Gold and Silver Price: గోల్డ్ ప్రియులకు గుడ్ న్యూస్..మళ్లీ తగ్గిన బంగారం, వెండి
ABN , Publish Date - Apr 23 , 2024 | 07:04 AM
ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లలో బంగారం(gold) ధరలు నిరంతరంగా పెరుగుతున్న నేపథ్యంలో ఈరోజు కూడా పుత్తడి ప్రియులకు రిలీఫ్ న్యూస్ వచ్చింది. నేడు (ఏప్రిల్ 23న) మంగళవారం బంగారం, వెండి ధరలలో క్షీణత కనిపించింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‍లో ప్రస్తుతం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నిన్న రూ.73,690 ఉండగా, ప్రస్తుతం అది కాస్తా రూ.73,680కి చేరింది.
ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లలో బంగారం(gold) ధరలు నిరంతరంగా పెరుగుతున్న నేపథ్యంలో ఈరోజు కూడా పుత్తడి ప్రియులకు రిలీఫ్ న్యూస్ వచ్చింది. నేడు (ఏప్రిల్ 23న) మంగళవారం బంగారం, వెండి ధరలలో క్షీణత కనిపించింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‍లో ప్రస్తుతం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నిన్న రూ.73,690 ఉండగా, ప్రస్తుతం అది కాస్తా రూ.73,680కి చేరింది. కేవలం 10 రూపాయలు మాత్రమే తగ్గింది.
మరోవైపు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రేటు నిన్న రూ.67,550 ఉండగా, ప్రస్తుతం రూ.67,540కి చేరుకుంది. మిడిల్ ఈస్ట్ వివాదం, US ద్రవ్యోల్బణం డేటా సహా పలు అంశాల నేపథ్యంలో పుత్తడి ధరలు తగ్గినట్లు తెలుస్తోంది. ఇది నిన్నటి రేటుతో పోల్చితే 10 రూపాయలు తగ్గింది. ఈ క్రమంలో దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్న గోల్డ్ రేట్ల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు
హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.67,540, 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.73,680
విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.67,540, 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.73,680
ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.67,690, 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.73,830
ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.67,540, 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.73,680
చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.68,440, 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.74,660
కోల్‌కత్తాలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.67,540, 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.73,680
దేశంలో వెండి(silver) ధరల గురించి మాట్లాడితే ఈ రోజు ధరలలో స్పల్ప మార్పు జరిగింది. నేడు కిలో వెండి ధర రూ.85,400. కాగా నిన్న ఈ ధర కిలో రూ.85,500. అంటే వెండి ధరలు 100 రూపాయలు తగ్గాయి. ఇక హైదరాబాద్‌లో కిలో వెండి ధర ప్రస్తుతం రూ.88,900కు చేరింది. ఇది నిన్న 89 వేలుగా ఉండేది.
గమనిక: ఈ బంగారం, వెండి ధరల సమాచారం సూచికగా మాత్రమే ఉంటాయి. GST, TCS, ఇతర ఛార్జీలను కలిగి ఉండవు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక ఆభరణాల వ్యాపారిని సంప్రదించండి.
ఇది కూడా చదవండి:
IMD: దేశంలో మరో 5 రోజులు మండే ఎండలు..ఈ ప్రాంతాలకు అలర్ట్
CIBIL Score: ఈ తప్పులు చేస్తున్నారా.. మీ సిబిల్ స్కోర్ ఖతం
Read Latest Business News and Telugu News