Share News

Polavaram: పోలవరానికి విదేశీ నిపుణుల బృందం..

ABN , Publish Date - Jun 30 , 2024 | 12:42 PM

ఎలూరు జిల్లా: పోలవరం ప్రాజెక్టును విదేశీ నిపుణుల బృందం ఆదివారం పరిశీలించనుంది. నాలుగు రోజులపాటు పోలవరంలోనే పర్యటించనుంది. ప్రాజెక్టు ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలు, డయాఫ్రం వాల్ ప్రాంతాలను నిపుణులు పరిశీలిస్తారు. ప్రాజెక్టు ఇంజనీర్లు, క్రాంటాక్టు ఏజెన్సీలతో సమీక్షను నిర్వహిస్తారు.

Polavaram: పోలవరానికి విదేశీ నిపుణుల బృందం..

ఎలూరు జిల్లా: పోలవరం ప్రాజెక్టు (Polavaram Project)ను విదేశీ నిపుణుల బృందం (Foreign Experts Team ) ఆదివారం పరిశీలించనుంది. నాలుగు రోజులపాటు పోలవరంలోనే పర్యటించనుంది. ప్రాజెక్టు ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలు (Coffer dams), డయాఫ్రంవాల్ (Dia Fromval) ప్రాంతాలను నిపుణులు పరిశీలిస్తారు. ప్రాజెక్టు ఇంజనీర్లు, క్రాంటాక్టు ఏజెన్సీలతో సమీక్షను నిర్వహిస్తారు. అనంతరం ప్రాజెక్టు పనుల పరిస్థితిపై అంతర్జాతీయ నిపుణులు నివేదిక ఇస్తారు. తిరిగి జులైన 4వ తేదీన తమ స్వదేశాలైన అమెరికా, కెనడాలకు వెళ్లనున్నారు.


ఈ నిపుణుల బృందం రాజమండ్రి నుంచి పొలవరం ప్రాజెక్టు అతిథి గృహానికి రోడ్డు మార్గాన చేరుకుంటారు. ప్రాజెక్టు అధికారులతో కలిసి ఎగువ కాఫర్ డ్యామ్ రివర్ బెడ్లో జెట్ గ్రౌండ్ థింగ్.. ఎగువ కాఫర్ డ్యామ్ సెక్షన్, డ్యామ్ నిర్మాణం, ఫోటో ఎగ్జిబిషన్ ఐసీసీఎస్ ద్వారా నిర్దారించిన కాఫర్ డ్యామ్ సమర్థ్యం, సీపేజీ విషయంలో2023 సెప్టెంబర్‌లో హెచ్‌పీటీ ప్రొఫెసర్ రాజు బృందం నివేదికలను పరిశీలిస్తారు. అనంతరం 2020-23 వరకు జరిగిన సీపేజీ తీవ్రత తెలిపే సీజీయో మీటర్ రీడింగ్‌లు, మట్టి రాతి నాణ్యత పరిశీలన, జియోఫిజికల్ నివేదికలు, ఎఎఫ్‌ఆర్‌వై ప్రతిపాదించిన జియో టెక్నికల్ పరిశోధన వివరాలను పరిశీలిస్తారు.


అమెరికా, కెనడాల నుంచి 4 గురు నిపుణులు వచ్చారు. కేంద్ర, రాష్ట్ర జలనరుల శాఖ అధికారులతో నిన్న డిల్లీలో సమావేశం అయిన నిపుణులు.... అనంతరం రాత్రి రాజమండ్రికి చేరుకున్నారు. పోలవరం ప్రాజెక్టు వద్ద అధికారులతో భేటీ అనంతరం నిపుణులు ప్రాజెక్ట్ సైట్‌లో పరిశీలన చేస్తున్నారు. ప్రాజెక్టు డిజైన్ల నుంచి నేటి పరిస్థితి వరకు సమగ్ర అధ్యయనం చేయనున్నారు.


అమెరికా నుంచి డేవిడ్ పి పాల్, గెయిన్ ఫ్రాంకో డి సిక్కో, కెనడా నుంచి రిచర్డ్ డానెల్లీ, సీన్ హించ్ బెర్గర్‌లు వచ్చారు. ఆదివారం నుంచి జులై 3వరకు ప్రాజెక్టు సైట్‌లో పనులను పరిశీలించనున్నారు. అనంతరం కేంద్ర రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు, నిర్మాణ సంస్థలతో కలిసి రివ్యూ చేస్తారు. గత 5 ఏళ్ల తప్పుడు నిర్ణయాల కారణంగా అసలు పోలవరంలో ఎంత నష్టం జరిగిందో కూడా చెప్పలేని స్థాయిలో ప్రస్తుత పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ప్రభుత్వం అంతర్జాతీయ నిపుణులను రంగంలోకి దింపింది.


ఈ వార్తలు కూడా చదవండి..

సీఎం ఎవరిపై ప్రేమ చూపిస్తున్నారో అర్థమౌతోంది

చంద్రబాబు ట్రాప్‌లో పడొద్దు..: ఎంపీ మిథున్ రెడ్డి

నాగార్జున యూనివర్శిటీ వీసీ రాజీనామా..

ఏపీలో పెన్షన్ల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి..

భారత క్రికెట్ టీం చరిత్ర సృష్టించింది: సీఎం చంద్రబాబు..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jun 30 , 2024 | 12:42 PM