Share News

Airtel: ఎయిర్‌టెల్ యూజర్లకు షాకింగ్ న్యూస్..ఇకపై మీ ప్లాన్ ధర..

ABN , Publish Date - Jun 28 , 2024 | 11:40 AM

నిన్న రిలయన్స్ జియో(jio) తర్వాత నేడు ఎయిర్‌టెల్(airtel) కూడా కస్టమర్లకు(customers) పెద్ద షాక్ ఇచ్చింది. రిలయన్స్ జియో బాటలోనే భారతీ ఎయిర్‌టెల్ కూడా తన టాప్ అప్ ప్లాన్‌ రేట్లను(top up plan rates) పెంచేసింది. ఈ క్రమంలో తన ప్లాన్‌ల ధరలు 10 నుంచి 21% పెరిగాయి. అయితే ఎయిర్‌టెల్ ఏ మేరకు ధరలను పెంచిందనే ప్లాన్ల విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

 Airtel: ఎయిర్‌టెల్ యూజర్లకు షాకింగ్ న్యూస్..ఇకపై మీ ప్లాన్ ధర..
Airtel top up tariff rates increase

నిన్న రిలయన్స్ జియో(jio) తర్వాత నేడు ఎయిర్‌టెల్(airtel) కూడా కస్టమర్లకు(customers) పెద్ద షాక్ ఇచ్చింది. రిలయన్స్ జియో బాటలోనే భారతీ ఎయిర్‌టెల్ కూడా తన టాప్ అప్ ప్లాన్‌ రేట్లను(top up plan rates) పెంచేసింది. ఈ క్రమంలో తన ప్లాన్‌ల ధరలు 10 నుంచి 21% పెరిగాయి. ఈ కొత్త ధరలు జూలై 3, 2024 నుంచి అమల్లోకి వస్తాయి. దీంతో వినియోగదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టెలికాం మార్కెట్లో పోటీ తక్కువగా ఉన్నందుకే ఇలా రేట్లు అనేక సార్లు పెంచుతున్నారని పలువురు వినియోగదారులు అంటున్నారు. అయితే ఎయిర్‌టెల్ ఏ మేరకు ధరలను పెంచిందనే ప్లాన్ల విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.


అపరిమిత ప్లాన్‌ల కొత్త ధరలు

  • ఎయిర్‌టెల్ రూ.179 ప్లాన్ ఇప్పుడు వినియోగదారులకు రూ.199కి పెరిగింది

  • అదే సమయంలో రూ.455 ప్లాన్ ధర రూ.509కి చేరింది

  • రూ. 1799 అపరిమిత ప్లాన్‌ రేటు కాస్తా జూలై 3 నుంచి రూ. 1999గా ఉంటుంది

రోజువారీ డేటా ప్లాన్‌ కొత్త రేట్లు

  • ఎయిర్‌టెల్ రోజువారీ డేటా ప్లాన్ ధర రూ.265 నుంచి రూ.299కి చేరింది

  • రూ. 299 రోజువారీ డేటా ప్లాన్ ఇప్పుడు 349 రూపాయలకు అందుబాటులో ఉంది

  • రూ.359 ప్లాన్ ధర రూ.409కు లభించనుంది

  • కొత్త ధర అమలులోకి వచ్చిన తర్వాత రూ.399 ప్లాన్ రూ.449కి అందుబాటులోకి రానుంది

  • రూ.479 ప్లాన్ ధర రూ.579కి పెంపు

  • రూ.549 ప్లాన్ రేటు కాస్తా రూ.649కి వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది

  • ఇది కాకుండా రూ.719 ప్లాన్ ధర రూ.859కి చేరుకుంది

  • రూ.839 ప్లాన్ ఇప్పుడు రూ.979కి అందుబాటులో ఉంటుంది

  • రూ.2999 ప్లాన్ కోసం ఇప్పుడు రూ.3599 ఖర్చు చేయాల్సి ఉంటుంది


డేటా యాడ్ ఆన్‌ల ప్లాన్ ధరలు

  • ఎయిర్‌టెల్ చౌకైన రూ. 19 ప్లాన్ ఇప్పుడు రూ. 22కి అందుబాటులో ఉంటుంది

  • అదే సమయంలో రూ.29 ప్లాన్ ధర రూ.33కి పెరిగింది

  • రూ.65 డేటా ప్లాన్ ఇప్పుడు రూ.77కు వినియోగదారులకు అందుబాటులోకి రానుంది

ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ రేట్లు

  • ఎయిర్‌టెల్ రూ.399 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ ఇప్పుడు రూ.349కి అందుబాటులో ఉంటుంది

  • ఇది కాకుండా రూ.499 ప్లాన్ ధర రూ.549కి పెరిగింది

  • రూ.599 ప్లాన్ వినియోగదారులు రూ.699 ఖర్చు చేయాల్సి ఉంటుంది

  • రూ.999 ప్లాన్ ధర రూ.1199కి చేరుకుంది


ఇది కూడా చదవండి:

Stock Markets: సెన్సెక్స్ 80,000కి చేరుకుంటుందా.. నిపుణులు ఏమన్నారంటే

Airport Roof Collapse: కుప్పకూలిన ఎయిర్‌పోర్ట్‌ పైకప్పు.. ఒకరు మృతి, 8 మందికి గాయాలు


Budget 2024: బడ్జెట్ 2024లో సెక్షన్ 80సీ పరిమితి పెంచుతారా.. ఆశలు నెరవేరుతాయా ?



For Latest News and Business News click here

Updated Date - Jun 28 , 2024 | 11:43 AM