Share News

ఎన్నికల చుట్టాలొస్తున్నారు!

ABN , Publish Date - May 09 , 2024 | 12:23 AM

ఎన్నికల సమరాంగణంలో కూటమి సైన్యం కదిలింది. పోలింగ్‌ దగ్గర పడుతున్న వేళ మండలాల వారీగా ప్రత్యర్థి పార్టీలపై పైచేయి సాధించేందుకు ప్రచారంతో పాటు సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంఘాలు, మహిళా సంఘాలు చుట్టంచూపు పేరిట గడపగడపకు వెళుతున్నాయి.

 ఎన్నికల చుట్టాలొస్తున్నారు!

దూరప్రాంత ఓటర్లకు ఉచిత ట్రాన్స్‌పోర్టు

కొందరికేమో ఖర్చులకు ఫోన్‌పేలు

చుట్టపు చూపు పేరిట ఓట్లు అభ్యర్థన

సామాజిక వర్గాల వారీగా గడపగడపకు..

ఎన్నికల సమరాంగణంలో కూటమి సైన్యం కదిలింది. పోలింగ్‌ దగ్గర పడుతున్న వేళ మండలాల వారీగా ప్రత్యర్థి పార్టీలపై పైచేయి సాధించేందుకు ప్రచారంతో పాటు సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంఘాలు, మహిళా సంఘాలు చుట్టంచూపు పేరిట గడపగడపకు వెళుతున్నాయి. పలానా అభ్యర్థిని గెలిపించండి.. అంటూ ఎన్నికల పండుగ వేళ పిలుపు ఇస్తున్నారు. ఆ మేరకు వీరంతా ఎన్నికల చుట్టాల్లా వ్యవహరిస్తున్నారు.

– ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి

రండి... కలిసుందాం

వివిధ రాజకీయ పార్టీల్లో కీలకంగా కొన్ని కుటుంబాలు ఫలితాలను శాసిస్తాయి. కాని మారుతున్న రాజకీయ పరిణా మాల క్రమంలో పార్టీల శతృత్వమే ఎక్కువగా ప్రభావితం చేస్తోంది. పోలింగ్‌ జరిగేందుకు ఇంకా కొద్దిరోజులే మిగిలి ఉండగా, ఎక్కడికక్కడ మద్దతు కూడకట్టుకునేందుకు వివిధ రాజకీయ పక్షాలు, అభ్యర్థులు ఎత్తుకు పై ఎత్తు వేస్తున్నారు. ప్రత్యక్షంగా తాము ఇప్పటికే ప్రచారంలో ఊరువాడా తిరిగిన ప్పటికి ఇప్పుడు తమ అంతరంగీకులను ప్రత్యేకించి కొన్ని కుటుంబాల వద్దకు ఎన్నికల పిలుపు కోసమే పంపుతు న్నారు. పనిలో పనిగా దూరప్రాంతాల్లో ఉన్న ఓటర్లను ఆదివారం నాటికే ఆయా స్వగ్రామాలకు చేరుకునేలా జాగ్రత్తలు పడుతున్నారు. ఏలూరు, దెందులూరు, నూజివీడు, కైకలూరు వంటి నియోజక వర్గాలకు చెందిన అనేక కుటుంబాలు వృత్తి, వ్యాపారరీత్యా గుంటూరు, హైదరాబాద్‌, విజయవాడ, బెంగ ళూరు వంటి నగరాల్లో నివాసం ఉంటున్నారు. వీరందరిని ఇప్పటికే ఎవరెవరు ఎక్కడుంది? ఎవరి ఇంట్లో ఎన్ని ఓట్లు బయట ఉంది? క్షుణంగా లెక్కలు తీశారు. ఓటర్‌ స్లిప్‌ అందిం చే క్రమంలోనే వార్డు స్థాయిలో ఉన్న నేతలు ఈ అన్వేషణ పూర్తి చేశారు. ఏలూరుకు చెందిన కొన్ని కుటుంబాలను హైదరాబాద్‌ నుంచి రప్పించేందుకు వీలుగా ఇప్పటికే వైసీపీ లో కొందరు ప్రయత్నాలు ఆరంభించారు. ఎలాగో శని, ఆదివారాలు సెలవు కాబట్టి సోమవారం జరిగే ఓట్ల పండగకు రండి అంటూ పిలుపులు పంపారు. ఇంకేముంది పోలింగ్‌కు ఒకరోజు ముందే ఆదివారం ఒక్క ఏలూరు నగరానికి వచ్చే వారి సంఖ్యే దాదాపు 3వేలకు పైబడి ఉన్నట్టు సమాచారం. ఉంగుటూరు ప్రాంతానికి చెందిన అనేకమంది బయట ప్రాంతాల్లో ఉండడంతో వారికి ఫ్రీ ట్రాన్స్‌పోర్టు ఏర్పాటు చేసి మరీ సొంత గ్రామాలకు రప్పిస్తున్నారు. వాస్తవానికి సంక్రాం తి పండుగ రోజుల్లో కోడిపందేలకు హైదరాబాద్‌ సగం నగరం ఖాళీచేసి జనం ఇక్కడికి రావడం రివాజు. కాని ఈసారి ఎన్ని కల పండుగకు ఎంతమంది వస్తే అంతమందిని రప్పించ డానికే అన్నిపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. ఎందుకంటే ఈసారి జరిగే ప్రతిష్ఠాకర పోటీలో ప్రతి ఓటు విలువైనదే కాబట్టి ఎక్కడా వెనక్కి తగ్గకుండా వారందరిని రప్పించే ప్రయత్నాలు సాగుతున్నాయి. కొందరికి రవాణా ఖర్చుల నిమిత్తం ఫోన్‌ పే చేస్తున్నట్టు సమాచారం. వచ్చి వెళ్లడానికి అయ్యే ఖర్చుతో పాటు ఓటు ఖర్చును చెల్లిస్తున్నట్టు ప్రచారం సాగుతోంది.

చుట్టాలను వదలడం లేదు..

రాజకీయాల్లో అప్పుడప్పుడు అందరికీ వరుసలు గుర్తుకు వస్తాయి. పోటీ అంతా నువ్వానేనా అనే విధంగా ఉండడంతో ఏలూరు పార్లమెంట్‌ పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లోనూ బుధవారం నుంచే చుట్టపుచూపు పేరిట కొందరు సరికొత్త ప్రచారానికి దిగారు. పార్టీ అభ్యర్థులుగా ఉన్నవారి సన్ని హితులు, బంధువులు, స్నేహితులు ఎక్కడికక్కడ తమకు తెలిసిన వారి ఇళ్లకు వెళ్లి పలానా పార్టీ అభ్యర్థికే ఈసారి మద్దతు ఇవ్వండి అంటూ అభ్యర్థించడం ప్రారంభించారు. ఈసారి ఎన్నికల్లో ఇదే హైలెట్‌గా భావిస్తున్నారు. బీసీ, దళిత కొన్ని అగ్రవర్ణాల్లో పనికట్టుకుని మరీ తమకు తెలిసిన వారి, అయిన వారి ఇళ్లకు వెళ్లి మరీ ఈ తరహా అభ్యర్థనలు చేస్తు న్నారు. ఇంకొందరైతే మీకైతే ఓటు ఉందా? లేదా? అంటూ ఆరా తీయడం, ఖచ్చితంగా ఓటు వేయండి, పలానా పార్టీకి మాత్రమేనంటూ వాట్సప్‌ సందేశాలు ఇస్తున్నారు. ఈసారి మార్పు రావాలి, అనే నినాదంతో ఎక్కువమంది తమకు తెలిసిన వారందరికి ఈ సందేశాలు పంపడంలో ముందు వరుసలో ఉన్నారు.

ఇప్పటికే నగదు మాయం

ఎన్నికల వేళ జిల్లాలో చాలాచోట్ల ఏటీఎంలు వట్టిపోయి కనిపిస్తున్నాయి. డబ్బు వినియోగం ఈ మూడురోజులు అత్యధికంగా ఉండబోతోంది కాబట్టి దీనికి తగ్గట్టుగానే ఇప్పటికే ఏటీఎంలు పనిచేయకుండా పోయాయి. అలాగే 500 నోట్లకు మార్కెట్లో కాళ్ళు వచ్చాయి. కేవలం 20,50 నోట్లు మాత్రమే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎమ్మెల్యే అభ్యర్థులు అయితే ఇప్పటికే నిబంధనలు పక్కనపెట్టి 10 నుంచి 15 కోట్లు ఖర్చు పెట్టుతున్నారు. ఇప్పటికే డ్వాక్రా సభ్యులకు తలొక వెయ్యి చొప్పున ప్రధాన పక్షాలు అన్ని అందించాయి.

ఎన్నికల కళ వచ్చేసింది..

నోటిఫికేషన్‌ విడుదలై దాదాపు 48 రోజులు పూర్తయింది. మరో నాలుగు రోజుల్లో పోలింగ్‌ జరగబోతోంది. ఇప్పుడు అంతా ఎక్కడ చూసినా ఎన్నికల కళే కొట్టొచ్చినట్టు కనిపి స్తోంది. రాత్రివేళ నేతలు కదలికలు పెరిగాయి. మహిళా గ్రూప్‌లీడర్లు, కులసంఘాల లీడర్లు, ప్రధాన పార్టీల అభ్యర్థుల నివాస గృహాల్లోనూ పగలు, రాత్రి తేడా లేకుండా జోరుగా పంపకాల మంత్రాంగాలు సాగుతున్నాయి. మీటింగ్‌ ఉంది రండి అంటూ ఆయా గ్రూపులీడర్లకు వర్తమానాలు పంపించి, నగదు వారి చేతికి ఇచ్చి పంపిస్తున్నారు.

ఓటుకు రేటు ఎంతంటూ ఆరా

ఒక్కో నియోజకవర్గంలో ఒక్కో రకంగా ఇప్పటికే ఓటుకు రేటు నిర్ణయించి, పంపకాలకు సిద్ధమవుతు న్నారు. దెందులూరు, ఏలూరు, కైకలూరు, నూజివీడు, ఉంగుటూరు వంటి నియోజకవర్గాల్లో అధికార వైసీపీ అభ్యర్థులు వారి అనుచరులు పెద్దఎత్తున ఓటుకు నోటు ఆఫర్‌ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఒక్కో ఓటుకు వెయ్యి నుంచి 1500 ఇస్తున్నారని ప్రచారం సాగింది. ఇంకోవైపు కూటమి పక్షాన ఎంత ఇస్తున్నారనే ఆరానే విస్తృతంగా వినిపిస్తోంది. గ్రామస్థాయిలో ఓటున్న అందరికి కాకుండా కొందరిని మాత్రమే గుర్తించిమరీ జాబితా సిద్ధం చేశారు. వీరందరికి శని, ఆదివారాల్లోపే గిఫ్ట్‌ ఇవ్వడానికి రంగం సిద్ధమైంది. మద్యం బాబులను ఆకర్షించేందుకు కొందరు టోకెన్‌ పద్ధతి అనుసరి స్తున్నట్టు చెబుతున్నారు. ఇది కూడా అభ్యర్థికి అత్యంత అనుకూలురు చేసే పనిగానే వినిపిస్తోంది.

ఎన్‌ఆర్‌ఐల్లో ఆరాటం

ప్రవాసాంధ్రులు అనేకమంది ఇప్పటికే ఏపీకి ప్రత్యేకించి గోదావరి జిల్లాలకు చేరుకున్నారు. గడిచిన నెలరోజులుగా వీరిలో అనేకమంది కూటమి పక్షాన ప్రచార బాధ్యతలను భుజానకు ఎత్తుకున్నారు. క్షేత్రస్థాయి ప్రచారం చేస్తూ గతంలో ఏ పార్టీకి ఓటు వేసింది ఇప్పుడు ఏ పార్టీకి ఓటు వేయాలో ఓటర్లకు నిర్దేశం చేస్తున్నారు. వీలైతే పెద్దఎత్తున సహాయం చేసేందుకు వ్యక్తిగతంగా కాకుండా ఊరిపక్షానే అనే సంకేతాలు ఇస్తున్నారు. చింతలపూడి, దెందులూరు, ఏలూరు వంటి ప్రాంతాల్లో వీరంతా అంతర్భాగమై పనిచేస్తు న్నారు. తమకు సానిహిత్యంగా ఉన్న నేతలకు ఎక్కడెక్కడ మైనస్‌ ఉంది, మరెక్కడ ఫ్లస్‌ ఉంది చేరవేయడంలో 24 గంటలు కష్టపడుతున్నారు. మేమంతా కుటుంబాన్ని విదేశా ల్లో వదులుకుని ఇక్కడి ప్రచారానికి వచ్చామంటే ఎందుకు వచ్చామో మీరే ఆలోచించుకోండి. రాష్ట్రం బాగుపడాలన్నదే మా కోరిక అంటూ వ్యక్తిగత ప్రచారానికి దిగుతున్నారు.

Updated Date - May 09 , 2024 | 12:23 AM