Home » Jio 5g phone
దేశంలో రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా నెట్‌వర్క్‌లకు అనేక మంది యూజర్లు షాకిచ్చారు. జులై నుంచి పెంచిన రేట్లు అమలైన నేపథ్యంలో లక్షలాది మంది వినియోగదారులు ఈ నెట్‌వర్క్‌ల నుంచి బీఎస్ఎన్ఎల్కు మారారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ 47వ ఏజీఎం సమావేశంలో భాగంగా జియో(jio) కీలక ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో PhoneCall AI సేవ కాల్‌లను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ ఫీచర్ ద్వారా మీరు కాల్ చేయకుండానే సందేశాలను పంపవచ్చు. కాల్ సంభాషణను మెసేజ్ రూపంలో స్వీకరించవచ్చు. అయితే ఈ సేవను ఎలా ఉపయోగించాలో ఇక్కడ చుద్దాం.
ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లతో పోటీ పడలేక చితికిల పడిన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) మళ్లీ దూసుకువస్తోంది. 4జీ, 5జీ కనెక్టివిటీతో వినియోగదారులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. గత నెలలో జియో, ఎయిర్టెల్, వీఐ మొదలైన టెలికాం ఆపరేటర్లు విపరీతంగా ఛార్జీలను పెంచాయి.
దేశంలోని ప్రముఖ టెలికాం సర్వీస్ ప్రొవైడర్లలో ఒకటైన రిలయన్స్ జియో(Reliance Jio) ఇటీవల రీఛార్జ్ ప్లాన్ ధరలను పెంచింది. ధరలు పెంచినప్పటికీ జియో వార్షిక రీఛార్జ్ ప్లాన్‌ను యథావిధిగా అందిస్తూనే ఉంది.
నిన్న రిలయన్స్ జియో(jio) తర్వాత నేడు ఎయిర్టెల్(airtel) కూడా కస్టమర్లకు(customers) పెద్ద షాక్ ఇచ్చింది. రిలయన్స్ జియో బాటలోనే భారతీ ఎయిర్టెల్ కూడా తన టాప్ అప్ ప్లాన్ రేట్లను(top up plan rates) పెంచేసింది. ఈ క్రమంలో తన ప్లాన్ల ధరలు 10 నుంచి 21% పెరిగాయి. అయితే ఎయిర్టెల్ ఏ మేరకు ధరలను పెంచిందనే ప్లాన్ల విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
దేశంలో అత్యంత సంపన్న వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ సామాన్య ప్రజలకు చేరువయ్యేందుకు మరో ప్లాన్ వేశారు. త్వరలోనే రిలయన్స్ జియో పేమెంట్స్ సౌండ్‌బాక్స్ విభాగంలోకి కూడా ఎంట్రీ ఇస్తుంది. దీంతో ప్రధాన ప్రాంతాలతోపాటు పట్టణాలకు కూడా ఈ సేవలు అందించాలని ప్లాన్ చేస్తున్నారు.
Reliance Jio Bumper Offer: భారతదేశపు అతిపెద్ద టెలికాం కంపెనీ రిలయన్స్ జియో తన వినియోగదారుల కోసం అదిరిపోయే ఆఫర్ ప్రవేశపెట్టింది. జస్ట్ రూ. 148 లకే ఓటీటీ(OTT) ప్రయోజనాలతో కూడిన ప్లాన్ అందిస్తోంది. అలాగని ఒకటి రెండు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ కాదండోయ్.. 12 ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ సబ్స్క్రిప్షన్ ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో..
రిలయన్స్ జియో రిపబ్లిక్ డే సందర్భంగా ఓ ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్ రూ.2,999 రీఛార్జ్ ప్లాన్‌తో అందించబడుతోంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే, వినియోగదారులకు డిస్కౌంట్ కూపన్లు ఇవ్వబడతాయి.
వినాయకచవితి సందర్భంగా సెప్టెంబర్ 19 నుంచి రిలయన్స్ జియో టెలికాం కంపెనీ జియో ఎయిర్ ఫైబర్‌ను ప్రారంభించనుంది. ఈ విషయాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ కంపెనీ 2023 ఏజీఎమ్ సందర్భంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం మొబైల్ మార్కెట్లో 5G హవా సాగుతోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా మొబైల్ కంపెనీలు కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్నాయి. 5జీ నెట్వర్క్ ఇలా వచ్చిందో లేదో అప్పుడే 5జీ మొబైల్స్ మార్కెట్లోకి వచ్చేశాయి.