Share News

మళ్లీ భగభగలు

ABN , Publish Date - May 08 , 2024 | 11:54 PM

సూర్యుడు బుధవారం మళ్లీ తన ప్రతాపం చూపించా డు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో మంగళ వారం వర్షాలు కురవడంతో వాతావరణం చల్లబడింది. ఇంతలోనే మళ్లీ వేడెక్కింది.

మళ్లీ భగభగలు
నిర్మానుష్యంగా మారిన పాలకొల్లు బస్టాండ్‌ రోడ్డు

40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రత

విద్యుత్‌ కోతలతో అల్లాడుతున్న ప్రజలు

పాలకొల్లు అర్బన్‌, మే 8 : సూర్యుడు బుధవారం మళ్లీ తన ప్రతాపం చూపించా డు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో మంగళ వారం వర్షాలు కురవడంతో వాతావరణం చల్లబడింది. ఇంతలోనే మళ్లీ వేడెక్కింది. పాలకొల్లులో చిరుజల్లులు మాత్రమే పడడంతో బుధవారం భానుడు ప్రతాపాన్ని చూపాడు. 40 డిగ్రీలకన్నా అధికంగా ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు అల్లాడిపోయారు. నాలుగు రోజులుగా అనధికార విద్యుత్‌ కోతల వల్ల ఎండ వేడికి తాళలేక, ఉక్కబోతతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. రోజులో రెండేసి గంటల చొప్పున నాలుగైదుసార్లు విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో ఎన్నికల సమయంలోనే విద్యుత్‌ కోతలు విధిస్తుంటే, ఎన్నికలైన తర్వాత నరకమే కనిపిస్తుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. బుధవారం ఉదయం నుంచే వేడిగాలులు వీయడంతో ప్రధాన రహదారులు అన్నీ నిర్మానుష్యంగా మారాయి. మార్కెట్‌లో వ్యాపారాలు జరగలేదు. వేసవి తాపంతో చల్లని శీతల పానీయాల కోసం జనం ఎగబడ్డారు. ఎండ వేడిమితోపాటు వడగాడ్పులు వీయడంతో బాటసారులు చలివేంద్రాలను ఆశ్రయించారు. రోడ్డు పక్కన చెట్లు లేకపోవడంతో షాపుల వద్ద వున్న షెల్టర్ల వద్దకు చేరి కొద్దిసేపు సేదతీరారు.

Updated Date - May 08 , 2024 | 11:54 PM