Share News

IPL 2024: నేడు SRH vs MI మ్యాచ్ విన్ ప్రిడిక్షన్.. ప్రతీకారం తీర్చుకుంటారా?

ABN , Publish Date - May 06 , 2024 | 07:15 AM

ఈరోజు ఐపీఎల్ 2024(IPL 2024)లో 55వ మ్యాచ్ ముంబై ఇండియన్స్(Mumbai Indians), సన్‌రైజర్స్ హైదరాబాద్‌(Sunrisers Hyderabad) జట్ల మధ్య జరగనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ మొదలు కానుంది. అయితే ముంబై ఇండియన్స్ దాదాపు ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించింది. కానీ నేటి మ్యాచులో హార్దిక్ పాండ్యా సారథ్యంలోని ముంబై ఇండియన్స్ SRHపై ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది.

IPL 2024: నేడు SRH vs MI మ్యాచ్ విన్ ప్రిడిక్షన్.. ప్రతీకారం తీర్చుకుంటారా?
IPL 2024 SRH vs MI 55th Match Win Prediction

ఈరోజు ఐపీఎల్ 2024(IPL 2024)లో 55వ మ్యాచ్ ముంబై ఇండియన్స్(Mumbai Indians), సన్‌రైజర్స్ హైదరాబాద్‌(Sunrisers Hyderabad) జట్ల మధ్య జరగనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ మొదలు కానుంది. అయితే ముంబై ఇండియన్స్ దాదాపు ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించింది. కానీ నేటి మ్యాచులో హార్దిక్ పాండ్యా సారథ్యంలోని ముంబై ఇండియన్స్ SRHపై ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది. ఎందుకంటే గతంలో SRH, MI బౌలర్లను దెబ్బతీసి భారీ స్కోర్ చేసింది. దీంతో ఈసారి ముంబై ఎదురు దాడి చేయాలని చూస్తోంది.


అంతేకాదు ఈ మ్యాచ్ హైదరాబాద్ జట్టుకు కీలకమని చెప్పవచ్చు. ఎందుకంటే ముంబై ఇండియన్స్‌(MI)తో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) ఓడిపోతే ప్లేఆఫ్‌కు చేరుకోవడం కష్టమవుతుంది. దీని తర్వాత మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో రెండింట్లో విజయం సాధించాల్సి ఉంటుంది. ఇక MI 11 మ్యాచ్‌లలో ఎనిమిది ఓడిపోయి 10వ స్థానంలో ఉండగా, SRH 10 మ్యాచ్‌ల్లో ఆరు విజయాలతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది.


వాంఖడే పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలిస్తే హైదరాబాద్ బ్యాట్స్ మెన్లు మరోసారి భారీ స్కోరు సాధించాలని భావిస్తున్నారు. ఇక్కడ పిచ్ సాధారణంగా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. చిన్న సరిహద్దుల కారణంగా 200 కంటే ఎక్కువ స్కోర్లు సాధ్యమవుతాయి. కానీ గత శుక్రవారం ముంబై, కోల్‌కతా మధ్య జరిగిన మ్యాచ్‌లో పిచ్ స్లోగా ఉంది. దీంతో బ్యాట్స్‌మెన్లు పరుగుల కోసం కష్టపడాల్సి వచ్చింది. ఇక ఈ మ్యాచులో గూగుల్ గెలుపు అంచనాలను చూస్తే ముంబై ఇండియన్స్‌(MI) జట్టు 52 శాతం గెలిచే అవకాశం ఉండగా, సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) జట్టుకు 48 శాతం ఛాన్స్ ఉంది.


ముంబై ఇండియన్స్ (MI) ప్రాబబుల్ 11 జట్టులో రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ (WK), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (c), నెహాల్ వధేరా, టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, గెరాల్డ్ కోయెట్జీ, శ్రేయాస్ గోపాల్, జస్ప్రీత్ బుమ్రా ఉన్నారు.

సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ప్రాబబుల్ 11 జట్టులో అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఐడెన్ మార్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్ (WK), నితీష్ రెడ్డి, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్ (c), భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, T నటరాజన్ కలరు.


ఇది కూడా చదవండి:

దంచేసి.. కూల్చేసి

జడేజా ఆల్‌రౌండ్‌ షో


Read Latest Sports News and Telugu News

Updated Date - May 06 , 2024 | 07:30 AM