Share News

PAN-Aadhaar Linking: ఆధార్‌కు పాన్ లింక్ చేయలేదా.. ఇవన్నీ కట్!

ABN , Publish Date - May 28 , 2024 | 03:55 PM

పన్ను చెల్లింపుదారులు మే 31(శుక్రవారం) లోపు పాన్‌ కార్డును ఆధార్ కార్డ్‌తో లింక్ చేయాలని ఆదాయపు పన్ను(Income Tax) శాఖ మంగళవారం సూచించింది. అలా చేయడంలో విఫలమైతే అధిక రేటుతో పన్ను కోతలు వస్తాయని పేర్కొంది.

PAN-Aadhaar Linking: ఆధార్‌కు పాన్ లింక్ చేయలేదా.. ఇవన్నీ కట్!

ఢిల్లీ: పన్ను చెల్లింపుదారులు మే 31(శుక్రవారం) లోపు పాన్‌ కార్డును ఆధార్ కార్డ్‌తో లింక్ చేయాలని ఆదాయపు పన్ను(Income Tax) శాఖ మంగళవారం సూచించింది. అలా చేయడంలో విఫలమైతే అధిక రేటుతో పన్ను కోతలు వస్తాయని పేర్కొంది.

టీడీఎస్‌/టీసీఎస్‌ చెల్లింపులు ఎగవేసినట్లుగా కొంతమంది పన్ను చెల్లింపుదారులు నోటీసులు అందుకున్నారని గుర్తుచేసింది. దీనికి పాన్‌ నిరుపయోగంగా మారడమే కారణమని తెలిపింది. అధిక రేటు వద్ద పన్ను కోత/చెల్లింపు చేయకపోవటం వల్ల నోటీసులు అందాయని తెలిపింది.


" మీ పాన్‌ను మే 31లోపు ఆధార్‌తో లింక్ చేసి.. అధిక రేటుతో పన్ను కోతలను నివారించండి" అని ఎక్స్‌లో చేసిన పోస్టులో పేర్కొంది.పాన్, ఆధార్ లింక్ చేస్తే 1961లోని 206AA, 206CC సెక్షన్‌ ప్రకారం పన్నుల్లో కోతలు పడకుండా, పన్ను వసూళ్లను ఎదుర్కోలేదని నిర్ధారిస్తాయి. పాన్‌ను ఆధార్ కార్డ్‌తో లింక్ చేయమని ఐటీ శాఖ పన్ను చెల్లింపుదారులను కోరడం ఇదే మొదటిసారి కాదు.

ఏప్రిల్ 23, 2024 నాటి సర్క్యులర్‌లో, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) ఈ ప్రకటన జారీ చేసింది. దేశంలోని పన్ను చెల్లింపుదారులందరికీ ఆధార్ కార్డ్‌తో పాన్‌ను లింక్ చేయడాన్ని ఐటీ శాఖ తప్పనిసరి చేసింది. గడువుకు ముందు రెండింటిని లింక్ చేయడంలో విఫలమైతే, మీ పాన్ కార్డ్‌లు పనిచేయవు. పాన్ పనిచేయకుండా ఉన్న కాలానికి రీఫండ్‌పై ఎలాంటి వడ్డీ చెల్లించరు. అయితే, మినహాయించిన వారికి పాన్‌ను ఆధార్ కార్డ్‌తో లింక్ చేయనందుకు ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సిన అవసరం లేదు.


లింక్ స్టేటస్ చెక్ చేయండిలా..

  • లింక్ క్లిక్ చేసి ఆదాయపు పన్ను ఇ-ఫైలింగ్ పోర్టల్‌ని సందర్శించండి .

  • హోమ్‌పేజీలో, 'Quick Links' ఆప్షన్‌పై క్లిక్ చేయండి.

  • లింక్ ఆధార్ స్థితిపై క్లిక్ చేసి, కొత్త పేజీలో మీ పాన్, ఆధార్ కార్డ్ నంబర్‌లను అందించండి.

  • పాన్, ఆధార్ ఇప్పటికే లింక్ చేసి ఉంటే "Your PAN is already linked to given Aadhaar" అనే పాప్‌అప్ కనిపిస్తుంది.

  • లింక్ కాకుంటే “PAN ఆధార్‌తో లింక్ కాలేదు. ఆధార్‌ను పాన్‌తో లింక్ చేయడానికి 'లింక్ ఆధార్'పై క్లిక్ చేయండి”అని వస్తుంది.

For More National News and Telugu News..

Updated Date - May 28 , 2024 | 04:22 PM