Home » Adani Enterprises
వివాదాస్పద వ్యాపారవేత్త.. గౌతమ్ అదానీ!దేశంలోనే అత్యంత అవినీతిపరుడైన రాజకీయ వేత్తగా ముద్రపడిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి! వీరిద్దరి మధ్య ‘ముడుపుల బంధం’ బట్టబయలైంది.
దేశంలో ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీకి చెందిన రెండు కంపెనీలు విలీనమయ్యాయి. స్టాక్ మార్కెట్‌కు ఇచ్చిన సమాచారం ఆధారంగా అదానీ గ్రూప్‌కు చెందిన రెండు కంపెనీలు విలీనం అయినట్లు వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలేంటో ఇక్కడ చుద్దాం.
అదానీ గ్రూప్‌నకు సంబంధించి ఇటీవల స్విట్జర్లాండ్ ఫెడరల్ క్రిమినల్ కోర్టు స్తంభింపచేసిన బ్యాంకు ఖాతాలను స్విస్ అటార్నీ జనరల్ ఆఫీస్ (ఓఏజీ) నిశితంగా పరిశీలిస్తోంది.
ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ 2027 నాటికి ప్రపంచంలోనే మొదటి ట్రిలియనీర్‌గా అవతరించవచ్చని ఇన్ఫార్మా కనెక్ట్ అకాడమీ నివేదిక తెలిపింది. అదే సమయంలో గౌతమ్ అదానీ ఆ హోదాను 2028లో చేరుకునే అవకాశం ఉందని అంచనా వేసింది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం నాడు హైదరాబాద్‌లో గల ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయానికి వచ్చారు. ఆయనతోపాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ తదితర నేతలు ఉన్నారు.
విదేశాల్లోని అదానీ గ్రూప్‌లో సెబీ చైర్మన్ మాధవి బుచ్ అక్రమ పెట్టుబడులు పెట్టారంటూ హిండెన్‌బర్గ్ సంస్థ చేసిన ఆరోపణ.. బీజేపీ, కాంగ్రెస్ మధ్య తీవ్ర వాగ్యుద్ధానికి కారణమైంది! ప్రతిపక్షాలన్నీ ఈ విషయంలో ప్రభుత్వాన్ని తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నాయి.
హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపణలను మాధవి పురి బుచ్, ఆమె భర్త ధవల్ బుచ్ తోసిపుచ్చారు. తాము ఎన్నడూ అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు లేదా రుణ పత్రాల్లో పెట్టుబడులు పెట్టలేదని స్పష్టం చేశారు. దీనికి సంబంధించి ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
సెబీ చైర్పర్సన్ మాధవి బుచ్, ఆమె భర్త ధావల్ బుచ్‌కు విదేశాల్లో ఉన్న అదానీ కంపెనీల్లో వాటాలు ఉన్నాయంటూ అమెరికా షార్ట్‌సెల్లింగ్ సంస్థ హిండెన్‌బర్గ్ తాజాగా చేసిన ఆరోపణలపై దర్యాప్తునకు సంయుక్త పార్లమెంటరీ కమిటీని (జేపీసీ) ఏర్పాటు చేయాలని విపక్షాలు ముక్తకంఠంతో డిమాండ్ చేశాయి.
అమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణలపై అదానీ గ్రూప్ స్పందించింది. గతంలో భారత సుప్రీం కోర్టు తోసిపుచ్చిన ఆరోపణలనే హిండెన్‌బర్గ్ మళ్లీ మళ్లీ వల్లెవేస్తోందని మండిపడింది.
అదానీ గ్రూప్ స్టాక్ మార్కెట్లో అవకతవకలకు పాల్పడిందంటూ వచ్చిన ఆరోపణలపై సెబీ చేస్తున్న విచారణను ప్రత్యేక విచారణ బృందం (సిట్) లేదా సీబీఐకి అప్పగించాలంటూ ...