Share News

Personal Loan: పర్సనల్ లోన్స్ తీసుకుంటున్నారా.. ఈ ఛార్జీల విషయంలో జాగ్రత్త

ABN , Publish Date - Aug 29 , 2024 | 05:05 PM

ఇటివల కాలంలో వ్యక్తిగత రుణాలను బ్యాంకులు, NBFCలు చాలా సులభంగా ఇస్తున్నాయి. దీంతో అనేక మంది వీటిని తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కానీ ఈ రుణాలు తీసుకునేటప్పుడు కొన్ని ఛార్జీల గురించి(hidden charges) తప్పనిసరిగా తెలుసుకోవాలని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

 Personal Loan: పర్సనల్ లోన్స్ తీసుకుంటున్నారా.. ఈ ఛార్జీల విషయంలో జాగ్రత్త
personal loans charges

ప్రస్తుత రోజుల్లో అనేక మంది చిన్న చిన్న అవసరాలకు కూడా వ్యక్తిగత రుణాలు(personal loans) తీసుకుంటున్నారు. అయితే ఇటివల కాలంలో వ్యక్తిగత రుణాలను బ్యాంకులు, NBFCలు చాలా సులభంగా ఇస్తున్నాయి. దీంతో అనేక మంది వీటిని తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కానీ ఈ రుణాలు తీసుకునేటప్పుడు కొన్ని ఛార్జీల గురించి(hidden charges) తప్పనిసరిగా తెలుసుకోవాలని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. లేదంటే మీరు నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అంతేకాదు మీ లోన్ భారం కూడా పెరుగుతుందని అంటున్నారు. అయితే ఈ లోన్స్ తీసుకునే విషయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలనేది ఇక్కడ తెలుసుకుందాం.


వ్యక్తిగత రుణంపై ఛార్జీలు

ప్రాసెసింగ్ ఛార్జీ: పర్సనల్ లోన్ తీసుకునేటప్పుడు బ్యాంకులు ప్రాసెసింగ్ ఛార్జీ పేరుతో కొంత మొత్తాన్ని వసూలు చేస్తాయి. ప్రతి బ్యాంకు వారి కస్టమర్ల నుంచి వేర్వేరు ప్రాసెసింగ్ ఫీజులను వసూలు చేస్తుంది. సాధారణంగా ఈ ఛార్జీ రుణ మొత్తంలో 2.50%గా ఉంటుంది. దీని గురించి తప్పక తెలుసుకోవాలి.

వెరిఫికేషన్ ఛార్జ్: పర్సనల్ లోన్ తీసుకుంటున్నప్పుడు బ్యాంక్ మీకు వెరిఫికేషన్ ఛార్జీని కూడా వసూలు చేస్తుంది. వాస్తవానికి రుణం ఇవ్వడానికి ముందు, బ్యాంకు తన కస్టమర్‌ వివరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. ఆ తర్వాత మాత్రమే రుణ ఆమోదం లభిస్తుంది. ఈ ధృవీకరణ ప్రక్రియతో కస్టమర్ క్రెడిట్ చరిత్ర తనిఖీ చేస్తారు. ఈ విషయంలో కూడా ఛార్జీలు వేస్తారు.


జీఎస్టీ: ధృవీకరణ పూర్తయిన తర్వాత లోన్ ఆమోదం పొందినప్పుడు బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థలు GST రూపంలో ట్యాక్స్ వసూలు చేస్తాయి

ఈఎంఐ: లోన్ తీసుకున్న తర్వాత EMIని ప్రతి నెల కూడా సమయానికి చెల్లించాలి. కొంత మంది కస్టమర్లకు EMI చెల్లించాల్సిన తేదీ గుర్తుండదు. ఆ క్రమంలో తర్వాత చెల్లిస్తామని అనుకుంటే మీరు ఆలస్య రుసుముగా ఈఎంఐ బౌన్స్ ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుంది.


దరఖాస్తు రుసుము: పర్సనల్ లోన్‌లో దాచిన ఛార్జీలలో దరఖాస్తు రుసుము కూడా ఒకటి. చాలా సార్లు రుణం ఆమోదించబడిన తర్వాత బ్యాంకులు, NBFC కంపెనీలు దరఖాస్తు ఈ రుసుములను వసూలు చేస్తాయి.

డూప్లికేట్ స్టేట్‌మెంట్ ఛార్జ్: లోన్ తీసుకున్న తర్వాత, లోన్ రీయింబర్స్ చేయడానికి ప్రతి నెల స్టేట్‌మెంట్ జనరేట్ చేయబడుతుంది. ఈ స్టేట్‌మెంట్ పోయినట్లయితే మళ్లీ బ్యాంకుకు వెళ్లి స్టేట్‌మెంట్ జారీ చేయాల్సిన అవసరం ఉంది. డూప్లికేట్ స్టేట్‌మెంట్‌ల కోసం బ్యాంక్ కస్టమర్ నుంచి డూప్లికేట్ స్టేట్‌మెంట్ ఛార్జీలను వసూలు చేస్తుంది.


ముందస్తు చెల్లింపు ఛార్జ్: బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీ కంపెనీలు వ్యక్తిగత రుణాన్ని ముందస్తుగా చెల్లించడానికి ముందస్తు చెల్లింపు ఛార్జీలను వసూలు చేస్తాయి. ఇది రుణ మొత్తంలో కొంత శాతంగా ఉంటుంది. మీరు ముందస్తు చెల్లింపు వంటి దాచిన ఛార్జీలను నివారించాలనుకుంటే ముందే తెలుసుకోవాలి. అంతేకాదు లోన్ తీసుకునే విషయంలో మీకు చెప్పిన వడ్డీ రేట్ల ప్రకారమే లోన్ ఇచ్చారా లేదా అనే వివరాలు కూడా తెలుసుకోవాలి.


ఇవి కూడా చదవండి:

Mukesh Ambani: రిలయన్స్ ఏజీఎం సమావేశంలో ముఖేష్ అంబానీ కీలక ప్రకటనలు

Business Idea: రూ. 15 వేల పెట్టుబడితో వ్యాపారం .. నెలకు రూ.50 వేలకుపైగా ఆదాయం


Bank Holidays: సెప్టెంబర్ 2024లో బ్యాంకు సెలవులు ఎన్నంటే.. గణేష్ చతుర్థి సహా..

Lowest Interest Car Loans: తక్కువ రేటుకే లక్షల రూపాయల కార్ లోన్స్.. ఈ వివరాలు తెలుసా మీకు..


Read More Business News and Latest Telugu News

Updated Date - Aug 29 , 2024 | 05:06 PM