Share News

పెరుగుతూ.. తగ్గుతూ

ABN , Publish Date - Jul 27 , 2024 | 12:47 AM

ఏజెన్సీలోని కుక్కునూరు, వేలేరుపాడు మండలా లకు ఇంకా గోదావరి వరద భయం వీడలేదు.

పెరుగుతూ.. తగ్గుతూ
తిరుమలాపురంలో వరద బాధితులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ వెట్రిసెల్వి, జేసీ ధాత్రిరెడ్డి

ముంపు గ్రామాల్లో తొలగని వరద భయం

కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో కలెక్టర్‌, జేసీ పర్యటన

వరద సహాయక కార్యక్రమాల పరిశీలన

కుక్కునూరు/వేలేరుపాడు/పోలవరం/బుట్టాయగూడెం, జూలై 26 : ఏజెన్సీలోని కుక్కునూరు, వేలేరుపాడు మండలా లకు ఇంకా గోదావరి వరద భయం వీడలేదు. గురువారం రాత్రి ఎనిమిది గంటలకు 48 అడుగులు నీటిమట్టం చేరుకోవడంతో భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. శుక్రవారం ఉదయం ఐదు గంటలకు నెమ్మదిగా తగ్గుతూ 47.06 అడుగులకు చేరుకుంది. సాయంత్రం ఆరు గంటలకు తిరిగి పెరుగుతూ 47.3 అడుగులకు చేరుకుంది. ఎగువ ప్రాంతం నుంచి ఇంకా వరద ప్రభావం ఉండడంతో శుక్రవారం రాత్రికి మళ్లీ రెండో ప్రమాద హెచ్చరిక 48 అడుగు లకు చేరుకుంటుందని సీడబ్ల్యూసీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఎగువ వరదను దృష్టిలో ఉంచుకుని గోదావరి నీటిమట్టం 49 అడుగుల వరకు చేరుకుని మరలా తగ్గు ముఖం పట్టే అవకాశం ఉంది.

భయపెడుతున్న గోదారి

వరద కారణంగా వేలేరుపాడు మండలంలోని 30 గ్రామా లు జల దిగ్బంధంలో చిక్కుకోగా 2,538 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 2021–22 సంవత్సరాల్లో గోదావరి నది తగ్గుతూ పెరుగుతూ ఇప్పటిలాగే దోబూచు లాడి 2022 జూలై 15న గోదావరి నదికి 21లక్షల క్యూసెక్కుల పైనే వరద వచ్చిపడడంతో భద్రాచలం వద్ద 71.3 అడుగులకు చేరుకోగా మండలంలోని 41 గ్రామాల్లో ఇళ్ళు నీటమునిగి భారీ ఆస్తి నష్టం జరిగింది. తిరిగి అదేమాదిరిగా ఇప్పటికే ఈ వారంలో గోదావరి మూడుసార్లు పెరిగి మండల ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. మండల ప్రజలు పాత రోజులను గుర్తు చేసుకుంటూ మరలా ఏ ఉపద్రవం వచ్చి పడుతుందోనని ఆందోళన చెందుతున్నారు. దీనికి ఊతం ఇస్తూ తెలంగాణలోని కాలేశ్వరం ప్రాజెక్టు అనుబంధ బ్యారేజీల నుంచి వరదనీటిని దిగువన ఉన్న గోదావరిలోకి వదిలేస్తున్నారు. గోదావరి ఉపనదులు పొంగి పొర్లుతూ వరద పోటెత్తుతోంది. ఇంకోవైపు మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదారికి వరద పోటెత్తే ప్రమాదం పొంచిఉంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని కలెక్టర్‌తో పాటు జిల్లా స్థాయి అధికారులు మొత్తం వేలేరుపాడు, కుక్కు నూరు మంలాల పైనే దృష్టి సారించి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. కుక్కునూరు మండలం దాచారం, తెల్లరాయి గూడెం, కౌండిన్యముక్తి పునరావాస కేంద్రాలను అధికారులు సందర్శించి బాధితులకు నిత్యావసర సరుకులు కూరగాయలు అందజేస్తున్నారు.

విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు : కలెక్టర్‌

వరద బాధితులకందించే సహాయ కార్యక్రమాలు సక్రమంగా చేయాలని, ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తే సంబంధిత అధికారులపై కఠిన చర్యలను తప్పవని కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి హెచ్చరించారు. కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో అమలవుతున్న వరద సహాయ కార్యక్రమాలను జేసీ ధాత్రితో కలిసి శుక్రవారం పరిశీలించారు. కుక్కునూరు మండలం దాచారం పునరావాస కాలనీని సంద ర్శించి నిర్వాసితుల సమస్యలు అడిగి తెలు సుకున్నారు. వేలేరుపాడు తహసీల్దార్‌ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ‘వరద సహా యక కేంద్రాలకు తరలించిన ప్రజ లకు నాణ్యమైన భోజనం అందిం చాలి. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం, పిల్ల లకు పాలు, ఇవ్వాలి. ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్న కుటుంబాలకు టార్ఫాలిన్లు అందించాలి. విద్యుత్‌ సౌకర్యాన్ని వీలున్నం త వరకు వెంటనే పునరుద్ధరించాలి’ అని ఆదే శించారు. శివకాశీపురం ఆశ్రం పాఠశాలలోని పునరావాస కేంద్రాన్ని, భూదేవిపేట కస్తూరిబా పాఠశాలలోని పునరావాస కేంద్రాన్ని సందర్శించి, నిర్వాసితులతో మాట్లాడి సహాయ పునరావాస కార్యక్రమాలపై ఆరా తీశారు. జేసీ ధాత్రి, ఆర్డీవో అద్దయ్య, ఇతర అధికారులతో కలిసి పడవపై తిరుమలా పురానికి వెళ్ళి గ్రామస్థులతో మాట్లాడారు. జిల్లాలో వరద సహాయక కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.ఐదు కోట్లు కేటాయించిందని ప్రతీ కుటుంబానికి ఐదు కిలోల బియ్యం, కిలో కందిపప్పు, అరకిలో వంటనూనె, ఐదు రకాల కాయగూరలు అందిస్తున్నామని అవన్నీ సక్రమంగా అందుతు న్నాయా లేదా అని ఆరా తీశారు. గోదావరి చుట్టుముట్టిన తూర్పుమెట్టకు వెళ్ళేందుకు వీలు కాకపోవడంతో అక్కడ గుట్టపైనే ఉంటున్న గ్రామస్థులతో వీడియో కాల్‌లో మాట్లాడా రు. తమకు అందించిన నిత్యాసవర సరుకులు అయి పోయా యని వారు తెలపగా స్పందించిన కలెక్టర్‌ తక్షణం ఐదు కిలో ల కందిపప్పు, వంటనూనె, ఐదు రకాల కూరగాయలు అందించాలని అధికారులను ఆదేశించారు.

పట్టిసీమ నుంచి 5,310 క్యూసెక్కులు విడుదల

పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి పోలవరం ప్రాజెక్టు కుడికాల్వకు శుక్రవారం 15 పంపుల ద్వారా 5,310 క్యూసెక్కు ల జలాలు విడుదల చేసినట్టు పట్టిసీమ ఎత్తిపోతల పథకం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీరు పెద్దిరాజు తెలిపారు. పోల వరం స్పిల్‌వే నుంచి 11,06,947 క్యూసెక్కుల వరద జలాలు విడుదల చేసినట్టు ఈఈ మల్లిఖార్జునరావు, డీఈ మాధవరావు తెలిపారు.

కొనసాగుతున్న వర్షాలు

ఏలూరు సిటీ : నైరుతి రుతుపవనాల ప్రభావంతో జిల్లాలో అక్కడక్కడా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. గడచిన 24 గంట ల్లో కుక్కునూరులో 4 మిల్లీ మీటర్లు, వేలేరుపాడు 2, జంగారెడ్డిగూడెం 1.8, కామవరపుకోట 0.4, కొయ్యలగూడెం, బుట్టాయిగూడెంలలో 0.2 మి.మీ వర్షపాతం నమోదైంది.

నేడు మంత్రుల పర్యటన

కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో పెద్దవాగు, గోదావరి వరద బాధితులను పరామర్శించడానికి రాష్ట్ర మంత్రులు అచ్చెన్నా యుడు, కొలుసు పార్థసారథి, నిమ్మల రామానాయు డు శనివారం రానున్నారు. ముంపు గ్రామాలైన వేలేరు పాడు మండలం మేడేపల్లి, అల్లూరినగర్‌, కోయ మాదారం, భూదేవిపేట, కన్నాయిగుట్ట, తిరుమలా పురం, కుక్కునూరు మండలం దాచారం ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీలో పర్యటించి బాధితులను కలసి ధైర్యం చెప్పనున్నారు.

గుబ్బల మంగమ్మ ఆలయం మూసివేత

భారీ వర్షాల కారణంగా బుట్టాయగూడెం మండలంలోని గుబ్బల మంగమ్మ ఆలయ పరిసరాలు దెబ్బ తినడంతో మర మ్మతుల నిమిత్తం ఆలయాన్ని మూసివేసినట్టు కమిటీ సభ్యు లు తెలిపారు. మరమ్మ తులు పనులు పూర్తి కావడానికి 15 రోజులకుపైగా పడుతుందన్నారు. పనులు పూర్తికాగానే అమ్మ వారి దర్శనానికి అను మతి స్తామని తెలిపారు. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో అమ్మ వారి ఆలయం వద్ద వాగుల ఉధృతి తగ్గింది.

Updated Date - Jul 27 , 2024 | 12:47 AM