Share News

చట్టాలపై అవగాహన అవసరం

ABN , Publish Date - Jul 27 , 2024 | 12:23 AM

రక్షణ చట్టాలపై అందరికీ అవగాహన అవసరమని జిల్లా న్యాయసేవాధికార సంస్ధ కార్యదర్శి కె.రత్నప్రసాద్‌ అన్నారు.

చట్టాలపై అవగాహన  అవసరం
సదస్సులో మాట్లాడుతున్న జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రత్నప్రసాద్‌

బాలికా రక్షణ చట్టాలపై ప్రత్యేక కార్యక్రమాలు

ఏలూరు క్రైం, జూలై 26 : రక్షణ చట్టాలపై అందరికీ అవగాహన అవసరమని జిల్లా న్యాయసేవాధికార సంస్ధ కార్యదర్శి కె.రత్నప్రసాద్‌ అన్నారు. ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో అశోక్‌నగర్‌ ఎస్‌పీడీబీటీ జూనియర్‌ కళాశాల విద్యార్ధినులకు మహిళా చట్టాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. రత్నప్రసాద్‌ మాట్లాడుతూ విద్యార్ధినులు హక్కులను పరిరక్షించుకోవాలన్నారు. ఫోన్‌, సోషల్‌ మీడియాకు దూరంగా ఉండాలని, సమాజ పరిస్థితులపై అవగాహన పెంచుకోవాలన్నారు. సీడీపీవో ఎ.పద్మావతి, ప్రిన్సిపాల్‌ సూర్యనారాయణ, రాఘవమ్మ మాట్లాడారు.

ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో మిషన్‌ శక్తి 100 రోజుల కార్యక్రమంలో భాగంగా గాంధీ నగర్‌ మున్సిపల్‌ హైస్కూలులో కిశోర బాలికలకు చట్టాలపై అవగాహన కల్పించా రు. వెంకటేశ్వరరావు, హెచ్‌ఎం కృష్ణభగవాన్‌, ఎం దేవీమౌనిక, మీనాక్షి పాల్గొన్నారు.

టి.నరసాపురం: పాఠశాల స్థాయి నుంచి బాలికలు రక్షణ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సీఐ టి.క్రాంతికుమార్‌ సూ చించారు. జడ్పీ హైస్కూలు విద్యార్థులకు పోక్సో, ఇతర చట్టాలు, నేరాలపై శుక్రవా రం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బాలికలు, చిన్నారుల రక్షణకు ప్రభు త్వం పటిష్ఠమైన చట్టాలు అమలు చేస్తుందన్నారు. బాలికలందరూ గుడ్‌ టచ్‌ బ్యాడ్‌ టచ్‌పై అవగాహన కలిగి ఉండాలన్నారు. ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తిం చినా, వేధించినా వెంటనే తల్లిదండ్రులకు లేదా ఉపాధ్యాయులకు చెప్పాలని వేధిం పులు ఎక్కువైతే పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. ఎస్సై డి.దుర్గా మహేశ్వర రావు, హెచ్‌ఎం లింగుస్వామి, కృష్ణారావు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

దెందులూరు: విద్యార్థులు, బాలలు రాజ్యాంగం కల్పించిన హక్కులు, విధుల ను తెలుసుకోవాలని సీడీపీవో కె.విజయలక్ష్మి అన్నారు. పోతునూరు జడ్పీ ఉన్నత పాఠశాల అవరణలో రక్షణ చట్టాలపై శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహిం చారు. బాలల సంరక్షణ లీగల్‌ వలంటీర్‌ ఐ.కృష్ణవేణీ, సీడీపీవో విజయలక్ష్మి విద్యా ర్థులకు చట్టాలపై అవగాహన కల్పించారు. హైస్కూల్‌ హెచ్‌ఎం షేక్‌వలీ, అంగ న్వాడీ సెక్టార్‌ సూపర్‌వైజర్లు చిట్టెమ్మ, కె.శ్రీదేవి, పద్మ భూషణం పాల్గొన్నారు.

Updated Date - Jul 27 , 2024 | 12:23 AM