IMD: దేశంలో మరో 5 రోజులు మండే ఎండలు..ఈ ప్రాంతాలకు అలర్ట్
ABN , Publish Date - Apr 23 , 2024 | 06:40 AM
దేశంలోని అనేక ప్రాంతాల్లో రాబోయే ఐదు రోజుల పాటు ఎండతోపాటు వేడిగాలులు(Heat wave) కొనసాగుతాయని భారత వాతావరణ విభాగం (IMD) సోమవారం తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రధానంగా పశ్చిమ బెంగాల్, ఒడిశా, జార్ఖండ్, బీహార్‌లోని పలు ప్రాంతాల్లో వేడి పరిస్థితులు కొనసాగుతాయని వెల్లడించింది.
దేశంలోని అనేక ప్రాంతాల్లో రాబోయే ఐదు రోజుల పాటు ఎండతోపాటు వేడిగాలులు(Heat wave) కొనసాగుతాయని భారత వాతావరణ విభాగం (IMD) సోమవారం తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రధానంగా పశ్చిమ బెంగాల్, ఒడిశా, జార్ఖండ్, బీహార్‌లోని పలు ప్రాంతాల్లో వేడి పరిస్థితులు కొనసాగుతాయని వెల్లడించింది. గాలిలో అధిక తేమ కారణంగా కోస్తా ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, కర్నాటక, గోవా, కేరళ, పశ్చిమ బెంగాల్, బీహార్‌లలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారని సూచించింది.
ఈ క్రమంలోనే ఏప్రిల్ 22, ఏప్రిల్ 23 తేదీలలో తూర్పు మధ్యప్రదేశ్‌లో రాత్రి ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉంటుందని వెల్లడించింది. అయితే రాత్రి పూట ఉష్ణోగ్రత ప్రమాదకరమని, శరీరం చల్లబడేందుకు అవకాశం తక్కువగా ఉంటుందని తెలిపింది.
వాతావరణ శాఖ ప్రకారం ఏప్రిల్‌లో దేశం(india)లోని వివిధ ప్రాంతాలలో సాధారణంగా ఒకటి నుంచి మూడు రోజుల వ్యవధితో పోలిస్తే నాలుగు నుంచి ఎనిమిది రోజుల పాటు వేడి తరంగాలు ఉండే అవకాశం ఉందని IMD చెప్పింది. సాధారణంగా నాలుగు నుంచి ఎనిమిది రోజులతో పోలిస్తే మొత్తం ఏప్రిల్-జూన్ కాలంలో 10 నుంచి 20 రోజుల పాటు వేడిగాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేసింది.
గరిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే 6.4 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా ఉన్నప్పుడు తీవ్రమైన వేడి తరంగాలు(Heatwave) ఏర్పడతాయి. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్, గుజరాత్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, మధ్య మహారాష్ట్ర, విదర్భ, మరఠ్వాడా, బీహార్, జార్ఖండ్‌లలో ఎక్కువ వేడి తరంగాలు వీచే అవకాశం ఉందని అంచనా వేసింది. దీంతోపాటు రానున్న మూడు రోజుల్లో దేశ రాజధాని ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంటుందని ఐఎండీ వెల్లడించింది.
ఇది కూడా చదవండి:
CIBIL Score: ఈ తప్పులు చేస్తున్నారా.. మీ సిబిల్ స్కోర్ ఖతం
Read Latest National News and Telugu News.