Five Financial Rules: మార్చిలో మారే ఐదు రూల్స్ ఇవే..!!
ABN , Publish Date - Mar 01 , 2024 | 12:09 PM
ఆర్థిక సంవత్సరంలో జరిగే మార్పులు మార్చి నెల నుంచి ప్రారంభం అవుతాయి. ఈ నెలలో ఐదు కీలక మార్పులు జరగనున్నాయి.
ఏబీఎన్ ఇంటర్నెట్: ఆర్థిక సంవత్సరంలో జరిగే మార్పులు మార్చి (March) నెల నుంచి ప్రారంభం అవుతాయి. ఈ నెలలో ఐదు కీలక మార్పులు (Five Financial Rules) జరగనున్నాయి. వాటితో మధ్య తరగతి వర్గాలపై ప్రభావం ఉండనుందా..? ఉన్నత వర్గాల పన్ను చెల్లింపులు ఎలా ఉండనున్నాయో తెలుసుకుందాం. పదండి.
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కస్టమర్లకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్చి 15వ తేదీన డెడ్ లైన్ విధించిన సంగతి తెలిసిందే. ఆ తేదీ లోపు మీ అకౌంట్లను ఇతర బ్యాంకుల్లోకి మార్చుకోవాలని స్పష్టం చేసింది. 15వ తేదీ తర్వాత పేటీఎం పేమెంట్స్ బ్యాంక్లో నగదు డిపాజిట్ చేయలేరని తేల్చి చెప్పింది. క్రెడిట్ లావాదేవీలు కూడా చేయలేరని వివరించింది.
ఎస్బీఐ క్రెడిట్ కార్డ్
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ ఎస్బీఐ క్రెడిట్ కార్డుపై కీలక నిర్ణయం తీసుకుంది. మినిమం అమౌంట్ డ్యూ (ఎంఏడీ)లో సమూల మార్పులు చేసింది. ఇకపై మినిమం డ్యూపై జీఎస్టీ + ఈఎంఐ అమౌంట్ + 100 శాతం ఫీజు లేదంటే ఛార్జీ + 5 శాతం ఫైనాన్స్ ఛార్జీ + రిటైల్ ఖర్చులు, నగదు అడ్వాన్స్ + ఓవర్ లిమిట్ నగదు మొత్తం ఛార్జీ వేస్తారు.
ఫాస్టాగ్ కేవైసీ
వాహనాల ఫాస్టాగ్ కేవైసీ ఈ నెల లోపు అప్ డేట్ చేసుకోవాలని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వినియోగదారులకు స్పష్టం చేసింది. మార్చి 30వ తేదీ లోపు అప్ డేట్ చేయకుంటే ఫాస్టాగ్ అకౌంట్ పనిచేయదని వివరించింది.
ఫోర్త్ అడ్వాన్స్ ట్యాక్స్ ఇన్ స్టాల్ మెంట్
పన్ను చెల్లింపుదారులు విధిగా మార్చి 15వ తేదీ లోపు ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. గడువు లోపు చెల్లించకుంటే పే చేసే పన్ను మీద సెక్షన్ 234 సీ ప్రకారం జరిమానా విధిస్తారు. నెలకు 1 శాతం వడ్డీ చొప్పున ఫైన్ ఉంటుంది.
ఇది కూడా చదవండి: Bank Holidays In March 2024: మార్చి నెలలో బ్యాంకు సెలవులు ఇవే.. లిస్ట్ చూడండి.
న్యూ జీఎస్టీ రెగ్యులేషన్స్
ఈ ఏడాదికి సంబంధించి మార్చి నెల నుంచి జీఎస్టీ రూల్స్ అమల్లోకి వస్తాయి. కొత్త జీఎస్టీ నిబంధనల ప్రకారం ఏడాదికి రూ.5 కోట్ల కన్నా ఎక్కువ వ్యాపారం జరిగితే లావాదేవీలన్నింటికీ ఇ ఇన్ వాయిస్ రూపొందించాలి. అలా చేయకుండా ఇ బిల్లు రూపొందించడం వీలుపడదు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.