Share News

EPFO: గుడ్ న్యూస్ చెప్పిన ఈపీఎఫ్‌ఓ.. ఇక దానికి ఆధార్ అక్కర్లే

ABN , Publish Date - May 22 , 2024 | 04:32 PM

పీఎఫ్ ఖాతాదారుడు ప్రమాదవశాత్తు మరణిస్తే ఆధార్ కార్డు సమస్యగా పరిణమిస్తోంది. ఆధార్‌లో అన్ని వివరాలు సరిగ్గా ఉంటే ప్రాబ్లమ్ ఏమీ ఉండదు. కానీ ఆధార్ వివరాలు తప్పుగా ఉండి.. అప్‌డేట్ చేయాలంటే ఫీల్డ్ ఆఫీస్‌లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.

EPFO: గుడ్ న్యూస్ చెప్పిన ఈపీఎఫ్‌ఓ.. ఇక దానికి ఆధార్ అక్కర్లే

ఢిల్లీ: పీఎఫ్ ఖాతాదారుడు ప్రమాదవశాత్తు మరణిస్తే ఆధార్ కార్డు సమస్యగా పరిణమిస్తోంది. ఆధార్‌లో అన్ని వివరాలు సరిగ్గా ఉంటే ప్రాబ్లమ్ ఏమీ ఉండదు. కానీ ఆధార్ వివరాలు తప్పుగా ఉండి.. అప్‌డేట్ చేయాలంటే ఫీల్డ్ ఆఫీస్‌లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. సభ్యుడి మరణం తర్వాత EPF ప్రయోజనాలను క్లెయిమ్ చేసే ప్రక్రియను క్రమబద్ధీకరించడానికి ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) కొత్త నిబంధన తీసుకొచ్చింది.

మరణానంతరం ఆధార్ వివరాలను అప్‌డేట్ చేయడం లేదా సరిదిద్దడంలో ఫీల్డ్ ఆఫీస్‌లు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించడం ఈ నిబంధన ముఖ్య లక్ష్యం. దీంతో ఆధార్ లేకుండానే క్లెయిమ్‌లను ప్రాసెస్ చేయవచ్చని, మరణించిన సభ్యుల కుటుంబాలు EPF ప్రయోజనాలను సులభంగా పొందవచ్చని ఈపీఎఫ్ఓ​​ప్రకటించింది. ఈ సడలింపు ఇ-ఆఫీస్‌లో ఆఫీస్ ఇన్ ఛార్జ్(OIC) ఆమోదం పొందడంపై ఆధారపడి ఉంటుంది. ఇది తప్పనిసరిగా ధృవీకరణ విధానాలను డాక్యుమెంట్ చేయాలి.

ధృవీకరణ..

OIC ఆమోదం కోసం మరణించిన సభ్యుడి వివరాలు, హక్కుదారుల చట్టబద్ధత గురించిన కచ్చితమైన ధృవీకరణ అవసరం. మోసపూరిత ఉపసంహరణలను తగ్గించడానికి OIC నిర్దేశించిన విధంగా అదనపు జాగ్రత్త చర్యలు అవసరం.


మార్గదర్శకాలు

యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN)లో సభ్యుల వివరాలు కచ్చితమైనవైతే యూనిక్ ఐడెంటిఫికేషన్(UID) డేటాబేస్‌లో సరికాని లేదా అసంపూర్ణ సమాచారం ఉన్న సందర్భాల్లో సడలింపు వర్తిస్తుంది. ఆధార్ డేటా సరైనదైతే యూఏఎన్‌లో వ్యత్యాసాలు ఉన్న సందర్భాల్లో, ఫీల్డ్ ఆఫీసులు మునుపటి సర్క్యులర్‌లలో పేర్కొన్న నిర్దిష్ట మార్గదర్శకాలను తప్పనిసరిగా అనుసరించాలి.

ఫీల్డ్ ఆఫీసుల సమస్యలు..

  • ఆధార్ రికార్డులలో తప్పుడు వివరాలు లేదా అసంపూర్ణమైన సభ్యుల వివరాలు.

  • ఆధార్ సమాచారం లేకపోవడం.

  • డీయాక్టివేట్ అయిన ఆధార్ ఖాతాలు.

  • UIDAI డేటాబేస్ ద్వారా ఆధార్‌ని ధృవీకరించడంలో సాంకేతిక సమస్యలు.


ఆధార్ లేకుండా క్లెయిమ్‌ల ప్రాసెస్ ఇలా..

  • ఇ-ఆఫీస్ ఫైల్ ద్వారా OIC నుండి ఆమోదం పొందండి.

  • మరణించిన సభ్యుని సభ్యత్వం, హక్కుదారు ప్రామాణికతను నిర్ధారించడానికి ధృవీకరణ పత్రాలను తనిఖీ చేయండి.

  • OIC నిర్దేశించిన విధంగా మోసపూరిత ఉపసంహరణలను నిరోధించడానికి తగిన చర్యలు తీసుకోవాలి.

ఈపీఎఫ్ఓ.. మే 17న విడుదల చేసిన సర్క్యులర్‌లో విధానపరమైన అడ్డంకులను పరిష్కరించడం, మరణించిన సభ్యుల కుటుంబాలకు సకాలంలో ఆర్థిక సహాయం అందించడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది.

Buddha Purnima: ఈ రాష్ట్రాల్లో రేపు బ్యాంకులు బంద్.. ఎందుకంటే

Read Latest National News and Telugu News

Updated Date - May 22 , 2024 | 04:36 PM