Home » Delhi
దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీకి వచ్చే నెల 5న ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆప్ అధినేత కేజ్రీవాల్‌పై దాడికి ఖలిస్థాన్ అనుకూల సంస్థ కుట్ర పన్నుతున్నట్టు నిఘా వర్గాల నివేదికలు చెబుతున్నాయి.
దేశ రక్షణ వ్యవస్థలోకి మరో సరికొత్త క్షిపణి వ్యవస్థ చేరనుంది. డ్రోన్ విధ్వంసక సూక్ష్మ క్షిపణి వ్యవస్థ ‘భార్గవాస్త్రం’ను భారత్ విజయంతంగా పరీక్షించింది.
కేజ్రీవాల్ తన భార్య, పార్టీ కార్యకర్తలతో కలిసి పాదయాత్రగా రిటర్నింగ్ అధికారి కార్యాలయాని వెళ్లి నామినేషన్ పత్రాలు అందజేశారు. దీనికి ముందు కన్నాట్ ప్లేస్‌లోని ప్రాచీన హనుమాన్ మందిరంలో సతీసమేతంగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
దేశానికి స్వాతంత్ర్యం 1947లో రాలేదని, రామ్ మందిర్ నిర్మాణం జరిగినప్పుడే వచ్చిందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారని, దేశంలో రెండు భావజాలాలు ఉన్నాయని, అందులో ఒకటి రాజ్యాంగబద్ధమైన భావజాలం తమదని, మరొకటి ఆర్ఎస్ఎస్ భావజాలమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది..
నీళ్ల విషయంలో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరగవద్దని... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 811 టిఎంసిల నీటి కేటాయింపులు జరిగాయని, ఆ వాదనను తాము ఇప్పుడు ఏకీభవించడం లేదని తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్న సంగతి తెలిసిందే. రెండ్రోజుల పాటు ఆయన ఢిల్లీలో బిజిబిజీగా గడపనున్నారు.బుధవారం జరిగే ఏఐసీసీ కార్యాలయం ప్రారంభోత్సవంలో రేవంత్ రెడ్డి సహా.. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, పలువురు మంత్రులు, కీలక నేతలు పాల్గొంటారు. ఈ కార్యక్రమం తర్వాత పార్టీ అధిష్ఠానంతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అవుతారు.
ఫార్ములా ఈ కారు రేస్ కేసుకు సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సుప్రీం కోర్టులో వేసిన క్వాష్ పిటిషన్‌పై బుధవారం జస్టిస్ బేలా ఎం. త్రివేది, జస్టిస్ ప్రసన్న బి. వరాలే ధర్మాసనం ముందు కేసు విచారణ జరగనుంది.
కాగ్ నివేదికపై అసెంబ్లీలో చర్చించకుండా ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తున్నారంటూ ఆప్ ప్రభుత్వంపై ఢిల్లీ హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది.
భారతదేశంలో అక్షరాస్యత, మహిళల ఓటింగ్ శాతానికి మధ్య గణనీయమైన సంబంధం ఉందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదిక వెల్లడించింది.