Share News

అదనపు పొగాకు అమ్మకాలకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌

ABN , Publish Date - Jul 26 , 2024 | 12:25 AM

రైతులు అదనంగా పండించిన వర్జీనియా పొగాకును అధీకృత వేలం కేంద్రాల్లో అమ్ముకోవడానికి, వేలం కేంద్రాల ద్వారా వ్యాపారులు కొనుగోలు చేయడానికి కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందని కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి సునీల్‌ బర్త్వల్‌ ఉత్తర్వులు విడుదల చేశారని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్‌కుమార్‌ గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

అదనపు పొగాకు అమ్మకాలకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌
కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి సునీల్‌ బర్త్వల్‌తో ఎంపీ పుట్టా

ఏలూరు ఎంపీ పుట్టా మహేష్‌కుమార్‌ హర్షం

జంగారెడ్డిగూడెం, జూలై 25 : రైతులు అదనంగా పండించిన వర్జీనియా పొగాకును అధీకృత వేలం కేంద్రాల్లో అమ్ముకోవడానికి, వేలం కేంద్రాల ద్వారా వ్యాపారులు కొనుగోలు చేయడానికి కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందని కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి సునీల్‌ బర్త్వల్‌ ఉత్తర్వులు విడుదల చేశారని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్‌కుమార్‌ గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన హర్సం వ్యక్తం చేసి మాట్లాడారు. మిచౌంగ్‌ తుఫాన్‌ వల్ల పంట నష్టపోయిన తరువాత ప్రభుత్వం అనుమతి ఇచ్చిన దానికంటే అదనంగా పొగాకు పండించా మని, ఆ పొగాకును అపరాధ రుసుం లేకుండా కొనుగోలు చేయాలని ఈనెల పదో తేదీన దేవరపల్లిలో జరిగిన పొగాకు (టీఐఐ) రైతు అవార్డుల వేడుకల్లో రైతులు తన దృష్టికి తీసుకొచ్చారన్నారు. దీనిపై కేంద్ర మంత్రి పియూష్‌ గోయల్‌కు వివరించి అనుమతి కోరగా వెంటనే స్పందించి అపరాధ రుసుం లేకుండా అదనపు పొగాకును రైతులు అమ్ముకునేలా జీవో విడుదల చేశారన్నారు. ఒక పొగాకు బ్యారన్‌ లైసెన్సు కలిగిన ప్రతీ రైతు ఇప్పటివరకు 35 క్వింటాళ్ళ పొగాకు మాత్రమే పండించవలసి ఉండగా ఇక నుంచి 41.25 క్వింటాళ్ళ వరకు పండించుకోవడానికి కేంద్రం అనుమతిచ్చినట్టు తెలిపారు. త్వరలో పామాయిల్‌ రైతుల సమస్యలను పరిష్కరిస్తానని ఎంపీ పేర్కొన్నారు.

Updated Date - Jul 26 , 2024 | 12:25 AM