Personal Finance: రోజూ రూ. 171 సేవ్ చేసి.. రూ. 28 లక్షలు దక్కించుకోండి..
ABN , Publish Date - Nov 20 , 2024 | 01:35 PM
ప్రతిరోజు తక్కువ మొత్తంలో సేవింగ్స్ చేసి మీరు మంచి మొత్తా్న్ని పొందాలని చూస్తున్నారా. అయితే ఈ వార్త మీ కోసమే. ఎందుకంటే ఇక్కడ వందల్లో సేవ్ చేసి, దీర్ఘకాలంలో లక్షలు పొందే అవకాశం ఉంది. అది ఎలా అనేది ఇక్కడ తెలుసుకుందాం.
మీరు తక్కువ మొత్తంలో పెట్టుబడులు (investments) చేసి మంది ఆదాయాన్ని పొందాలని చూస్తున్నారా. అందుకు ప్రభుత్వ పథకాలలో ఒకటైన LICలో జీవన్ తరుణ్ స్కీం అనే మంచి స్కీం ఉంది. దీనిలో మీరు మీ పిల్లల కోసం ఒక పెట్టుబడి విధానాన్ని ఎంపిక చేసుకోవచ్చు. అందుకోసం ప్రతి రోజు మీరు కనీసం రూ. 150 చెల్లించి మీ పిల్లల భద్రతకు భరోసా కల్పించుకోవచ్చు. రోజుకు రూ. 150 ఇన్వెస్ట్ చేస్తే ఏడాదికి రూ. 54000 ఆదా చేసుకోవచ్చు. ఆ క్రమంలో మీరు ఎనిమిదేళ్లు చెల్లించాలి.
కనీస వయస్సు
ఈ పథకం ప్రయోజనాలను పొందడానికి మీ పిల్లల కనీస వయస్సు 3 నెలలు లేదా గరిష్టంగా 12 సంవత్సరాలు ఉండాలి. మీ బిడ్డకు 20 ఏళ్లు వచ్చే వరకు ప్రీమియం చెల్లించాలి. దీనికి 5 సంవత్సరాల లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. మీ బిడ్డకు 25 సంవత్సరాలు నిండినప్పుడు, ఆమె కళాశాల ఫీజులు లేదా వివాహానికి కూడా చెల్లించడానికి వచ్చే మొత్తం డబ్బును ఉపయోగించుకోవచ్చు. బీమా చేసిన మొత్తానికి గరిష్ట పరిమితి లేదు. పిల్లల వయస్సు 12 సంవత్సరాలు అయితే, పాలసీ వ్యవధి 13 సంవత్సరాలుగా ఉంటుంది. ఈ సందర్భంలో కనీస బీమా మొత్తం రూ. 5 లక్షలు కూడా అందజేస్తారు.
ఎన్నేళ్లు పడుతుందంటే..
ఆ క్రమంలో మీరు ప్రతి ఏటా రూ. 54000 ప్రీమియం చెల్లిస్తే, మీరు మొత్తం రూ.4,32,000 పెట్టుబడి చేస్తారు. ఆ తర్వాత మరో ఎనిమిది సంవత్సరాల లాక్ ఇన్ పీరియడ్ తర్వాత మీరు రూ. 8,44,500 పొందుతారు. ఈ నేపథ్యంలోనే మీ పిల్లల వయస్సు 18 సంవత్సరాల వరకు రోజుకు రూ. 171 పెట్టుబడి పెడితే, మీరు రూ. 1089196 పెట్టుబడి చేస్తారు. కానీ 23 ఏళ్ల తర్వాత మీకు వచ్చే మొత్తం రూ. 28,24,800 అవుతుంది.
మెచ్యూరిటీ సమయంలో..
మీరు LIC జీవన్ తరుణ్ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా మంచి ఫండ్‌ను సృష్టించుకోవచ్చు. మెచ్యూరిటీలో మీరు రూ. 28 లక్షల కంటే ఎక్కువ మొత్తం తిరిగి పొందుతారు. అన్ని వయసుల వారు, సమాజంలోని అన్ని వర్గాల LIC సేవింగ్స్ ఉత్పత్తులను ఉపయోగించుకోవచ్చు. మీరు LIC జీవన్ తరుణ్ స్కీంలో మీరు చేసే పెట్టుబడిని బట్టి మీకు వచ్చే మొత్తం ఆధారపడి ఉంటుంది. ప్రతి నెలలో మీరు ఎక్కువ మొత్తాన్ని తక్కువ సమయంలో పెట్టుబడులు చేసినా కూడా మంచి మొత్తాన్ని దక్కించుకోవచ్చు.
ఇవి కూడా చదవండి:
Personal Finance: నెలకు రూ. 5 వేలు సేవ్ చేస్తే.. రూ. 2 కోట్ల కోసం ఎన్నేళ్లు కట్టాలి..
Aadit Palicha: చదువు, జాబ్ వదిలేసి స్టార్టప్ పెట్టాడు.. ఇప్పుడు రూ.4300 కోట్ల సంపదకు..
Chrome Browser: గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌ను సేల్ చేస్తున్నారా.. అమెరికా ప్రభుత్వం..
PAN Aadhaar: పాన్ ఆధార్ ఇంకా లింక్ చేయలేదా.. ఇప్పుడే చేసుకోండి, గడవు సమీపిస్తోంది..
Read More Business News and Latest Telugu News