AP Politics: మంత్రి రోజాకు బిగ్ షాక్.. ఏకంగా 5 మండలాల నేతలు కలిసి..
ABN , Publish Date - Mar 15 , 2024 | 01:03 PM
సొంత నియోజకవర్గంలో మంత్రి రోజాకు(Minister Roja) బిగ్ షాక్ తగిలింది. సొంత పార్టీ నేతలే ఆమె అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తాజాగా నగరి(Nagari) నియోజకవర్గ ఐదు మండలాల వైసీపీ(YSRCP) నాయకులు ఆమె వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన చేపట్టారు. తమ నియోజకవర్గానికి రోజా వొద్దని, ఆమెకు టికెట్ ఇవ్వొద్దని సీఎం జగన్ను అభ్యర్థించారు. ‘జగనన్న ముద్దు - రోజా వద్దు’ అంటూ నగరి నియోజకవర్గ 5 మండలాల
తిరుపతి, మార్చి 15: సొంత నియోజకవర్గంలో మంత్రి రోజాకు(Minister Roja) బిగ్ షాక్ తగిలింది. సొంత పార్టీ నేతలే ఆమె అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తాజాగా నగరి(Nagari) నియోజకవర్గ ఐదు మండలాల వైసీపీ(YSRCP) నాయకులు ఆమె వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన చేపట్టారు. తమ నియోజకవర్గానికి రోజా వొద్దని, ఆమెకు టికెట్ ఇవ్వొద్దని సీఎం జగన్ను అభ్యర్థించారు. ‘జగనన్న ముద్దు - రోజా వద్దు’ అంటూ నగరి నియోజకవర్గ 5 మండలాల వైసీపీ నాయకులు ప్లకార్డులు ప్రదర్శించారు. రోజాకు టిక్కెట్టు ఇవ్వొద్దని జగన్ను వేడుకుంటున్నామన్నారు. నగరి నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్తలు నిరుత్సాహంతో ఉన్నారని, రోజా చరిష్మాతో నగరిలో గెలిచే ప్రసక్తే లేదని వారు పేర్కొన్నారు. తాము సపోర్ట్ చేస్తేనే రోజా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిందన్నారు. ఈసారి రోజాకు సీటు ఇవ్వొదని డిమాండ్ చేశారు. ఒకవేళ రోజాకు టికెట్ ఇస్తే తాము మద్ధతివ్వమని.. ఖచ్చితంగా ఓడిపోతుందని స్పష్టం చేశారు అసంతృప్త నేతలు. కార్యకర్తలను రోజా హేళనగా మాట్లాడుతారని పార్టీ శ్రేణులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఇదిలాఉంటే.. వైసీపీ నేత కె.జె.కుమార్ చేసిన ప్రకటనతో తమకు సంబంధం లేదని.. ఆయనతో కలిసి తాము ఎన్నికల ప్రచారం చేయ్యబోమని స్పష్టం చేశారు నేతలు. నగరి మొత్తాన్ని రోజా, రోజా అన్నదమ్ములు దోచేశారని ఆరోపించారు. తమ అనుచరులను రోజా పోలీసు కేసులతో తీవ్ర ఇబ్బందులకు గురిచేసిందని ఆరోపించారు. రోజాతో తాము ఎప్పటికీ కలవబోమని తేల్చి చెప్పారు. పార్టీ అధినేత తమను బుజ్జగించారనడంలో ఏమాత్రం నిజం లేదన్నారు. రోజా వల్ల వైసీపీకి తీరని నష్టం కలుగుతోందన్నారు. అధినేత జగన్ ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని.. రోజాకు టికెట్ కేటాయించొద్దని వైసీపీ అసంతృప్త నేతలు కోరారు.