BYD Seal: టెస్లాను టెన్షన్ పెడుతున్న BYD.. కళ్లు చెదిరే ఫీచర్స్, ఒక్కసారి ఛార్జ్ చేస్తే 570 కి.మీ రేంజ్..
ABN , Publish Date - Feb 26 , 2024 | 08:28 AM
BYD Seal Launch in India: అంతర్జాతీయ ఎలక్ట్రిక్ కార్ మార్కెట్లో టెస్లా, BYD మధ్య గట్టి పోటీ నడుస్తోంది. ఓ వైపు టెస్లా(Tesla) భారత మార్కెట్లోకి(Indian Auto Market) ప్రవేశించడానికి సిద్ధమవుతోండగా.. నేను సైతం అంటోంది BYD. ఇప్పటికే అన్ని ఒప్పందాలు పూర్తయిన నేపథ్యంలో BYD రతదేశంలో మార్చి 5 న తన BYD Seal కారును లాంచ్ చేయనుంది.
BYD Seal Launch in India: అంతర్జాతీయ ఎలక్ట్రిక్ కార్ మార్కెట్లో టెస్లా, BYD మధ్య గట్టి పోటీ నడుస్తోంది. ఓ వైపు టెస్లా(Tesla) భారత మార్కెట్లోకి(Indian Auto Market) ప్రవేశించడానికి సిద్ధమవుతోండగా.. నేను సైతం అంటోంది BYD. ఇప్పటికే అన్ని ఒప్పందాలు పూర్తయిన నేపథ్యంలో BYD రతదేశంలో మార్చి 5 న తన BYD Seal కారును లాంచ్ చేయనుంది. BYD సీల్ గ్లోబల్ మార్కెట్లో బాగా ప్రాచుర్యం పొందిన ఎలక్ట్రిక్ సెడాన్. ఇది టెస్లా మోడల్ 3తో పోటీపడుతుంది. అయితే, ఎలన్ మస్క్ కంపెనీకి చెందిన కార్ల కంటే ముందే ఈ కారు ఇండియన్ రోడ్లపై రయ్‌మంటూ దూసుకెళ్లనుంది.
BYD సీల్ భారతదేశంలో విక్రయించబడుతున్న మూడవ కారు. కంపెనీ ఇప్పటికే రెండు ఎలక్ట్రిక్ కార్లు Auto 3 SUV, e6 MPVలను విక్రయిస్తోంది. సీల్ పూర్తిగా భారత మార్కెట్లో దిగుమతి అవుతుంది. ఈ ఎలక్ట్రిక్ కారు ఆటో ఎక్స్పో 2023లో భారతదేశంలో మొదటిసారిగా పరిచయం చేశారు. దీని స్పెసిఫికేషన్లు, ఫీచర్లు కళ్లు చెదిరేలా ఉన్నాయి.
బ్యాటరీ, రేంజ్..
BYD సీట్ కారుకు సంబంధించి కొన్ని వివరాలను కంపెనీ వెల్లడించింది. మీడియా నివేదికల ప్రకారం.. ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు 82.5 kWh బ్యాటరీ ప్యాక్ శక్తిని పొందుతుంది. ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే ఈ కారు 570 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఈ కారు కేవలం 5.9 సెకన్లలో 0 నుండి 100 km/h వేగాన్ని అందుకోగలదని కంపెనీ పేర్కొంది.
ఛార్జింగ్, పనితీరు..
BYD సీల్ ఎలక్ట్రిక్ సెడాన్ బరువు 2,055 కిలోలు. ఈ కారు బ్యాటరీలో కంపెనీకి చెందిన బ్లేడ్ టెక్నాలజీని ఉపయోగించారు. 150kW వరకు ఛార్జింగ్ స్పీడ్‌తో సీల్‌ను ఛార్జ్ చేయవచ్చు. ఈ కారు కేవలం 37 నిమిషాల్లో 10 నుండి 80 శాతం వరకు ఛార్జ్ చేయబడుతుంది. సాధారణ 11kW AC ఛార్జర్‌తో సీల్‌ను పూర్తిగా ఛార్జ్ చేయడానికి 8.6 గంటలు పడుతుంది.
ఫీచర్లు..
డ్యూయల్ మోటార్ AWD వేరియంట్‌ను కూడా ప్రారంభించవచ్చు. ఈ మోడల్ ఫుల్ ఛార్జింగ్ పై 520 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. సీల్ లోపలి భాగం ఓషన్ X కాన్సెప్ట్ సంగ్రహావలోకనం చూపిస్తుంది. ఇది కూపే లాంటి గ్లాస్ రూఫ్, ఫ్లష్-ఫిట్టింగ్ డోర్లు, నాలుగు బూమరాంగ్ షేప్ LED DRLలు, స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ డిజైన్, ఫుల్ వైడ్ LED లైట్ బార్ని కలిగి ఉంది.
BYD సీల్ 15.6 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్, 10.25 అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ని కలిగి ఉంది. ఈ ఎలక్ట్రిక్ కారు ధర భారతదేశంలో దాదాపు రూ. 50 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. కాగా, BYD డీలర్‌షిప్‌లలో బుకింగ్స్ ఇప్పటికే కొనసాగుతున్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..