Share News

అమర వీరుల త్యాగాలు యువతకు స్ఫూర్తి

ABN , Publish Date - Jul 27 , 2024 | 12:13 AM

దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాలు నేటి యువత స్ఫూర్తిగా తీసుకుని దేశానికి సేవలందించాలని బీజేపీ జాతీయ నాయకుడు పాక సత్యనారాయణ అన్నారు.

అమర వీరుల త్యాగాలు యువతకు స్ఫూర్తి
భీమవరం ఎస్‌ఆర్‌కేఆర్‌ కాలేజీలో కార్గిల్‌ వీరులకు సత్కారం

వాడవాడలా కార్గిల్‌ విజయ దివస్‌ కార్యక్రమాలు

భీమవరం రూరల్‌/భీమవరం టౌన్‌, జూలై 26 : దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాలు నేటి యువత స్ఫూర్తిగా తీసుకుని దేశానికి సేవలందించాలని బీజేపీ జాతీయ నాయకుడు పాక సత్యనారాయణ అన్నారు. ఎస్‌ఆర్‌కేఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో కార్గిల్‌ విజయ దివస్‌ 25వ వార్షికోత్సవం సందర్భంగా ఎన్‌ఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో కార్గిల్‌ వీరులను సత్కరించారు. ఎన్‌ఎస్‌ఎస్‌ కో–ఆర్డినేటర్‌ డాక్టర్‌ ఆర్‌.కృష్ణచైతన్య అధ్యక్షతన కార్యక్రమాలు నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కేవీ మురళీకృష్ణంరాజు మాట్లాడుతూ తమ కళాశాలలో ప్రతీ ఏటా కార్గిల్‌ వీరులను సత్కరిస్తున్నామన్నారు. బీజేపీ నాయకులు పాల్గొన్నారు. పట్టణంలోని క్విట్‌ ఇండియా స్తూపం వద్ద అరసవల్లి చారిటబుల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో కార్గిల్‌ విజయ్‌ దివస్‌ కార్యక్రమాన్ని నిర్వహించి 19 మంది మాజీ సైనికులను ఘనంగా సత్కరించారు. భీమవరం వన్‌టౌన్‌ ఎస్‌ఐ ఎం.వెంకటేశ్వరావు, ఎస్‌టీవో రవివర్మ, అరసవల్లి సుబ్రహ్మణ్యం, ఏఎంసీ మాజీ చైర్మన్‌ కోళ్ల నాగే శ్వరరావు, న్యాయవాది ఉండపల్లి రమేష్‌నా యుడు మాట్లాడారు. డీఎన్నార్‌ ఎన్‌సీసీ యూనిట్‌ ఆధ్వర్యంలో డీఎన్నార్‌ కళా శాల ప్రిన్సిపాల్‌ జి.మోజేష్‌ నేతృత్వంలో కార్గిల్‌ విజయ దివాస్‌ ర్యాలీ నిర్వహించారు.

పెంటపాడు : విద్యార్థులు చదువుతో పాటు దేశభక్తిని అలవర్చుకోవాలని విశ్రాంత మేజర్‌ జనరల్‌ బీవీ రావు, కెప్టెన్‌ భావన, 19వ ఆంధ్రా బెటాలియన్‌ ఏలూరు సీవో లెఫ్ట్‌నెంట్‌ కల్నర్‌ సౌరభ్‌ ముఖర్జీ అన్నారు. అలంపురం టీబీఆర్‌ సైనిక్‌ స్కూల్లో కార్గిల్‌ విజయ దివస్‌ రజతోత్సవాలను శుక్రవారం ఛైర్మన్‌ తనుబుద్ధి భోగేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. మాజీ సైనికుల సంక్షేమ సంఘం జిల్లా అధికారి ప్రసాద్‌, కరస్పాండెంట్‌ పద్మావతి, డైరెక్టర్‌ రవికిరణ్‌, హెచ్‌ఎం కళ్యాణి, ఏవో నాగరాజు పాల్గొన్నారు. పెంటపాడు డీఆర్‌ గోయెంకా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మొక్కలు నాటిన అనంతరం జెండాలతో ర్యాలీ నిర్వహిం చారు. వైస్‌ ప్రిన్సిపాల్‌ ప్రసాద్‌, ఎన్‌సీసీ అధికారి ప్రేమ్‌సాగర్‌ పాల్గొన్నారు.

నరసాపురం టౌన్‌ : కార్గిల్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు జరిపిన దహన కాండలో బలైన జవాన్లకు శుక్రవారం బీజేపీ నాయకులు వలంథర్‌రేవు వద్దను న్న జవాన్‌కు నివాళులర్పించారు. మునికోటి వెంకటేశ్వరావు, గునిశెట్టి శ్రీను, వనమాల శ్రీనివాస్‌, కంచర్ల నాగేశ్వరరావు, సత్యకృష్ణ, రవి, ప్రసాద్‌ పాల్గొన్నారు.

గణపవరం : కార్గిల్‌ అమరవీరుల త్యాగాలను దేశం ఎప్పటికి మరువదని గణపవరం మానవత స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు బుద్దారపు పుల్లయ్య అన్నారు. కార్గిల్‌ విజయ్‌ దివాస్‌ సందర్భంగా సరిపల్లెలో శుక్రవారం తిరంగమార్చ్‌ నిర్వహించారు.

Updated Date - Jul 27 , 2024 | 12:13 AM