Share News

Garudavega: గరుడవేగ కొత్త సీఈఓగా లక్కరాజు నియామకం

ABN , Publish Date - Jul 18 , 2024 | 01:09 PM

గరుడవేగ(Garudavega) కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా సతీష్ లక్కరాజు(Lakkaraju sathish) నియమితులయ్యారు. లాజిస్టిక్స్ పరిశ్రమలో 30 ఏళ్ల అనుభవం ఉన్న సతీష్.. విజ్ ఫ్రైట్, ఎజిలిటీ లాజిస్టిక్స్, డాచెర్ ఇండియాలో కీలక పాత్ర పోషించారు.

Garudavega: గరుడవేగ కొత్త సీఈఓగా లక్కరాజు నియామకం
Garudavega ceo

గరుడవేగ(Garudavega) కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా సతీష్ లక్కరాజు(Lakkaraju sathish) నియమితులయ్యారు. లాజిస్టిక్స్ పరిశ్రమలో 30 ఏళ్ల అనుభవం ఉన్న సతీష్.. విజ్ ఫ్రైట్, ఎజిలిటీ లాజిస్టిక్స్, డాచెర్ ఇండియాలో కీలక పాత్ర పోషించారు. దీంతోపాటు లక్కరాజు గరుడవేగకు ఎంతో నైపుణ్యం గల సేవలను అందించారు. ఈ సందర్భంగా గరుడవేగలో ఈ పదవి దక్కడం గౌరవంగా భావిస్తున్నానని లక్కరాజు అన్నారు. ఈ క్రమంలో సంస్థను వృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తానని లక్కరాజు ధీమా వ్యక్తం చేశారు.


పలు దేశాలకు

గరుడవేగ (Garudavega) భారతదేశం అంతటా 185+ స్థానాల్లో 400కి పైగా శాఖలను కల్గి ఉంది. USA, UK, UAE, ఆస్ట్రేలియా, కెనడా సహా పలు ప్రాంతాలకు వేగవంతమైన, విశ్వసనీయతతో తక్కువ ఖర్చుతో అంతర్జాతీయ షిప్పింగ్ పరిష్కారాలను అందిస్తోంది. ప్రసిద్ధి చెందిన గరుడవేగ ప్రపంచవ్యాప్తంగా భారతీయ వ్యాపార కార్యకలాపాలకు 24/7 అందుబాటులో ఉంటుంది.


ఉద్యోగుల సహకారం

గరుడవేగలో ఉద్యోగులు సహృదయత, సమిష్టి కృషికి నిదర్శనమని చెప్పవచ్చు. ఎందుకంటే భారతదేశం అంతటా ఉద్యోగులు అనేక వినోద కార్యక్రమాలలో పాల్గొన్నారు. దీంతోపాటు అనేక ఎక్సలెన్స్ అవార్డుల వేడుకల్లో వారి అత్యుత్తమ సహకారానికి గుర్తింపు లభించింది. ఈ క్రమంలో ఉద్యోగులు గరుడవేగను మరింత ముందుకు నడిపించేందుకు ఉన్నత విలువలు, ప్రమాణాలను కల్గి ఉన్నారని చెప్పవచ్చు.


ఇవి కూడా చదవండి:

ITR Filing 2024: ఐటీఆర్ ఫైలింగ్.. మీ ఆదాయపు పన్ను రిటర్న్‌ను ఇలా ధృవీకరించుకోండి

Budget 2024: బడ్జెట్‌ 2024లో ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త..!

రియల్టీలోకి పీఈ పెట్టుబడులు రూ.25,000 కోట్లు


For Latest News and Business News click here

Updated Date - Jul 18 , 2024 | 01:09 PM