Share News

దోమల నిర్మూలన సామాజిక బాధ్యత కావాలి

ABN , Publish Date - Jul 27 , 2024 | 12:20 AM

దోమల ద్వారా మలేరియా, డెంగీ, చికున్‌ గున్యా సంక్రమించే అవకాశం ఉందని, దోమల నిర్మూలన సామాజిక బాధ్య తగా భావించాలని జిల్లా మలేరియా అధికారి పీఎస్‌ఎస్‌ ప్రసాద్‌ అన్నారు.

దోమల నిర్మూలన సామాజిక బాధ్యత కావాలి
మల్కాపురంలో ర్యాలీ నిర్వహిస్తున్న వైద్య సిబ్బంది

పరిసరాల పరిశుభ్రతపై అవగాహన ర్యాలీ

ఏలూరు రూరల్‌, జూలై 26: దోమల ద్వారా మలేరియా, డెంగీ, చికున్‌ గున్యా సంక్రమించే అవకాశం ఉందని, దోమల నిర్మూలన సామాజిక బాధ్య తగా భావించాలని జిల్లా మలేరియా అధికారి పీఎస్‌ఎస్‌ ప్రసాద్‌ అన్నారు. చాటపర్రు ఆరోగ్యకేంద్రం ఆధ్వర్యంలో మల్కాపురంలో శుక్రవారం ఫ్రైడే డ్రైడే కార్యక్రమంలో భాగంగా ర్యాలీ నిర్వహించారు. వర్షాకాలంలో జ్వరాలు ప్రబలే అవకాశం ఉందని, జ్వరం వస్తే అశ్రద్ధ చేయకుండా వెంటనే వైద్యులచే పరీక్షించుకుని చికిత్స పొందాలన్నారు. మలేరియా అధికారి గోవిందరావు మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. కార్యక్రమంలో రామాంజనేయులు, హెల్త్‌ సూపర్‌వైజర్‌ కిరణ్‌, శ్రీనివాసరావు, జోషి, పావని, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఏలూరు టూటౌన్‌: దోమలు ప్రభలకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఎంహెచ్‌వో డాక్టర్‌ మాలతి తెలిపారు. స్టాప్‌ డయేరియా కార్యక్రమంలో భాగంగా 37వ డివిజన్‌లో పారిశుధ్య పనులు నిర్వహించారు. స్ర్పేయింగ్‌, ఫాగింగ్‌, నిల్వ నీటిలో ఆయిల్‌బాల్స్‌ వేస్తున్నామన్నారు. గుబ్బలవారి వీధి, రంగూన్‌మేడ, అతిధి హోటల్‌, రాఘవాచారి రోడ్లు తదితర ప్రాంతాల్లో శుభ్రం చేశామన్నారు. టీడీపీ నాయకులు నాయుడు సోము, మలేరియా ఇన్‌స్పెక్టర్‌ దత్తి వేణుగోపాలస్వామి, సూపర్‌వైజర్‌ దుర్గారావు, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ స్టీఫెన్‌రాజు, ఆశాకార్యకర్తలు, ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు.

పోలవరం: జగన్నాథపేటలో శుక్రవారం వైద్య సిబ్బంది ఫ్రైడే డ్రైడే కార్యక్రమం నిర్వహించారు. నీటి నిల్వలు ఉన్న ప్రాంతాలు పరిశీలించి దోమల వలన ప్రబలే వ్యాధులు, నివారణ అంశాలపై స్థానికులకు అవగాహ న కల్పించా ఎంపీహెచ్‌ఈవో గుగ్గులోతు సోమరాజు, హెచ్‌వి గంగాభవాని, విశ్వనాఽథ్‌, ఏఎన్‌ఎం జ్యోతి, ఆశా వర్కర్లు అత్తిలి వెంకటలక్ష్మి పాల్గొన్నారు.

పోలవరం మండల కేంద్రంలో వర్షాలకు నీరు నిల్వ ఉన్నచోట దోమలతో ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలో జగన్నాథపేట, బెస్తావీది, కొత్తపేట, బాపూజీ కాలనీ, బీసీ కాలనీ, కమ్మర గూడెం, ఏనుగులవారి వీది, గణేశ్‌నగర్‌, పాతపోలవరం, పెదరామాలయం వీది ప్రాంతాలలో దోమలు ఎక్కువగా ఉన్నాయని మలేరియా సబ్‌ యూనిట్‌ అధికారులు స్పందించి పంచాయతీ పరిఽధిలో దోమల నివారణకు మలాథి యాన్‌ స్ర్పేయింగ్‌ పనులు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Updated Date - Jul 27 , 2024 | 12:21 AM