Share News

Stock Market: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. నిమిషాల్లోనే రూ.8 లక్షల కోట్లు ఖతం

ABN , Publish Date - Apr 15 , 2024 | 09:37 AM

దేశీయ స్టాక్ మార్కెట్‌(stock market) సూచీలు సోమవారం భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. మార్కెట్‌లోని ప్రధాన సూచీలు మొత్తం దిగువకు పయనిస్తున్నాయి. మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తత సహా పలు అంశాలు స్టాక్ మార్కెట్‌పై ప్రభావం చూపినట్లుగా తెలుస్తోంది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణం నేపథ్యంలో గ్లోబల్ సెంటిమెంట్ బలహీనపడింది.

Stock Market: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. నిమిషాల్లోనే రూ.8 లక్షల కోట్లు ఖతం
stock market updates

దేశీయ స్టాక్ మార్కెట్‌(stock market) సూచీలు సోమవారం భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. మార్కెట్‌లోని ప్రధాన సూచీలు మొత్తం దిగువకు పయనిస్తున్నాయి. మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తత సహా పలు అంశాలు స్టాక్ మార్కెట్‌పై ప్రభావం చూపినట్లుగా తెలుస్తోంది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణం నేపథ్యంలో గ్లోబల్ సెంటిమెంట్ బలహీనపడింది. దీంతో ఉదయం 9.19 గంటలకు బీఎస్‌ఈ సెన్సెక్స్(sensex) 636 పాయింట్లు లేదా 0.86% క్షీణించి 73,608 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ(nifty) 190 పాయింట్లు లేదా 0.84% క్షీణించి 22,330 వద్ద ట్రేడవుతోంది. మరోవైపు బ్యాంక్ నిఫ్టీ, నిప్టీ మిడ్ క్యాప్ సూచీలు కూడా వరుసగా 537, 911 పాయింట్లు కోల్పోయాయి.


ఈ నేపథ్యంలో ప్రస్తుతం టాటా మోటార్స్, BPCL, టాటా స్టీల్, అదానీ ఎంటర్‌ప్రైస్, కోల్ ఇండియా కంపెనీల స్టాక్స్ టాప్ 5 నష్టాల్లో ఉండగా, హిందాల్కో, ONGC, TCS, నెస్లే, ఇన్ఫోసిస్ సంస్థల స్టాక్స్ టాప్ 5 లాభాల్లో ఉన్నాయి. దీంతో బీఎస్‌ఈలో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఏప్రిల్ 12న క్రితం సెషన్‌లో నమోదైన రూ. 399.67 లక్షల కోట్ల విలువతో పోలిస్తే ఇన్వెస్టర్లు ఈరోజు రూ. 8.21 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. ఈ క్రమంలో మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ రూ. 391.46 లక్షల కోట్లకు చేరుకుంది.


ప్రధానంగా ఆటో, మెటల్, ఫార్మా సహా ఇతర రంగాల్లో విక్రయాలు పెద్ద ఎత్తున నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FII) సుమారు రూ.8,027 కోట్ల విలువైన పెట్టుబడులను విక్రయించగా, దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు (DII) సుమారు రూ.6,341 కోట్ల విలువైనవి కొనుగోలు చేశారు. అంతకుముందు శుక్రవారం (ఏప్రిల్ 12, 2024న) నిఫ్టీ 50 ఇండెక్స్ 1.03% క్షీణించి 22,519 వద్ద ముగియగా, సెన్సెక్స్ 1.06% క్షీణించి 74,244 వద్ద ముగిసింది.


ఇది కూడా చదవండి:

SIP: ప్రతి రోజు రూ.110 ఇన్‌వెస్ట్ చేయండి.. కోటీశ్వరులుగా మారండి

Special Trains: రూ.200తో రామాలయం టూర్.. సికింద్రాబాద్ నుంచి స్పెషల్ ట్రైన్స్


మరిన్ని బిజినెస్ వార్తల కోసం

Updated Date - Apr 15 , 2024 | 12:06 PM