Share News

CM Revanth: అదానీ స్కామ్‌పై విచారణ చేయండి

ABN , Publish Date - Aug 22 , 2024 | 04:47 PM

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం నాడు హైదరాబాద్‌లో గల ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయానికి వచ్చారు. ఆయనతోపాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ తదితర నేతలు ఉన్నారు.

CM Revanth:  అదానీ స్కామ్‌పై విచారణ చేయండి
CM Revanth Reddy

హైదరాబాద్: అదానీ కుంభకోణంపై విచారణ జరపాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. స్కామ్‌లో నిజనిజాలు వెలుగులోకి తీసుకొని రావాలని కోరింది. హైదరాబాద్‌లో గల ఈడీ కార్యాలయానికి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) వచ్చారు. అదానీ స్కాం గురించి విచారణ జరపాలని అధికారులకు వినతి పత్రం అందజేశారు. సీఎం రేవంత్ రెడ్డితో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ, సల్మాన్ ఖుర్షీద్, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తదితరులు ఉన్నారు.


modi.jpg


పారిపోయిన ప్రధాని మోదీ

‘అదానీ కుంభకోణంపై చట్ట సభల్లో సమాధానం ఇవ్వకుండా ప్రధాని మోదీ పారిపోయారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి 2014 వరకు చేసిన అప్పు రూ.55 వేల కోట్లు. గత పదకొండేళ్లలో ప్రధాని మోదీ చేసిన అప్పు లక్షా 15 వేల కోట్లు. 16 మంది ప్రధానమంత్రులు చేసిన అప్పు కంటే మోదీ రెండింతలు అప్పులు చేశారు. దేశంలో సాగునీటి ప్రాజెక్టులు తీసుకొచ్చిన ఘనత జవహర్ లాల్ నెహ్రూకు దక్కుతుంది. బ్యాంకుల జాతీయకరణతో పేదలకు అందుబాటులోకి వచ్చాయి. సాహసోపేత నిర్ణయంతో పేదలకు భూములు పంచిన ఘనత ఇందిరమ్మకు దక్కుతుంది. దేశంలో సాంకేతిక విప్లవానికి రాజీవ్ గాంధీ నాంది పలికారు. స్థానిక సంస్థల్లో మహిళా రిజర్వేషన్ ప్రవేశ పెట్టిన మహా నేత రాజీవ్ గాంధీ. హమ్ దో.. హమారే దో అన్నట్లు మోదీ అమిత్ షా వ్యవహారం ఉంది అని’ సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.


modi 2.jpg


దోపిడి దొంగలు..?

‘ప్రపంచాన్ని దోచుకునేలా మోదీ, అమిత్ షా వ్యవహార శైలి ఉంది. సెబీ చైర్ పర్సన్ తక్షణమే రాజీనామా చేయాలి. లేదంటే కేంద్ర ప్రభుత్వం తొలగించాలి. కుంభకోణంపై ఈడీ విచారణ చేయాలి. ఎంత గొప్ప స్థానంలో ఉన్నా సరే పార్టీ పిలుపునిస్తే పాటించాల్సిందే. నేను ముఖ్యమంత్రి అయినప్పటికీ ఒక కార్యకర్తగా నిరసన కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చా. ఈ దేశానికి బీజేపీ నుంచి ముప్పు ఉంది. కుంభకోణంపై బీఆర్ఎస్ నేతలు బీజేపీని ఎందుకు ప్రశ్నించడం లేదు? వాళ్లు విలీనమైతరో మలినమైతరో మాకు సంబంధం లేదు. బీజేపీని కేసీఆర్ ఎందుకు ప్రశ్నించడం లేదు. ఈ దోపిడీ పై ట్విట్టర్ టిల్లు కేటీఆర్ ఎందుకు మాట్లాడటం లేదు. దేశ సంపదను దోచుకుంటున్న బీజేపీకి బీఆర్ఎస్ అనుకూలం అనడానికి ఇది నిదర్శనం అని’ సీఎం రేవంత్ రెడ్డి గుర్తుచేశారు.


BRS.jpg


మీ విధానమెంటీ..?

‘జేపీసీపై బీఆర్ఎస్ విధానం ఏంటో స్పష్టం చేయాలి. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తామని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. మీ తాత ముత్తాతలు దిగొచ్చినా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏం చేయలేరు. రాజీవ్ విగ్రహంపై చేయి వేస్తే వీపు చింతపండు అవుతుంది. ఎవరు తొలగిస్తారో రావాలి. ఏ తేదీన తీస్తారో చెప్పాలి. పదేళ్ల తరువాత వీరికి తెలంగాణ తల్లి గుర్తొచ్చింది. మాకు కనిపించే తెలంగాణ తల్లి సోనియమ్మ. ఆమె జన్మదినం డిసెంబర్ 9వ తేదీన సచివాలయం లోపల తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తాం. మేం తెలంగాణ తల్లికి నిజమైన వారసులం అని నిరూపించుకుంటాం. రైతు రుణమాఫీపై బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వీరిని నమ్ముకుని రైతులు రోడ్డెక్కొద్దు. ఈ ప్రభుత్వం ఉన్నదే మీ కోసం. పదేళ్లలో బీఆర్ఎస్ వాళ్లు ఇచ్చింది ఎంత? పది నెలల్లో మేం ఇచ్చింది ఎంత? చర్చకు సిద్ధమా..? రాజీనామా చేయాల్సి వస్తుందని హరీశ్ రావు కొత్త డ్రామాలు ఆడుతున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి 9 సీట్లు కూడా మిగలవు అని’ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి...

Konda muarali: బస్వరాజు సారయ్యపై కొండా మురళి ఫైర్

CM Revanth Reddy: బీఆర్ఎస్ సన్నాసులను నమ్ముకొని రైతులు ఆగం కావద్దు: సీఎం

Read Latest Telangana News And Telugu News

Updated Date - Aug 22 , 2024 | 04:47 PM