Share News

పాలిసెట్‌లో బాలికలదే హవా

ABN , Publish Date - May 08 , 2024 | 11:56 PM

పాలిటెక్నిక్‌ ప్రవేశ పరీక్ష పాలిసెట్‌ 2024 ఫలితాలలో ఉమ్మడి జిల్లాలో బాలికలదే హవా సాగింది. పశ్చిమ గోదావరి జిల్లాలో 88 శాతం, ఏలూరు జిల్లాలో 89 శాతం ఉత్తీర్ణత సాధించారు.

పాలిసెట్‌లో బాలికలదే హవా

పశ్చిమలో 5,813, ఏలూరులో

3,071 మంది ఉత్తీర్ణత

స్టేట్‌ టాపర్‌గా మోహిత్‌కృష్ణసాయి

భీమవరం ఎడ్యుకేషన్‌, మే 8 : పాలిటెక్నిక్‌ ప్రవేశ పరీక్ష పాలిసెట్‌ 2024 ఫలితాలలో ఉమ్మడి జిల్లాలో బాలికలదే హవా సాగింది. పశ్చిమ గోదావరి జిల్లాలో 88 శాతం, ఏలూరు జిల్లాలో 89 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఏప్రిల్‌ 27న పాలిసెట్‌ నిర్వహించగా 14 రోజుల్లోనే ఫలితాలు విడుదలయ్యాయి. పశ్చిమ లో 6,589 మంది పరీక్ష రాయగా బాలురు 3,400, బాలికలు 2,143 మొత్తంగా 5,813 మంది ఉత్తీర్ణత సాధించారు. ఏలూరు జిల్లాలో 3,417 మంది పరీక్ష రాయగా బాలురు 1,873, బాలికలు 1,198, మొత్తంగా 3,071 మంది ఉత్తీర్ణత సాధించారు. భీమవరం తిరుమల విద్యా సంస్థల విద్యార్థి పి.మోహిత్‌కృష్ణసాయి రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంక్‌ సాధించినట్లు సంస్థ డైరెక్టర్‌లు ఎస్‌.సాయిరాజు, పి.శ్రీనివాసవర్మ తెలిపారు. బుధవారం విద్యా సంస్థలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. మోహిత్‌కృష్ణసాయి 120 మార్కులకు 120 సాధించారన్నారు. 14, 24, 32 ర్యాంకులు తమ విద్యార్థులు సాధించినట్టు తెలిపా రు. స్టేట్‌ ఫస్ట్‌ ర్యాంక్‌ సాధించడం ఆనందంగా ఉందని కృష్ణసాయి చెప్పాడు. తల్లిదండ్రులు సుభద్ర, రాంబాబుల ప్రోత్సాహం, ఉపాధ్యాయుల సహకారం వల్లే ఇది సాధ్య మైందని, తనకు ఐఐటీ చదవాలనే లక్ష్యం ఉందన్నాడు.

Updated Date - May 08 , 2024 | 11:56 PM