Share News

గంజాయి నివారణకు ప్రత్యేక బృందాలు : ఎస్పీ

ABN , Publish Date - Jul 26 , 2024 | 12:35 AM

గంజాయి నిర్మూలనకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి చర్యలు చేపడుతున్నట్టు జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్‌ శివ కిషోర్‌ చెప్పారు.

గంజాయి నివారణకు ప్రత్యేక బృందాలు : ఎస్పీ
రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ను పరిశీలిస్తున్న ఎస్పీ శివ కిషోర్‌

నూజివీడు టౌన్‌, జూలై 25: గంజాయి నిర్మూలనకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి చర్యలు చేపడుతున్నట్టు జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్‌ శివ కిషోర్‌ చెప్పారు. నూజివీడు సబ్‌ డివిజన్‌ పరిధిలోని పోలీస్‌ స్టేషన్లను గురువారం ఆయన పరిశీలించి మాట్లాడుతూ అవగాహన కోసం జిల్లాలోని పోలీస్‌ స్టేషన్లను పరిశీలిస్తున్నామన్నారు. ఏలూరు జిల్లాలో గంజాయి నివారణకు ప్రత్యేక దృష్టి సారించి స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆయనకు డీఎస్పీ లక్ష్మయ్య, రూరల్‌, పట్టణ సీఐలు రామకృష్ణ, మూర్తి పుష్పగుచ్ఛాలు ఇచ్చి ఆహ్వానించారు.

ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థులతో ముఖాముఖి

విద్యార్థులు తమ మేధస్సును రాష్ట్ర, దేశాభివృద్ధికి ఉపయోగించాలని ఎస్పీ కె.ప్రతాప్‌ శివ కిషోర్‌ సూచించారు. నూజివీడులో గురువారం ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘విద్యార్థులు ఉన్నత శిఖరాలకు అధిరోహించేందుకు కావాల్సిన స్కిల్స్‌పై దృష్టి పెట్టాలి. అప్లికేషన్‌ డెవలప్‌మెంట్‌, ప్రొడక్టు డెవలప్‌మెంట్‌పై దృష్టి పెడితే ఇంటర్నషిప్‌ ద్వారా మెరుగైన ఉపాఽధి సాధించవచ్చు. ట్రిపుల్‌ ఐటీల్లో గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు సమాజాన్ని దగ్గర నుంచి చూసే అవకాశం ఉంది. సమాజంలోని సమస్యలను యూ ట్యూబ్‌, చాట్‌ జీపీటీ లాంటి వాటి ద్వారా సాంకేతికతతో మేళవిస్తే ప్రతి రంగంలో రాణించవచ్చన్నారు. ట్రిపుల్‌ ఐటీ డైరెక్టర్‌ చంద్రశేఖర్‌ ఎస్పీని సత్కరించారు. డీఎస్పీ జి.లక్ష్మయ్య, డీన్‌ ఆఫ్‌ అకడమిక్‌ రత్నాకర్‌, ఫైనాన్స్‌ ఆఫీసర్‌ శ్రీనాథ్‌, పీఆర్వో సురేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Jul 26 , 2024 | 12:35 AM