Share News

బంగారు తల్లి..

ABN , Publish Date - Nov 20 , 2024 | 12:47 AM

బంగారు తల్లి.. మావుళ్లమ్మ ఆలయానికి భద్రతపెరగ నుంది. ఇప్పటికే అమ్మవారికి భారీగా బంగారు ఆభర ణాలు ఉన్నాయి. మరోవైపు బంగారు చీర తయారీ ప్రక్రియ మొదలైంది.

బంగారు తల్లి..

మావుళ్లమ్మకు బంగారంతో చీర తయారీ ప్రక్రియ మొదలు

దాతల నుంచి సేకరించేందుకు అధికారుల కసరత్తు

ఆరు గన్‌మెన్‌లతో భారీ భద్రతకు ఎమ్మెల్యే సిఫార్సు

భీమవరం టౌన్‌, నవంబరు 19(ఆంధ్రజ్యోతి): బంగారు తల్లి.. మావుళ్లమ్మ ఆలయానికి భద్రతపెరగ నుంది. ఇప్పటికే అమ్మవారికి భారీగా బంగారు ఆభర ణాలు ఉన్నాయి. మరోవైపు బంగారు చీర తయారీ ప్రక్రియ మొదలైంది. ఈ నేపథ్యంలో ఆరుగురు గన్‌ మెన్‌లతో నిరంతరం గస్తీ నిర్వహించేలా చూడాలని ఎమ్మెల్యే అంజిబాబు ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లారు. అమ్మ వారికి వంద కేజీల బంగారంతో చీర ను తయారు చేయించాలనే సంకల్పంతో 2009–14 మధ్య ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు శ్రీకారం చుట్టారు. దాతల నుంచి 74 కేజీల బంగారం రావడంతో 50 కేజీలతో తొడుగు తయారు చేయించి అమ్మవారికి అలంకరించారు. మరో 24 కే జీల బంగారంతో బంగారు చీరకు కావలసిన ఆభరణాలు చేయించాలని ప్రతిపాదించారు. అప్పటి ప్రభుత్వం గతంలో మాదిరి ప్రైవేట్‌ వ్యక్తులతో కాకుండా తిరు మల తిరుపతి దేవస్థానంలో వున్న మింట్‌లో చేయించాలని ఉత్తర్వులు వచ్చాయి. దీనిపై అప్పటి అధికారులు మింట్‌ను సంప్రదిస్తే నాలుగేళ్ల వరకు అవకా శం లేదని తేల్చి చెప్పడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. అప్పటి నుంచి బంగారు చీరకు సంబంధించి ఎలాంటి కదలిక లేకపోయింది.

బంగారు చీరపై కదలిక

కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతోపా టు మావుళ్లమ్మకు బంగారు చీర చేయించాలని సంకల్పించిన అంజిబాబు మళ్లీ ఎమ్మెల్యేగా రావడంతో ప్రస్తుతం ఉన్న 24 కేజీలతో బంగారు చీర తయారీ పనులకు కదలిక వచ్చింది. గతంలో మాదిరిగా ప్రైవే ట్‌ వ్యక్తులతో ఆభరణాలు చేయించేలా ప్రయత్నాలు సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. పూర్తిస్థాయి చీరకు కావాల్సిన మరో 26 కేజీల బంగారం దాతల నుంచి సేకరించే ప్రయత్నాలు కొనసాగనున్నాయి. ‘శాశ్వత బంగారు చీరతో మావుళ్లమ్మ భక్తులు దర్శ నం ఇచ్చేలా చేయాలన్నదే మా సంకల్పం. దీనికి అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నాం. అమ్మ ఆలయానికి రక్షణ నిమిత్తం మూడు షిప్టుల్లో ఆరుగురు గన్‌ మెన్‌లతో భద్రత క ల్పించాలని ప్రభుత్వాన్ని కోరాం’ అని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు తెలిపారు.

Updated Date - Nov 20 , 2024 | 12:47 AM