తాడేపల్లి టు బెంగళూరు.. షటిల్ సర్వీస్
ABN , Publish Date - Sep 21 , 2024 | 01:37 PM
అధికారం దూరమై జస్ట్ 100 రోజులు మాత్రమే అయింది. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం మళ్లీ బెంగళూరుకు బయలుదేరి వెళ్లారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన నాటి నుంచి నిన్నటి వరకు జగన్ 10 సార్లు బెంగళూరు వెళ్లారు. గతంలో ఎప్పుడో ఒకసారి మాత్రమే బెంగళూరు పయనమయ్యే ఆయన.. ఇప్పుడు నెలకి ఒకసారి కాకుండా పలుమార్లు బెంగళూరు వెళ్లడం అనేక ఊహాగానాలకు తావిస్తోంది.
అధికారం దూరమై జస్ట్ 100 రోజులు మాత్రమే అయింది. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం మళ్లీ బెంగళూరుకు బయలుదేరి వెళ్లారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన నాటి నుంచి నిన్నటి వరకు జగన్ 10 సార్లు బెంగళూరు వెళ్లారు. గతంలో ఎప్పుడో ఒకసారి మాత్రమే బెంగళూరు పయనమయ్యే ఆయన.. ఇప్పుడు నెలకి ఒకసారి కాకుండా పలుమార్లు బెంగళూరు వెళ్లడం అనేక ఊహాగానాలకు తావిస్తోంది. నెలలో పలుమార్లు వైసీపీ అధినేత ఇలా తాడేపల్లి ప్యాలెస్ టు బెంగళూరు ప్యాలెస్ అంటూ షటిల్ సర్వీస్ చేస్తుండటంపై సొంత పార్టీలోనే రకరకాల గుసగుసలు వినిపిస్తున్నాయి.
తాజాగా ఆ ఏడుకొండలపై కొలువు తీరిన ఆ దేవదేవుడి ప్రసాదం ‘లడ్డూ’ తయారీలో నాటి జగన్ ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై ప్రపంచవ్యాప్తంగా శ్రీవారి భక్తుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి కీలక సమయంలోనూ ఆయన బెంగళూరు పయనమవడం సరికొత్త సందేహాలకు కారణమవుతోంది.
2019లో అధికారం చేపట్టిన వైఎస్ జగన్.. అధికార పీఠం దిగే వరకు ఎన్ని సార్లు బెంగళూరు వెళ్లారని ఈ సందర్బంగా పోలిటికల్ అనలిస్ట్‌లు లెక్క లేస్తున్నారు. ముఖ్యమంత్రిగా ఉండగా.. వైఎస్ జగన్ తాడేపల్లి ప్యాలెస్‌కు మాత్రమే పరిమితమైయ్యారని గుర్తు చేస్తున్నారు. ఎప్పుడైనా బయటకు వస్తే మాత్రం.. పరదాల చాటునే తన ప్రయాణాన్ని సాగించేవారని.. ఇప్పుడు మాత్రం సాధారణ వ్యక్తిలా తరచుగా ప్రయాణాలు సాగిస్తున్నారని వారు పేర్కొంటున్నారు. మరి ఇంతలా జర్నీ చేయడం వెనుక రీజన్ ఏమై ఉంటుందా అని సందేహాన్ని సైతం వ్యక్తం చేస్తున్నారీ పొలిటికల్ అనలిస్ట్‌లు.
కూటమి ప్రభుత్వం కోలువు తీరిన అనంతరం గత ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న పలు చీకటి నిర్ణయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయని పేర్కొంటున్నారు. అందులోభాగంగానే బాలీవుడ్ నటీ జత్వానీ కేసు విషయంలో ముగ్గురు సీనియర్ ఐపీఎస్‌లపై వేటు పడిందని సోదాహరణగా వివరిస్తున్నారు. అలాగే ప్రస్తుతం శ్రీవారి లడ్డూ వివాదం వాడి వేడిగా సాగుతుందని చెబుతున్నారు. సాక్షాత్తూ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా నేరుగా సీఎం చంద్రబాబుకు ఫోన్ చేసి శ్రీవారి ‘లడ్డూ’ అంశం పై ఆరా తీశారని... దీనిపై నివేదిక పంపాలని సీఎంకి కేంద్ర మంత్రి సూచించారని గుర్తు చేస్తున్నారు.
మరోవైపు తాజాగా సొంత బంధువు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సైతం పార్టీని వీడారని, అలాగే మరో మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయ భాను సైతం పార్టీకి బై బై గుడ్ బై చెప్పేశారని చెబుతున్నారు. అయితే వీరిద్దరు పార్టీని వీడుతూ.. అధినేత జగన్‌తోపాటు పార్టీపై విమర్శలు సైతం గుప్పించారని పోలిటికల్ అనలిస్ట్‌లు వివరిస్తున్నారు.
అదీకాక.. కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకునేందుకే వైఎస్ జగన్ బెంగళూరు టు తాడేపల్లి షటిల్ సర్వీస్ చేస్తున్నారని వారు విశ్లేషిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వాన్ని ఎదుర్కొవాలంటే.. వైసీపీకి బలం లేదు. వెనుక బలగం కూడా లేదు. ఈ నేపథ్యంలో బీజేపీ, జనసేన, టీడీపీకి ఉన్న ఒకే ఒక్క వ్యతిరేక పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీతో బంధాన్ని కొనసాగించేందుకే వైఎస్ జగన్ తరచుగా బెంగళూరు ప్రయాణం కడుతున్నారని పోలిటికల్ అనలిస్ట్‌లు విశ్లేషణ చేస్తున్నారు.
కర్ణాటక పీసీసీ చీఫ్, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో మంతనాలు జరిపేందుకే జగన్ ఈ ప్రయాణం సాగిస్తున్నారని భావిస్తున్నారు. వాస్తవానికి దక్షిణాది ఆయా పార్టీలతో కాంగ్రెస్‌కు పొత్తు కలపడం, ఆయా పార్టీ నేతలను కాంగ్రెస్‌లో తీసుకోవడం వంటి కీలక విషయాలను డీకే శివకుమార్ చూస్తూ వస్తున్నారు.
ఈ క్రమంలోనే జగన్.. డీకేతో మంతనాలు జరిపేందుకే తరచుగా బెంగళూరు వెళ్తున్నట్లు పోలిటికల్ అనలిస్ట్‌లు పేర్కొంటున్నారు. మరోవైపు సొంత చెల్లెలె అయిన షర్మిలతో జగన్‌కు అస్సలు పొసగడం లేదు. పైగా ఇప్పుడామే ఏపీ పీసీసీ చీఫ్ కూడా. ఇలాంటి సమయంలో నిజంగానే డీకే శివకుమార్‌తో జగన్ మంతనాలు జరిపినట్లయితే.. ఆ డిస్కషన్స్ వర్కౌట్ అవుతాయా? లేదా? ఓ వేళ అన్నీ ఓకే అనుకుంటే షర్మిల పరిస్థితేంటి? అన్నా చెల్లి ఒక్కటవుతారా? అనే ఓ చర్చ సైతం పోలిటికల్ సర్కిల్లో వాడి వేడిగా వైరల్ అవుతంది.
For More AndhraPradesh News And Telugu News..