Share News

రూ.21 లక్షల విలువైన ఫోన్లు రికవరీ

ABN , Publish Date - Jul 27 , 2024 | 12:19 AM

జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది ఫ్రిబవరి నుంచి ఏప్రిల్‌ నెల వరకు జరిగిన సెల్‌ ఫోన్‌ చోరీలకు సంబంధించిన 151 మొబైల్‌ ఫోన్లను రికవరీ చేసినట్టు ఏలూరు జిల్లా ఎస్పీ కిషోర్‌ చెప్పారు. జిల్లా పోలీస్‌ కార్యాలయంలో శుక్రవారం విలేకరులకు వివరాలను ఎస్పీతో పాటు అదనపు ఎస్పీ స్వరూపరాణి వెల్లడించారు.

రూ.21 లక్షల విలువైన ఫోన్లు రికవరీ
వివరాలు తెలుపుతున్న ఏలూరు ఎస్పీ కిశోర్‌

ఏలూరు క్రైం, జూలై 26 : జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది ఫ్రిబవరి నుంచి ఏప్రిల్‌ నెల వరకు జరిగిన సెల్‌ ఫోన్‌ చోరీలకు సంబంధించిన 151 మొబైల్‌ ఫోన్లను రికవరీ చేసినట్టు ఏలూరు జిల్లా ఎస్పీ కిషోర్‌ చెప్పారు. జిల్లా పోలీస్‌ కార్యాలయంలో శుక్రవారం విలేకరులకు వివరాలను ఎస్పీతో పాటు అదనపు ఎస్పీ స్వరూపరాణి వెల్లడించారు. సెల్‌ఫోన్లు పోగొట్టుకున్న వారికోసం ప్రత్యేకంగా టోల్‌ఫ్రీ నెంబర్‌ 95503 51100కు ఫిర్యాదులు చేయడంతో ఏలూరు సీసీఎస్‌ పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ సీహెచ్‌ మురళీకృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు సీసీఎస్‌ సిబ్బంది, దర్యాప్తు చేపట్టి 151 ఫోన్లను రికవరీ చేశారు. వీటి విలువ 21 లక్షల 14 వేల రూపాయలని తెలిపారు. ఏలూరు, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్‌ జిల్లా, అంబేడ్కర్‌ కోనసీమ, కృష్ణా, విశాఖపట్టణం, తూర్పుగోదావరి, విజయనగరం, విశాఖ, తెలంగాణా తదితర ప్రదేశాల నుంచి మొబైల్స్‌ స్వాధీనం చేసుకున్నామన్నారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, బ్యాంకులు, ఎటీఎంలు, రైతు బజార్లు, రద్దీ ప్రదేశాల్లో ప్రజలను దృష్టి మళ్ళించి మొబైల్స్‌ దొంగిలిస్తుస్తారన్నారు. ప్రజలు తమ సెల్‌ఫోన్‌లో సమాచారాన్ని ఎప్పటికప్పుడు బ్యాకప్‌ చేసుకోవాలని సూచిం చారు. యాప్‌లక పాస్‌వర్డ్‌ రక్షణ కల్పించుకుని ఫైండ్‌మై డివైజ్‌ ఆప్షన్‌ పెట్టుకోవాలన్నారు. సెల్‌ఫోన్లు రికవరీ చేసిన ఏలూరు సీసీఎస్‌ సీఐ మురళీకృష్ణ, సైబర్‌క్రైం ఎస్‌ఐ రాజాలను అభినందించారు. ఫోన్లు పోగొట్టు కున్న బాధితులకు సెల్‌ఫోన్లను అప్పగించారు.

ఆశ పడవద్దు..భయపడవద్దు : ఎస్పీ

ఆశ, భయం వల్ల ప్రజలు సైబర్‌ నేరాల బారినపడుతున్నారని ఎస్పీ కిషోర్‌ అన్నారు. ఈ రోజు ప్రతి ఒక్కరికి మొబైల్‌ ఫోన్‌ నిత్యావసరంగా మారిందని అన్నారు. నేరగాళ్ళు వివిధ రకాల యాప్‌లను తయారు చేసి ఆండ్రాయిడ్‌ ఫోన్లకు పంపించి ఆశ కల్పిస్తున్నారన్నారు. ఇంటి వద్దే ఉండి పార్ట్‌టైమ్‌గా జాబ్‌ చేసుకోవచ్చుని, రోజుకు వేలాది రూపాయలు సంపా దించవచ్చునని లేదా లాటరీలో సొమ్ము వచ్చిందనో, గిఫ్టులు వచ్చాయనో, ఫ్రైజ్‌ మనీ వచ్చిందనో ఆశ చూపించి తాము పంపిన లింకులను క్లిక్‌ చేసి బ్యాంకు వివరాలు, ఆధార్‌కార్డు వంటివి పంపించాలని కోరుతున్నారు. కొంతమంది ఆశతో ఆ లింకులను ఓపెన్‌ చేస్తున్నారని దీంతో ఆ ఫోన్‌ డేటా అంతా నేరస్తుల గుప్పెట్లోకి వెళ్ళిపోతుందని దీంతో వారి అకౌంట్‌ లోని సొమ్ములను తస్కరిస్తున్నారన్నారు. కొంతమంది సైబర్‌ నేరగాళ్ళు వీడియో కాల్స్‌చేసి తాము కస్టమ్స్‌ అధికారులమనో, ఇతర పోలీసు అధికారులమనో, ఏసీబీ అధికారులమని బెదిరిస్తున్నారని ఇలాంటి వాటికి భయపడిన కొంతమంది వారు చెప్పినట్లు సొమ్ములు చెల్లించుకుని ఆ తరువాత లబోదిబోమంటూ పోలీసులు ఆశ్రయిస్తున్నారన్నారు. ఇలాంటి కాల్స్‌ వస్తే సైబర్‌ క్రైమ్‌ టోల్‌ఫ్రీ నెంబర్‌ 1930కు కాల్‌ చేసి ఫిర్యాదు చేయా లన్నారు. ఎవరైనా మొబైల్‌ ఫోన్లను పోగొట్టుకుంటే టోల్‌ ప్రీ నెంబర్‌ 95503 51100కు ఫిర్యాదు చేయాలని సూచించారు.

Updated Date - Jul 27 , 2024 | 12:19 AM