Share News

Credit Card: క్రెడిట్ కార్డ్ బిల్ చూసి భయపడుతున్నారా.. ఈ 5 మార్గాల ద్వారా ఈజీగా చెల్లించండి

ABN , Publish Date - Apr 15 , 2024 | 12:26 PM

ప్రస్తుత కాలంలో అనేక మంది ఉద్యోగులు(Employees) క్రెడిట్ కార్డుల(Credit Card)ను విచ్చల విడిగా వినియోగిస్తున్నారు. షాపింగ్ వెళ్లినా, ఆన్‌లైన్ కొనుగోళ్లు చేసినా, పెట్రోల్ కోసం ఇలా అనేక చోట్ల ప్రతి నెల క్రెడిట్ కార్డులను ఉపయోగిస్తున్నారు. అయితే పరిమితికి మించి వినియోగించిన బిల్లులను సులువుగా ఎలా చెల్లించాలనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

Credit Card: క్రెడిట్ కార్డ్ బిల్ చూసి భయపడుతున్నారా.. ఈ 5 మార్గాల ద్వారా ఈజీగా చెల్లించండి
Credit Card usage tips

ప్రస్తుత కాలంలో అనేక మంది ఉద్యోగులు(Employees) క్రెడిట్ కార్డుల(Credit Card)ను విచ్చల విడిగా వినియోగిస్తున్నారు. షాపింగ్ వెళ్లినా, ఆన్‌లైన్ కొనుగోళ్లు చేసినా, పెట్రోల్ కోసం ఇలా అనేక చోట్ల ప్రతి నెల క్రెడిట్ కార్డులను ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలో నెల తర్వాత వచ్చిన బిల్లును(bills) చూసి కార్డు వినియోగదారులు షాక్ అవుతున్నారు. అయితే పరిమితికి మించి వినియోగించిన బిల్లులను సులువుగా ఎలా చెల్లించాలనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

1. EMIలుగా మార్పు

చాలా మంది క్రెడిట్ కార్డు యూజర్లు నెలాఖరున వచ్చిన భారీ బిల్లును చూసి భయాందోళన చెందుతారు. అంత పెద్ద అమౌంట్ ఎలా కట్టాలని ఆలోచిస్తారు. కానీ ఆ బకాయి మొత్తాన్ని ఒకేసారి కట్టకుండా EMIలుగా మార్చుకుంటే సులువుగా చెల్లించుకోవచ్చు. చాలా బ్యాంకులు ఈ సదుపాయాన్ని ఫ్రీగా అందిస్తున్నాయి. కానీ దీనిపై కొంత ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది.


2. కనీసం కంటే ఎక్కువ

మీరు క్రెడిట్ కార్డ్ బకాయి మొత్తాన్ని చెల్లించేందుకు మీ దగ్గర అంత మొత్తం లేకపోతే గడువులోగా బిల్లులో పేర్కొన్న కనీస మొత్తం కంటే కొంచెం ఎక్కువ చెల్లించండి. అలా చేయడం ద్వారా మీరు ఆ నెల డ్యూ నుంచి మీకు వెసులుబాటు లభిస్తుంది. కానీ మిగతా మొత్తాన్ని వీలైనంత త్వరగా పే చేస్తే రోజువారీ వడ్డీ నుంచి ఉపశమనం లభిస్తుంది.

3. లోన్ చెల్లింపు

వడ్డీతో కూడిన చిన్న చిన్న అప్పులను చెల్లించడానికి వ్యక్తిగత రుణాలు మంచి ప్రత్యామ్నాయమని చెప్పవచ్చు. మీరు చిన్న చిన్న బకాయిలతో అనేక క్రెడిట్ కార్డ్‌లను కలిగి ఉంటే, మీరు ఒక వ్యక్తిగత లోన్(loan) తీసుకుని వాటిని పరిష్కరించుకోవచ్చు. పర్సనల్ లోన్ వడ్డీ రేట్లు క్రెడిట్ కార్డ్‌ల వడ్డీ కంటే తక్కువగా ఉంటాయి కాబట్టి ఈజీ అని చెప్పవచ్చు. అయితే లోన్ అనేది మీ క్రెడిట్ స్కోర్‌పై ఆధారపడి బ్యాంకులు అందిస్తాయి.


4. బిల్లింగ్ గ్రేస్ పీరియడ్‌

క్రెడిట్ కార్డ్ వినియోగదారులు క్రెడిట్ కార్డ్ బిల్లింగ్ సైకిల్ గురించి తప్పకుండా తెలుసుకోవాలి. బ్యాంకులు క్రెడిట్ ఫ్రీ వ్యవధిని అందిస్తాయి. ఇది స్టేట్‌మెంట్ సైకిల్ 30 రోజులు, బిల్లు బకాయిలను చెల్లించడానికి 15 రోజుల గ్రేస్ పీరియడ్‌ను కలిగి ఉంటుంది. కాబట్టి మీరు ఈ వ్యవధిని పరిగణనలోకి తీసుకుని నెలవారీగా కొనుగోళ్లు చేసి, గడువులోగా చెల్లింపులు చేస్తే మీరు వడ్డీ భారం నుంచి తప్పించుకోవచ్చు.


5. ఆటోమేటిక్ చెల్లింపులు

ప్రస్తుత బిజీ లైఫ్‌లో చాలా మంది క్రెడిట్ కార్డ్ చెల్లింపు తేదీలను గుర్తుంచుకోవడం లేదు. దీంతో గడువు తేదీ పూర్తైన తర్వాత అధిక వడ్డీ రేట్లు, ఆలస్య చెల్లింపుతో రుసుములు పే చేయాల్సి వస్తుంది. అయితే వీటిని తప్పించుకునేందుకు మీరు మీ బ్యాంక్‌తో ఆటోమేటిక్ క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపు సౌకర్యాన్ని ఎంచుకోవచ్చు. ఇలా చేయడం ద్వారా మీ బిల్లు ఆటోమేటిక్‌గా చెల్లించబడుతుంది. దీంతో గడువు తేదీల గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు.


ఇది కూడా చదవండి:

Tesla Deal: టెస్లా కార్లలో టాటా సెమీకండక్టర్ చిప్స్.. ఒప్పందం కుదిరినట్లు..

SIP: ప్రతి రోజు రూ.110 ఇన్‌వెస్ట్ చేయండి.. కోటీశ్వరులుగా మారండి


మరిన్ని బిజినెస్ వార్తల కోసం

Updated Date - Apr 15 , 2024 | 12:32 PM