Share News

Adani Group: అదానీ గ్రూప్ రెండు సంస్థలు విలీనం.. ఫ్యూచర్ ప్లాన్ ఏంటి..

ABN , Publish Date - Oct 02 , 2024 | 09:55 PM

దేశంలో ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీకి చెందిన రెండు కంపెనీలు విలీనమయ్యాయి. స్టాక్ మార్కెట్‌కు ఇచ్చిన సమాచారం ఆధారంగా అదానీ గ్రూప్‌కు చెందిన రెండు కంపెనీలు విలీనం అయినట్లు వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలేంటో ఇక్కడ చుద్దాం.

Adani Group: అదానీ గ్రూప్ రెండు సంస్థలు విలీనం.. ఫ్యూచర్ ప్లాన్ ఏంటి..
Adani Group merged

భారతదేశంలోని అత్యంత సంపన్న పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీకి(gautam adani) చెందిన రెండు కంపెనీలు అక్టోబర్ 2, 2024న విలీనమయ్యాయి. స్టాక్ మార్కెట్‌కు ఇచ్చిన సమాచారంలో అదానీ గ్రూప్‌కు చెందిన రెండు కంపెనీలు విలీనం అయినట్లు కంపెనీ తెలిపింది. ఎక్స్ఛేంజ్ ఫైలింగ్స్ ప్రకారం అదానీ గ్రూప్‌(Adani Group)లోని రెండు కంపెనీలు అదానీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్, ముంద్రా సోలార్ టెక్నాలజీ లిమిటెడ్. ఈ రెండు కంపెనీలు అదానీ న్యూ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ANIL)లో విలీనం అయ్యాయి.


ఇప్పటికే ప్రకటన

అదానీ ఎంటర్‌ప్రైజెస్ స్టాక్ ఎక్స్ఛేంజీకి ఒక ప్రకటనలో ఈ మేరకు తెలిపింది. కంపెనీల చట్టం 2013లోని సెక్షన్ 233, దాని కింద రూపొందించిన నిబంధనలతో వర్తించే విధంగా రెండు పూర్తి యాజమాన్యంలోని షేర్ల స్టెప్ డౌన్ గురించి తెలియజేస్తున్నట్లు ప్రకటించింది. అదానీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్, ముంద్రా సోలార్ టెక్నాలజీ లిమిటెడ్‌లు అదానీ న్యూ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌తో విలీనమయ్యాయి. అక్టోబర్ 1, 2024 నుంచి విలీనం అమల్లోకి వస్తుందని అదానీ ఎంటర్‌ప్రైజెస్ సమాచారం ఇచ్చింది. అధికారులతో చట్టబద్ధమైన ఫైలింగ్‌లతో సహా అన్ని విధానపరమైన ఫార్మాలిటీలు పూర్తయ్యాయి.


ఆ కంపెనీకి వాటా

అదానీ న్యూ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ANIL) సోలార్ గ్లాస్, అల్యూమినియం ఫ్రేమ్, బ్యాక్ షీట్ వంటి గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తుల కోసం అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ (AEL) తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తోంది. కంపెనీ ప్రస్తుత సోలార్ సెల్, మాడ్యూల్ తయారీకి ఇవి కీలకమైన భాగాలు. కంపెనీ తక్కువ కార్బన్ ప్రాజెక్టులను నిర్వహిస్తోంది. ఇది గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులు, విండ్ టర్బైన్లు, సోలార్ మాడ్యూల్ వంటి బ్యాటరీలను తయారు చేస్తుంది. ఫ్రెంచ్ ఇంధన రంగ దిగ్గజ సంస్థ టోటల్ ఎనర్జీస్ అదానీ న్యూ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ANIL)లో 25% ఈక్విటీ వాటాను కలిగి ఉంది. మిగిలిన షేర్లలో చాలా వరకు AEL యాజమాన్యంలో ఉన్నాయి.


విలీనం వెనుక ప్లాన్ ఏంటి?

అదానీ విలీనం ప్రకారం సోలార్ సెల్, మాడ్యూల్ తయారీకి దాని సరఫరా వ్యవస్థను సిద్ధం చేయడమే ఈ ప్లాన్ లక్ష్యం అని కంపెనీ సీనియర్ అధికారులు తెలిపారు. రెండు కంపెనీలు ప్రస్తుతం సోలార్ గ్లాస్‌ని తయారు చేస్తున్నాయి. కానీ ఇది అవసరాన్ని తీర్చడం లేదని ఆయా వర్గాలు తెలిపాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఏకమైనట్లు తెలిపారు. అదానీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలపర్స్ రియల్ ఎస్టేట్ కంపెనీగా పనిచేస్తుంది. ఇది థర్మల్, సోలార్ ఎనర్జీ ప్రాజెక్ట్‌లను నిర్మిస్తుంది, అభివృద్ధి చేస్తుంది. అలాగే ఇంజనీరింగ్, టెక్నో కమర్షియల్, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్, కంట్రోల్, కమీషనింగ్ సేవలను అందిస్తుంది.


ఇవి కూడా చదవండి:

SIP Investment: చిరు ఉద్యోగస్తులకు గుడ్‌ న్యూస్.. రూ.99 నుంచే మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు

Cash Deposit Machine: క్యాష్ డిపాజిట్ మెషిన్ ద్వారా రోజు ఎంత డిపాజిట్ చేసుకోవచ్చు..


Online Shopping Tips: పండుగల సీజన్‌లో ఆన్‌లైన్‌ షాపింగ్ చేస్తున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి

Bank Holidays: అక్టోబర్‌లో బ్యాంకు సెలవులు ఎన్నిరోజులంటే.. పనిచేసేది మాత్రం.

Business Idea: ఈ వ్యాపారం ఎవర్ గ్రీన్.. రూ.50 వేల పెట్టుబడి, 11 లక్షలకుపైగా లాభం..


Read More Business News and Latest Telugu News

Updated Date - Oct 02 , 2024 | 09:57 PM