Share News

Digital Gold: డిజిటల్ గోల్డ్ కొనుగోలు చేయవచ్చా.. లాభామా, నష్టమా?

ABN , Publish Date - May 06 , 2024 | 12:45 PM

మరికొన్ని రోజుల్లోనే అక్షయ తృతీయ (మే 10న) వస్తుంది. ఈ సందర్భంగా అనేక మంది గోల్డ్(gold) కొనుగోలు చేస్తే మంచిదని భావిస్తారు. కానీ భౌతిక బంగారాన్ని కొనుగోలు(purchase) చేయడంలో కొన్ని ప్రతికూలతలు ఉంటాయి. ఈ క్రమంలో డిజిటల్ బంగారాన్ని(digital gold) ఆన్‌లైన్‌లో కొనుగోలు(purchase) చేయడం ద్వారా లాభామా, నష్టామా అనే విషయాలను తెలుసుకుందాం.

 Digital Gold: డిజిటల్ గోల్డ్ కొనుగోలు చేయవచ్చా.. లాభామా, నష్టమా?
Can digital gold be bought online profit or loss

మరికొన్ని రోజుల్లోనే అక్షయ తృతీయ (మే 10న) వస్తుంది. ఈ సందర్భంగా అనేక మంది గోల్డ్(gold) కొనుగోలు చేస్తే మంచిదని భావిస్తారు. కానీ భౌతిక బంగారాన్ని కొనుగోలు(purchase) చేయడంలో కొన్ని ప్రతికూలతలు ఉంటాయి. దాని స్వచ్ఛతను అర్థం చేసుకోవడంతో పాటు, దానిని సురక్షితంగా ఉంచడం, నిల్వ చేయడం కూడా ఒక సమస్య అని చెప్పవచ్చు. కానీ డిజిటల్ బంగారాన్ని(digital gold) ఆన్‌లైన్‌లో కొనుగోలు(purchase) చేయడం ద్వారా ఇలాంటి ఇబ్బందుల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఈ నేపథ్యంలో డిజిటల్ బంగారం అంటే ఏమిటి, ఇందులో పెట్టుబడి(investments) పెట్టడం ఎంతవరకు సరైనదనే విషయాన్ని తెలుసుకుందాం.


డిజిటల్ బంగారాన్ని ఎవరు కొనుగోలు చేయవచ్చు

భారతదేశంలో నివసించే ఎవరైనా డిజిటల్ బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు. యాక్సిస్ బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం డిజిటల్ బంగారాన్ని కొనుగోలు చేయడానికి ఒక వ్యక్తి తప్పనిసరిగా సేవింగ్స్ ఖాతా లేదా కరెంట్ ఖాతాను కలిగి ఉండాలి

భారతదేశంలో డిజిటల్ బంగారాన్ని ఎవరు కొనుగోలు చేయలేరు?

భారతదేశంలో డిజిటల్ గోల్డ్ ఒక మైనర్ ఖాతాదారు, NRO ఖాతా లేని NRI కస్టమర్


డిజిటల్ బంగారంలో ఎందుకు పెట్టుబడి పెట్టాలి?

  • ఇందులో మీరు కేవలం రూ. 1 చిన్న మొత్తంతో కూడా పెట్టుబడిని ప్రారంభించవచ్చు. కస్టమర్ తనకు అవసరమైనప్పుడు డిజిటల్ బంగారాన్ని విక్రయించుకోవచ్చు

  • మీరు ఈటీఎఫ్‌లు, గోల్డ్ సేవింగ్స్ ఫండ్స్ వంటి ఎలక్ట్రానిక్ రూపంలో బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు

  • డిజిటల్ గోల్డ్‌ను ఫిజికల్ గోల్డ్‌గా మార్చుకునే ఆప్షన్ కూడా ఉంది. దీన్ని బంగారు నాణేలు, బార్లు లేదా మీకు నచ్చిన ఏదైనా రూపంలోకి మార్చుకోవచ్చు

  • డిజిటల్ బంగారం నిజమైనది. సేఫ్‌గోల్డ్‌కు దాని స్వచ్ఛత 99.5 శాతం, MMTC PAMP విషయంలో 999.9 శాతంగా ఉంటుంది


  • కొన్ని సందర్భాల్లో కంపెనీలు పరిమిత నిల్వ వ్యవధిని మాత్రమే అందిస్తాయి, ఆ తర్వాత మీరు భౌతిక బంగారాన్ని డెలివరీ చేయవచ్చు లేదా బంగారాన్ని విక్రయించవచ్చు

  • డిజిటల్ బంగారాన్ని విక్రేత బీమా చేసిన, సురక్షితమైన వాల్ట్‌లలో నిల్వ చేస్తాడు. దీని కోసం వినియోగదారుడు ఎలాంటి ఛార్జీ చెల్లించాల్సిన అవసరం లేదు

  • మీరు డిజిటల్ బంగారాన్ని కలిగి ఉంటే, మీరు దానిని ఆస్తిగా ఆన్‌లైన్ లోన్ కోసం తాకట్టుగా ఉపయోగించవచ్చు

  • డిజిటల్ బంగారంలో పెట్టుబడి పెట్టడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటంటే, మీరు బంగారం ధరలపై తక్షణ మార్పు ధరలను పొందుతారు. కస్టమర్ రియల్ టైమ్ మార్కెట్ అప్‌డేట్‌ల ఆధారంగా బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు లేదా విక్రయించుకోవచ్చు.


ఇది కూడా చదవండి:

IRCTC: కాశ్మీర్ టూర్ ప్యాకేజీ.. అందాలు మిస్ అవ్వకండి

IRCTC: 8 రోజులు, 7 రాత్రుల స్పెషల్ టూర్ ప్యాకేజీ.. శ్రీకృష్ణుడి ద్వారకా నగరం సహా ఇవి కూడా


Read Latest Business News and Telugu News

Updated Date - May 06 , 2024 | 01:31 PM