Share News

Elon Musk: తొలి ట్రిలియనీర్‌గా ఎలాన్ మస్క్.. అదానీ తరువాతే అంబానీ

ABN , Publish Date - Sep 09 , 2024 | 08:52 PM

ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ 2027 నాటికి ప్రపంచంలోనే మొదటి ట్రిలియనీర్‌గా అవతరించవచ్చని ఇన్ఫార్మా కనెక్ట్ అకాడమీ నివేదిక తెలిపింది. అదే సమయంలో గౌతమ్ అదానీ ఆ హోదాను 2028లో చేరుకునే అవకాశం ఉందని అంచనా వేసింది.

Elon Musk: తొలి ట్రిలియనీర్‌గా ఎలాన్ మస్క్.. అదానీ తరువాతే అంబానీ

ఢిల్లీ: ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ 2027 నాటికి ప్రపంచంలోనే మొదటి ట్రిలియనీర్‌గా అవతరించవచ్చని ఇన్ఫార్మా కనెక్ట్ అకాడమీ నివేదిక తెలిపింది. అదే సమయంలో గౌతమ్ అదానీ ఆ హోదాను 2028లో చేరుకునే అవకాశం ఉందని అంచనా వేసింది. అయితే ఆసియాలోనే అత్యంత ధనవంతుడైన ముఖేష్ అంబానీ మాత్రం 2033లో ట్రిలియనీర్‌గా అవతరించవచ్చని తెలిపింది. 237 బిలియన్ డాలర్లతో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన ఎలాన్ మస్క్ తొలి ట్రిలియనీర్‌గా అవతరించేందుకుగానూ సగటు వార్షిక వృద్ధి రేటు 110 శాతం ఉండాలని నివేదిక తెలిపింది.


ఈ జాబితాలో ప్రస్తుతం 13వ స్థానంలో ఉన్న అదానీ సంపద 100 బిలియన్ డాలర్లుకాగా.. ట్రిలియనీర్ జాబితాలో చేరే రెండో వ్యక్తిగా ఆయన నిలవనున్నారని నివేదిక అంచనా వేసింది. పోర్టులు, విద్యుత్ వంటి వ్యాపార విభాగాల్లో కొనసాగుతున్న ఆయన.. సగటున 123 శాతం వార్షిక వృద్ధిని సాధిస్తేనే ట్రిలియనీర్ లక్ష్యాన్ని చేరుకుంటారు. మరో బిలియనీర్ ముఖేష్ అంబానీ ప్రస్తుతం111 బిలియన్ల డాలర్ల నెట్‌వర్త్‌తో ఆసియాలో అత్యంత సంపన్నుల జాబితాలో ఉన్నారు. 2033 వరకు ఆయన ఇదే స్థితిని కొనసాగించవచ్చు.

ముఖేష్‌కు చెందిన ఆయిల్ టు టెలికాం అండ్ రిటైల్ సమ్మేళనం 2035లో ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్‌ను చేరుకోనుంది. ముఖేష్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మాత్రమే 2035నాటికి ఆ మార్కును చేరుకోగలదని నివేదిక అంచనా వేసింది.


కంపెనీలు..

తైవాన్‌కు చెందిన సెమీ కండక్టర్ తయారీ సంస్థ టీఎస్ఎంసీ ప్రస్తుతం 893.7 బిలియన్ డాలర్ల క్యాప్ కలిగి ఉంది. 2025నాటికి ట్రిలియన్ డాలర్ల వ్యవస్థగా అవతరిస్తుందని రిపోర్ట్ అంచనా వేసింది. దీంతోపాటు బెర్క్‌షైర్ హాత్వే, ఫార్మా దిగ్గజం ఎలి లిల్లీ, టెక్నాలజీ కంపెనీ బ్రాడ్‌కామ్, ఎలక్ట్రిక్ ఆటోమొబైల్ సంస్థ టెస్లా కూడా అతి త్వరలో ఈ ఘనతను సాధించబోతున్నట్లు పేర్కొంది. ప్రపంచంలో ఇప్పటివరకు ఎవరూ ట్రిలియనీర్లుగా అవతరించలేదు. నివేదిక ప్రకారం త్వరలోనే కొందరు ఈ ఘనతను అందుకోబోతున్నారు.


వారిలో ఎలాన్ మస్క్, గౌతమ్ అదానీ, NVIDIA వ్యవస్థాపకుడు జెన్సన్ హువాంగ్, ఇండోనేసియా మొగల్ ప్రజోగో పాంగేస్టు, ఫ్రెంచ్ వ్యాపారవేత్త బెర్నార్డ్ ఆర్నాల్ట్, Facebook CEO మార్క్ జుకర్‌బర్గ్ ఉన్నారు. ప్రస్తుతం వాల్యుయేషన్‌లో1 ట్రిలియన్‌ డాలర్లను దాటిన కంపెనీలు కొన్ని మాత్రమే ఉన్నాయి. ఇందులో Microsoft, Nvidia, Apple, Alphabet, Amazon, Saudi Aramco, Meta ఉన్నాయి. ఎన్విడియా కూడా 2023 మే లో1 ట్రిలియన్ క్లబ్‌లో చేరింది.

For Latest News and National News Click Here

Updated Date - Sep 09 , 2024 | 08:52 PM