Electric Bike: ఎలక్ట్రిక్ బైక్ తీసుకుంటున్నారా..ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
ABN , Publish Date - May 17 , 2024 | 03:32 PM
దేశంలో ప్రస్తుతం పెట్రోలు, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అనేక మంది క్రమంగా ఎలక్ట్రిక్ వాహనాల(electric bikes) వైపు మొగ్గుచూపుతున్నారు. దీంతో ఇంధన వాహనాల అమ్మకాలపై ప్రభావం చూపుతుండగా..మరోవైపు ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. ఈ క్రమంలో మీరు ఎలక్ట్రిక్ స్కూటర్(electric bike) తీసుకోవాలని భావిస్తున్నట్లైతే ముందుగా మీరు కొన్ని విషయాలను తప్పకుండా తెలుసుకోవాలి. అవేంటో ఇప్పుడు చుద్దాం.
దేశంలో ప్రస్తుతం పెట్రోలు, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అనేక మంది క్రమంగా ఎలక్ట్రిక్ వాహనాల(electric bikes) వైపు మొగ్గుచూపుతున్నారు. దీంతో ఇంధన వాహనాల అమ్మకాలపై ప్రభావం చూపుతుండగా..మరోవైపు ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. అయితే ఎలక్ట్రిక్ వాహనాలపై ప్రభుత్వం రాయితీ ఇస్తుండగా అనేక కంపెనీలు కూడా వినియోగదారులను ఆకర్షించేందుకు మంచి ఆఫర్లు ఇస్తున్నాయి. ఈ క్రమంలో మీరు ఎలక్ట్రిక్ స్కూటర్(electric bike) తీసుకోవాలని భావిస్తున్నట్లైతే ముందుగా మీరు కొన్ని విషయాలను తప్పకుండా తెలుసుకోవాలి. అవేంటో ఇప్పుడు చుద్దాం.
బ్యాటరీ వారంటీ
ఎలక్ట్రిక్ స్కూటర్ కొనే విషయంలో ముందు బ్యాటరీ గురించి తెలుసుకోవాలి. పెట్రోల్, డీజిల్ వాహనాలకు ఇంజన్ వారంటీ ఉన్నట్లే, ఎలక్ట్రిక్ స్కూటర్లకు బ్యాటరీ వారంటీ ఉంటుంది. బ్యాటరీ వారంటీ ఎక్కువ ఉంటే వినియోగదారులకు ప్రయోజనం ఉంటుంది. దీంతోపాటు స్కూటర్ బ్యాటరీ ఎంత రేంజ్ వరకు ఇస్తుంది. బ్యాటరీ ఎన్ని వాట్స్ ఉందో తెలుసుకోవాలి. బ్యాటరీ కెపాసిటీ బాగుంటే రేంజ్ కూడా బాగుంటుంది.
భద్రతా లక్షణాలు
ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కొనుగోలు చేసే ముందు ఎలక్ట్రిక్ స్కూటర్‌లో ఎలాంటి సేఫ్టీ ఫీచర్లు అందిస్తున్నారో తెలుసుకోవాలి. ఎందుకంటే ఇటివల కాలంలో అనేక ఎలక్ట్రిక్ స్కూటర్లలో మంటలు చెలరేగిన సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఎలక్ట్రిక్ స్కూటర్లలో పలు రకాల బ్యాటరీలను అందిస్తుండగా, కొన్ని కంపెనీలు డిస్క్ బ్రేక్, ఆటో హోల్డ్, దొంగతనాన్ని నిరోధించడానికి అలారం సిస్టమ్ వంటి ఫీచర్లను కూడా తీసుకొచ్చాయి.
స్కూటర్ల శ్రేణి
అంతేకాదు స్కూటర్ బ్యాటరీ ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించగలదో తెలుసుకోవాలి. కంపెనీ చెప్పిన ప్రకారం రేంజ్ వస్తుందో ముందే కనుక్కోవాలి. మీరు దీనిపై శ్రద్ధ చూపకపోతే తరువాత సమస్యలను ఎదుర్కొవచ్చు. మీ అవసరానికి అనుగుణంగా స్కూటర్ పరిధి తక్కువగా ఉంటే, మీరు వేరే ఎంపికను చూడవచ్చు.
వేగం సమాచారం
మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేసే ముందు స్కూటర్ గరిష్ట వేగం గురించి కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇంధనంతో నడిచే ద్విచక్ర వాహనం కంటే ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్ట వేగం చాలా తక్కువగా ఉంటుంది. దీన్ని పరిగణలోకి తీసుకుని మీరు స్కూటర్ కొనుగోలు చేయాలా వద్దా స్పీడ్ ఎలా ఉందో అంచనా వేసుకుని నిర్ణయించుకోవాలి.
సర్వీస్ ఉందా?
దీంతోపాటు మీరు తీసుకున్న కంపెనీ స్కూటర్ పార్ట్స్ మీకు అందుబాటులో ఉంటాయా, సర్వీస్ సెంటర్, కస్టమర్ సపోర్ట్ ఉందా అనే విషయాలను కూడా ముందుగా చెక్ చేసుకోవాలి. లేదంటే స్కూటర్ తీసుకున్న తర్వాత ఏదైనా పార్ట్స్ కావాలంటే మీరు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది.
ఇది కూడా చదవండి:
Credit Card: క్రెడిట్ కార్డు వాడుతున్నారా..ఈ మోసాల పట్ల జాగ్రత్త
SEBI: మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిదారులకు శుభవార్త.. ఆ రూల్స్ సడలించిన సెబీ
Read Latest Business News and Telugu News