Share News

CPI Ramakrishna: భూ హక్కు చట్టం రద్దును స్వాగతిస్తున్నాం

ABN , Publish Date - Jul 17 , 2024 | 01:46 PM

భూ హక్కు చట్టం రద్దును స్వాగతిస్తున్నామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ తెలిపారు. గత ప్రభుత్వం మొండి వైఖరితో భూ హక్కు చట్టాన్ని తెచ్చిందన్నారు.

CPI Ramakrishna: భూ హక్కు చట్టం రద్దును స్వాగతిస్తున్నాం

గుంటూరు: భూ హక్కు చట్టం రద్దును స్వాగతిస్తున్నామని సీపీఐ (CPI) రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ (Ramakrishna) తెలిపారు. గత ప్రభుత్వం మొండి వైఖరితో భూ హక్కు చట్టాన్ని తెచ్చిందన్నారు. ఉచిత ఇసుక వల్ల స్థానిక నాయకులు, మంత్రులు జోక్యం చేసుకుని చెడ్డ పేరు తెచుకోవద్దని సూచించారు. వైజాగ్ భీమిలిలో ఎర్రమట్టి దిబ్బలను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. వైసీపీ (YSRCP) పాలనలో 1.75 లక్షల భూములు అన్యాక్రాంతం అయ్యాయన్నారు. కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు (CM Chandrababu) ఢిల్లీ ప్రయాణం మంచిదేనని సీపీఐ రామకృష్ణ వ్యాఖ్యానించారు.


జగన్ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని రామకృష్ణ విమర్శించారు. రాష్ట్రాన్ని ఆర్థిక అధోగతిని నుంచి బయట పడేయాలన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం సీఎం కేంద్రంపై ఒత్తిడి చెయ్యాలన్నారు. బీహార్ సీఎం ప్రత్యేక హోదా కోరుతున్నారన్నారు. విభజన హామీ అమలు, ప్రత్యేక హోదా అమలు కావాల్సిన అవసరం ఉందన్నారు. నిధులు లేకుంటే రాష్ట్రంలో ప్రాజెక్ట్‌లు, రోడ్లు ఎలా కడతారని ప్రశ్నించారు. పోలవరంలో అవకతవకలు జరిగితే సరిదిద్ది ప్రాజెక్ట్ పూర్తి చేయాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చి నిర్వాసితులకు న్యాయం జరిగేలా చేస్తామన్నారు. అమరావతితో పాటు పోలవరం కూడా పూర్తి చెయ్యాలని రామకృష్ణ పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి...

Andhra Pradesh: పెద్దిరెడ్డికి బిగ్ షాక్.. కలెక్టర్ కీలక ఆదేశాలు..

Lanka Dinakar: భూ కబ్జాదారుల ఆలన పాలనలో వైసీపీ పాలన

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 17 , 2024 | 01:54 PM