Share News

పోస్టల్‌ ఓటింగ్‌కు రెండో రోజు క్యూ

ABN , Publish Date - May 08 , 2024 | 12:41 AM

పోస్టల్‌ బ్యాలెట్‌ను వినియోగించుకునేందుకు రెండో రోజు మంగళ వారం ఉద్యోగులు పోటెత్తారు.

పోస్టల్‌ ఓటింగ్‌కు రెండో రోజు క్యూ
భీమవరంలో పోస్టల్‌ బ్యాలెట్‌ పోలింగ్‌ను పరిశీలిస్తున్న కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌, జేసీ ప్రవీణ్‌ ఆదిత్య

13,849 మంది ఉద్యోగులకు..

ఓట్లు వేసింది 12,773 మంది..

ఇంకా వేయాల్సిన వారు 1,076

నేడు పోస్టల్‌ బ్యాలెట్‌ పొందవచ్చు

భీమవరం టౌన్‌/ఆచంట/నరసాపురం/తాడేపల్లిగూడెం రూరల్‌/పాలకొల్లు అర్బన్‌/ఉండి/తణుకు, మే 7 : పోస్టల్‌ బ్యాలెట్‌ను వినియోగించుకునేందుకు రెండో రోజు మంగళ వారం ఉద్యోగులు పోటెత్తారు. జిల్లా మొత్తం 13,849 మంది ఉద్యోగులకు పోస్టల్‌ బ్యాలెట్‌కు దరఖాస్తు చేసుకోగా సోమ వారం 7,540 మంది, మంగళవారం 5,233 మంది ఓటు హక్కు వినియోగించుకోగా ఇంకా 1,076 మంది ఓటు వేయా ల్సి ఉంది. వీరంతా ఈ నెల 11వ తేదీ వరకు సంబంధిత నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి వద్ద ఓటు హక్కు వినియోగించుకోచ్చని జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ తెలిపారు. ఎన్నిక కమిషన్‌ ఆదేశాల మేరకు ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది బుధవారం కూడా పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటు నమోదు చేసుకోవ చ్చని తెలిపారు. రెండు రోజులుగా పోస్టల్‌ బ్యాలెట్‌ను విజయ వంతంగా పూర్తి చేసినందుకు కలెక్టర్‌ ఆర్వోలను అభినందిం చారు. ఆచంట ఎంవీవీఆర్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల పోస్టల్‌ బ్యాలెట్‌ కేంద్రంలో మంగళవారం 581 మంది ఓటు వేసినట్లు ఆర్‌వో వి.స్వామినాయుడు తెలిపారు. బుధవారం పోస్టల్‌ బ్యాలెట్‌ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. మధ్యాహ్నం వాతావరణం ఒక్కసారిగా మారి ఈదురు గాలులు వీచడంతో టెంట్‌లు పడిపోగా, కుర్చీలు చెల్లా చెదురయ్యాయి. నరసాపు రం వైఎన్‌ కళాశాలలో రెండో రోజు 601 మంది ఓటు వేశారు. సీఐ స్వామి పోలింగ్‌ తీరును పరిశీలించారు. తాడేపల్లిగూడెం కోడే వెంకట్రావు మున్సిపల్‌ హైస్కూల్‌లో 827 మంది ఓటు హక్కు వినియోగించుకు న్నట్టు ఆర్వో చెన్నయ్య తెలిపారు. పోలింగ్‌ కేంద్రం వద్ద ఓటర్లకు నగదు ఆశ చూపించి ప్రలో భాలకు గురిచేసిన వైసీపీ నాయకులు నిమ్మల నాని, బండారు నాగు, టి.అజయ్‌లపై ఆర్వో ఇచ్చిన ఫిర్యాదు మేరకు పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. పాలకొల్లులో 674 మంది ఓటు హక్కు వినియోగించుకున్నట్టు ఆర్‌వో బి.శివనారాయణ రెడ్డి తెలిపారు. అయితే ఈ కేంద్రం సమీపంలో వైసీపీ నాయ కులు కొందరు సచివాలయ ఉద్యోగులకు రూ.వెయ్యి చొప్పున ఇవ్వగా పలు వురు నిరాకరించారు. తణుకులో 805 మంది ఓటు హక్కు వినియోగించుకున్నట్లు ఆర్వో బీవీ రమణ తెలి పారు. సాయంత్రం వీస్తున్న ఈదురు గాలులకు కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన టెంట్‌లు కూలాయి. భీమవరం, ఆచంటల్లోని ఫెసిలిటేషన్‌ కేంద్రాలను జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌, ఉండి, తణుకు, తాడేపల్లిగూడెం నియోజకవర్గాల ఎన్నికల సాధారణ పరిశీలకులు ఎల్‌.నిర్మల్‌రాజ్‌, ఉండి ఆర్వో సీవీ ప్రవీణ్‌ ఆదిత్య తదితరులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.

మొత్తం ఓటు మిగిలిన

నియోజకవర్గం ఓటర్లు వేసింది వారు

ఆచంట 1,483 1,387 96

పాలకొల్లు 2,013 2,033 177

నరసాపురం 1,583 1489 94

భీమవరం 2,781 2,530 251

ఉండి 1,625 1,591 34

తణుకు 2,156 1,943 213

తాడేపల్లిగూడెం 2,011 1,800 211

Updated Date - May 08 , 2024 | 12:41 AM