Share News

Delhi : దేశంలో 5 కోట్ల పెండింగ్‌ కేసులు

ABN , Publish Date - Jul 27 , 2024 | 04:05 AM

దేశవ్యాప్తంగా ఉన్న కోర్టుల్లో 5 కోట్లకుపైగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ విషయాన్ని కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌ ఓ లిఖితపూర్వక సమాధానం ద్వారా లోక్‌సభకు తెలిపారు.

Delhi : దేశంలో 5 కోట్ల పెండింగ్‌  కేసులు

న్యూఢిల్లీ, జూలై 26: దేశవ్యాప్తంగా ఉన్న కోర్టుల్లో 5 కోట్లకుపైగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ విషయాన్ని కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌ ఓ లిఖితపూర్వక సమాధానం ద్వారా లోక్‌సభకు తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా 1.18 కోట్ల కేసులు, సుప్రీంకోర్టులో 84,045 కేసులు, వివిధ హైకోర్టుల్లో 60,11,678 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని వివరించారు.

తగినన్ని మౌలిక వసతులు, తగినంత మంది సిబ్బంది లేకపోవడం కూడా ఇందుకు కారణాలని తెలిపారు. సంక్ష్లిష్టమైన అంశాల కారణంగా మరికొన్ని పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. నిబంధనలను కచ్చితంగా అమలు పరచడం వల్ల కూడా ఇంకొన్ని పెండింగ్‌లో ఉంటున్నాయని తెలిపారు.

Updated Date - Jul 27 , 2024 | 04:06 AM