Share News

Adani Group: హిండెన్‌బర్గ్ కొత్త ఆరోపణలపై అదానీ గ్రూప్ స్పందన.. ఏం చెప్పిందంటే..

ABN , Publish Date - Sep 13 , 2024 | 09:30 AM

అదానీకి వ్యతిరేకంగా జరిగిన మనీలాండరింగ్, సెక్యూరిటీల మోసం విచారణలో భాగంగా స్విస్ అధికారులు పలు స్విస్ బ్యాంకు ఖాతాల్లో $310 మిలియన్లకు పైగా స్తంభింపజేసినట్లు హిండెన్‌బర్గ్(Hindenburg) రీసెర్చ్ ఇటివల తెలిపింది. ఈ అంశంపై అదానీ గ్రూప్(adani group) స్పందించింది. గతంలో కూడా హిండెన్‌బర్గ్ అనేక ఆరోపణలు చేయడం విశేషం.

Adani Group: హిండెన్‌బర్గ్ కొత్త ఆరోపణలపై అదానీ గ్రూప్ స్పందన.. ఏం చెప్పిందంటే..
Adani Group

అమెరికన్ షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్(Hindenburg) రీసెర్చ్ మరోసారి అదానీ గ్రూప్‌(adani group)ను లక్ష్యంగా చేసుకుంది. మనీలాండరింగ్, మోసంపై దర్యాప్తులో భాగంగా అదానీ గ్రూప్‌కు చెందిన అనేక స్విస్ బ్యాంక్ ఖాతాలలో జమ చేసిన 310 మిలియన్ డాలర్లకు పైగా స్విస్ అధికారులు స్తంభింపజేసినట్లు హిండెన్‌బర్గ్ రీసెర్చ్ సోషల్ మీడియాలో ఇటివల ఓ పోస్ట్ చేసింది. 2021 నుంచి ఈ విచారణ కొనసాగుతోందని వెల్లడించింది. ఈ క్రమంలో మనీలాండరింగ్, మోసం ఆరోపణలపై దర్యాప్తులో భాగంగా అదానీ గ్రూప్ ఆరు స్విస్ బ్యాంక్ ఖాతాలలో జమ చేసిన రూ.31 కోట్లను స్విస్ అధికారులు స్వాధీనం చేసుకున్నారని తెలిపింది.


ఆ దర్యాప్తు విషయంలో

హిండెన్‌బర్గ్, స్విస్ మీడియా అవుట్‌లెట్ గోథమ్ సిటీని ప్రస్తావిస్తూ అదానీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక అసోసియేట్ బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్/మారిషస్, బెర్ముడాలో సందేహాస్పద నిధులలో ఎలా పెట్టుబడి పెట్టారో వివరించింది. ఈ ఫండ్స్‌లో ఎక్కువ భాగం అదానీ షేర్లలో పెట్టుబడి పెట్టారని తెలిపింది. ఈ ఆరు స్విస్ బ్యాంకుల్లో 31 కోట్ల డాలర్లకు పైగా ఉన్నాయని, అవి ఇప్పుడు స్తంభింపజేయబడ్డాయని వెల్లడించింది. స్విస్ క్రిమినల్ కోర్టు రికార్డుల ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చిందని చెప్పింది.


అదానీ గ్రూప్

ఈ క్రమంలోనే హిండెన్‌బర్గ్ ఆరోపణలను అదానీ గ్రూప్ కొట్టిపారేసింది. తమ మార్కెట్ విలువను తగ్గించేందుకే ఇదంతా చేస్తున్నారని తెలిపింది. స్విస్ కోర్టు వ్యవహారాలతో అదానీ గ్రూప్‌కు ఎలాంటి సంబంధం లేదని ఓ ప్రకటన విడుదల చేసింది. అలాగే మా కంపెనీకి సంబంధించిన ఏ ఖాతా కూడా జప్తు చేయబడలేదని వెల్లడించింది. మా విదేశీ హోల్డింగ్ నిర్మాణం పూర్తిగా పారదర్శకంగా, చట్టానికి అనుగుణంగా జరుగుతుందని చెప్పింది. ఇది మా పరువును, మార్కెట్ విలువను దెబ్బతీసేందుకు కృషి చేస్తున్న వారి ప్రయత్నమని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదని పేర్కొంది.


అనేక సార్లు ఆరోపణలు

హిండెన్‌బర్గ్ రీసెర్చ్ గత ఏడాది జనవరి 24, 2023న అదానీ గ్రూప్‌పై 106 పేజీల నివేదికను ప్రచురించింది. అందులో అదానీ గ్రూప్‌పై అప్పుల నుంచి షేరు ధరల్లో అవకతవకల వరకు అనేకం జరిగాయాని ఆరోపణలు చేసింది. ఆ క్రమంలో అదానీ గ్రూప్ షేర్లు భారీగా నష్టపోయి మార్కెట్ క్యాప్ పెద్ద ఎత్తున క్షీణించింది. హిండెన్‌బర్గ్ మొదటి నివేదిక ప్రభావం వల్ల గౌతమ్ అదానీ సంపదలో దాదాపు 60 బిలియన్ డాలర్ల మేర క్షీణించింది. ఆ తర్వాత అదానీ గ్రూప్ షేర్లు పునరాగమనం చేసాయి.

సెబీ ఛైర్‌పర్సన్

ఆ తర్వాత హిండెన్‌బర్గ్ గత నెలలో సెబీ ఛైర్‌పర్సన్ మాధబీ బుచ్ అదానీ పెట్టుబడులు, లావాదేవీలు గ్రూప్‌పై దర్యాప్తు చేయడం వెనుక ఉన్నారని ఆరోపించింది. బుచ్, అదానీ గ్రూప్ గత నెలలో ఆరోపణలను తిరస్కరించినప్పటికీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఇటీవలి రోజుల్లో బుచ్‌పై అనేక ఆరోపణలు చేసింది. ఈ క్రమంలోనే నిన్న హిడెన్ బర్గ్ మరోసారి ఆరోపణలు చేసింది.


ఇవి కూడా చదవండి

Personal Loans: లోన్ యాప్స్ నుంచి రుణం తీసుకుంటున్నారా.. ఈ 4 తప్పులు అస్సలు చేయోద్దు

హైదరాబాద్‌ టు బ్యాంకాక్‌ విమాన సర్వీసులు


Read MoreBusiness News and Latest Telugu News

Updated Date - Sep 13 , 2024 | 09:32 AM