస్తే కొత్తనగరాలు ఆవశ్యకత ఎంతో ఉందని చంద్రబాబు తెలిపారు. అమరావతి ఇదే స్పీడ్‌లో ఆర్టీఫిషియల్ ఇంటిలలిజెన్స్ సిటీ గా తయారై ఉండేదని.. కానీ దాన్ని దుర్మార్గులు దెబ్బతీసేలా వ్యవహరించారన్నారు. ఒక్క వివాదం లేకుండా రైతులు ల్యాండ్ ఇచ్చారని పేర్కొన్నారు. గతంలో హైదరాబాద్ అంటే పాకిస్ధాన్ హైదరాబాదా?.. ఇండియా హైదరాబాదా? అని అడిగేవారని చంద్రబాబు అన్నారు. ఇప్పడు హైదరాబాద్ అంటే ఇండియాలోని హైదరాబాద్ మాత్రమే అని అందరూ గుర్తించారన్నారు. 7 లక్షల మంది ఉద్యోగులు అమరావతిలో ఉండేవారని... 3 నుంచి నాలుగు లక్షల కోట్ల ఆస్తి అమరావతితో వచ్చేదని చంద్రబాబు పేర్కొన్నారు.


2014-19 మధ్య తలసరి ఆదాయం 13. 2 శాతం పెరిగిందన్నారు. 2019 ప్రారంభం నుంచి ఇప్పటికి చాలా అధ్వాన్న మైన పరిస్ధితికి వచ్చామని చంద్రబాబు పేర్కొన్నారు. 5.7 శాతం వ్యవసాయ గ్రోత్ రేట్ అయిదేళ్లలో తగ్గిపోయిందన్నారు. సర్వీస్ సెక్టార్ సుమారు 2 శాతం తగ్గిందన్నారు. గ్రోత్ రేట్ 3శాతం తగ్గిపోయిందన్నారు. పవర్ సెక్టార్ లోనే లక్షా 29 వేల కోట్లు అప్పులు చెల్లించాల్సిన పరిస్థితి వీరి నిర్వాకం వల్ల వచ్చిందన్నారు. సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీంలు ఉపయోగిచుకోకుండా ఉండడంతో నిధులు నిలిచిపోయాయన్నారు. వరుసగా విద్యుత్, ఆర్టీసీ, టాక్స్‌లు, ఇసుక, చెత్తపన్నులు కూడా వేశారన్నారు. ఇప్పటి వరకూ 9 లక్షల 74 వేల కోట్లు అప్పు అయ్యిందన్నారు. ఇది నేటకి ఉన్న రాష్ట్ర అప్పు అని చంద్రబాబు తెలిపారు. దీంతో తలసరి అప్పు లక్షా 44వేల 336 రూపాయలకు చేరిందన్నారు. ఇది టీడీపీ హయాంలో 74,790 ఉండేదన్నారు. దీంతో అప్పు వైసీపీ పాలనలో డబుల్ అయ్యందని చంద్రబాబు పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి..

MP Raghunandan Rao: నిధులు వచ్చుడో, ఇద్దరం చచ్చుడో అన్నారు కదా.. రండి..

Japan: జపాన్‌లో భారీగా తగ్గుతున్న జనాభా.. ఎందుకో తెలుసా

Read latest AP News And Telugu News

Updated Date - Jul 26 , 2024 | 01:11 PM